‘జడ్జిమెంటల్ హై క్యా’ ట్రైలర్ వచ్చేసింది!
ముంబై: కంగనా రనౌత్, రాజ్‌కుమార్ రావు మరోసారి తెరపైన మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఐదేళ్ల కిందట క్వీన్ సినిమాతో అలరించిన ఈ జోడీ.. తాజాగా ‘జడ్జిమెంటల్ హై క్యా’ సినిమాతో ప్రేక్షకులను పలుకరించబోతోంది. ‘సైజ్ జీరో’ వంటి తెలుగు చిత్రాలను తెరకెక్కించిన ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.
ఒక మర్డర్ మిస్టరీలో నిందితులుగా ఈ సినిమాలో కంగనా, రాజ్‌కుమార్ బాబీ, కేశవ్ పాత్రల్లో కనిపించనున్నారు. సంక్లిష్టమైన, ఒకింత మతిస్థిమితంలేని బాబీ పాత్రను కంగనా అద్భుతంగా పోషించినట్టు సినిమా ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతూ ఆద్యంతం ఉత్కంఠ రేపేలా ‘జడ్జిమెంటల్ హై క్యా’ సినిమా ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు మొదట ‘మెంటల్ హై క్యా’ టైటిల్ పెట్టినప్పటికీ.. ఇండియన్ మెంటల్ హెల్త్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో సినిమా టైటిల్‌ను మార్చిన సంగతి తెలిసిందే.