రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు నిర్వీర్యం
బెర్లిన్: జర్మనీ దేశ రాజధాని బెర్లిన్ లో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బాంబును పోలీసులు గుర్తించినట్టు అక్కడి స్థానిక మీడియా సోమవారం వెల్లడించింది. 250 కేజీ బరువు గల అమెరికన్ బాంబును నిర్వీర్యం చేసే ఆపరేషన్ లో భాగంగా 11 వేల మంది ప్రజలను అక్కడి నుంచి తరలించినట్టు పేర్కొంది. జీవీస్ మ్యూజియం సమీపంలో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తయారుచేసిన అమెరికన్ బాంబును గుర్తించి... ఆదివారం రెండు డిటోనేటర్లను అధికారులు నిర్వీర్యం చేసినట్టు ఈఎఫ్ఈ న్యూస్ నివేదించింది. ఈ ఆపరేషన్ సమయంలో కొన్ని మెట్రో, బస్సు లైన్లను కూడా తాత్కలికంగా నిలిపివేశారు.
అదే సమయంలో నిర్మాణంలో ఉన్న ఓ పాఠశాల వద్ద 4 మీటర్ల లోతు వరకు పాతిపెట్టిన మరో బాంబును అధికారులు గుర్తించారు. ఈ బాంబును నిర్వీర్యం చేసేందుకు.. పరిసర ప్రాంతాల్లో నివసించే 5 వేల మందిని ఖాళీ చేయించారు. ఇలాంటి ఆపరేషన్లు జర్మనీలో జరగడం అసాధారణం కాదు. 2011 లో కోబెన్జ్ లో బాంబును కనుగోనేందుకు అతిపెద్ద ఆపరేషన్ లో భాగంగా 45 వేల మంది ప్రజలను బలవంతంగా వారి ఇళ్లను నుంచి తరలించారు.