junaid
-
నాకు అండగా నిలబడ్డావు, నీవల్లే ఇలా మారాను: సమంత
హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ మూవీ యశోద. ఈ మూవీలో సామ్ అమాయకంగా కనిపిస్తూనే యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టిందంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో యాక్షన్ సన్నివేశాల్లో నటించేందుకు సహకరించిన తన ఫిట్నెస్ ట్రైనర్ జునైద్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పింది సామ్. ఈ మేరకు సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ షేర్ చేసింది. 'నాకిష్టమైన జిలేబీ తినడానికి జునైద్ ఎప్పుడూ ఒప్పుకోలేదు. కానీ యశోద విజయాన్ని, మరీ ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలను సెలబ్రేట్ చేసుకోవడానికి ఈరోజు జిలేబీ తీసుకొచ్చాడు. గత కొన్ని నెలలుగా నా వెన్నంటి నిలబడినవారిలో నువ్వూ ఒకరివి. నిరాశగా, బలహీనంగా ఉన్నప్పుడు, కన్నీళ్లు పెట్టుకున్న సమయాల్లో, హై డోస్ స్టెరాయిడ్ ధెరపీ చేయించుకున్నప్పుడు కూడా నా వెంటే ఉన్నావు. నాతో వర్కవుట్లు చేయించావు. నువ్వు నన్ను గివప్ చేయనివ్వలేదు, ఎప్పటికీ గివప్ చేయనివ్వవు కూడా! నీవల్లే ఇలా మారాను. థాంక్యూ' అని రాసుకొచ్చింది. ఈ పోస్టుకు ఫిట్నెస్ ట్రైనర్ ఆప్యాయంగా హత్తుకున్న ఫొటోతో పాటు ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో సమంత చేతికి సెలైన్ స్ట్రిప్ ఉన్నప్పటికీ జిమ్‌లో వర్కవుట్ చేస్తుండటం గమనార్హం. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) చదవండి: -
బంగ్లాలో చిక్కుకున్న అమీర్ ఖాన్ తనయుడు
బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్ఫెక్షనిస్టు అమీర్ ఖాన్ తన కుటుంబంతో కలిసి ముంబైలోని పాలీ హిల్‌లో నివసిస్తున్నారు. కానీ ఆయన తనయుడు జునైద్ మాత్రం పాంచ్‌గానీ బంగ్లాలో చిక్కుకుపోయారు. అయితే ఏప్రిల్ 14న లాక్డౌన్ ముగుస్తుందని, అప్పుడు ఇంటికి రావచ్చు అనుకునే సమయానికి మే 3 వరకు లాక్డౌన్ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అతడు ముంబైకి తిరిగి రావడానికి వీల్లేకుండా పోయింది. అందరూ ఒక్కచోట ఉంటే తన కొడుకు మాత్రం ఒంటరిగా ఉన్నాడంటూ హీరో విచారం వ్యక్తం చేశాడు. కాగా అమీర్, ఆయన మొదటి భార్య రీనా దత్తా సంతామే జునైద్, ఇరా. (డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వనున్న ఆమిర్ కూతురు!) వీళ్లిద్దరూ సినిమాలపై ఆసక్తి చూపిస్తుండగా జునైద్ నటనలో, ఇరా దర్శకత్వంలో ఎంటరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక తన కెరీర్‌ను మలుపు తిప్పిన ‘లగాన్’ సినిమా షూటింగ్ సమయంలో అమీర్.. అసిస్టెంట్ డైరెక్టర్ కిరణ్‌రావుతో ప్రేమలో పడగా ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఆజాద్ అనే కుమారుడు ఉన్నాడు. కాగా అమీర్ ఖాన్ ప్రస్తుతం "లాల్‌సింగ్ చద్దా" సినిమాలో నటిస్తున్నాడు. ఇది హాలీవుడ్ చిత్రం "ఫారెస్ట్ గంప్"కు రీమేక్. దీంతో పాటు గుల్షన్ కుమార్ బయోపిక్ "మొఘల్" సినిమాలో కనిపించనున్నాడు. (ప్రేమ విషయాన్ని దాచలేదు: ఆమిర్ కూతురు) -
చెడు దుర్వాసన లాంటిది
తోటి వారు సంతోషాల్లో ఉంటే చూసి ఏడ్వడం, బాధల్లో ఉంటే నవ్వడం మనల్ని కష్టాలు పాలు చేస్తుంది. జునైద్ తెలివైన యువకుడు. అందుకే అతడంటే పాదుషాకి ఎంతో అభిమానం. జునైద్ ను సంప్రదించకుండా ఏ నిర్ణయమూ తీసుకునేవాడు కాదు. అది చూసి దర్బారులోని ఒక మంత్రి ఓర్వలేకపోయాడు. దర్బారునుంచి జునైద్ ను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని రకరకాల కుట్రలు పన్నేవాడు. ఒకరోజు పాదుషా దగ్గరికెళ్లి ‘‘పాదుషా గారు జునైద్ మీ గురించి చెడుగా చెబుతున్నాడు. మీ దేహం నుంచి దుర్వాసన వస్తుందని ప్రచారం చేస్తున్నాడు. కావాలంటే రేపు అతను దర్బారులోకి రాగానే అతన్ని మీ దగ్గరకు పిలిపించుకుని చూడండి. అతను మీతో మాట్లాడేటప్పుడు ముక్కు, నోరు మూసుకుని మీతో మాట్లాడతాడు.’’ విషం చిమ్మాడతను. మంత్రి మాటలకు పాదుషా ఆశ్చర్యపోయాడు. రెండోరోజు ఉదయం మంత్రి తన పథకంలో భాగంగా జునైద్ కు మాయమాటలు చెప్పి తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు. విందు ముగిసాక మాటల్లో పెట్టి వెల్లిపాయలు తినిపించాడు. విందు అవగానే జునైద్ దర్బారుకు వెళ్లాడు. జునైద్‌ను ఏదో అడిగేందుకు పాదుషా దగ్గరికి పిలిపించుకోగానే తన నోటినుంచి వస్తున్న దుర్వాసన వల్ల పాదుషా గారికి ఇబ్బంది కలుగుతుందనే భయంతో ముక్కూ, నోరు మూసుకున్నాడు. అది చూసిన పాదుషా మంత్రి చెప్పింది నిజమేనని నిర్ధారించుకున్నాడు. జునైద్ మీద కట్టలు తెగేంత కోపం వచ్చింది. వెంటనే ఒక లేఖను రాసి ఈ లేఖను గవర్నర్‌కు ఇమ్మని దానికి జునైద్ కు అందించాడు. జునైద్ లేఖను తీసుకుని దర్బారు నుంచి బయటకు వచ్చాడు. దారిలోనే మంత్రి ఎదురయ్యాడు. జునైద్ చేతిలో ఉన్న లేఖను చూసి ‘ఈ ఉత్తరంలో ఏముంది?’ అని అడిగాడు. ‘‘పాదుషా గారు నాకోసం నగదు బహుమతులు ఇవ్వమని సిఫారసు లేఖ రాశారనుకుంటాను’’ అని చెప్పాడు. మంత్రి ఆ లేఖను తనకివ్వవలసిందిగా ప్రాధేయపడ్డాడు. జునైద్ ఆ ఉత్తరాన్ని మంత్రికి ఇచ్చేశాడు. మంత్రి ఆ ఉత్తరాన్ని అందుకుని ఎంతో సంబరపడుతూ తీసుకెళ్లి గవర్నర్ కు అందించాడు. గవర్నర్ ఉత్తరాన్ని తెరిచి చూడగా అందులో ‘‘ఈ లేఖను తెచ్చిన వ్యక్తిని ఉరితీసి చంపేయండి. శవాన్ని నా దగ్గరకు పంపండి’’ అని రాసి ఉంది. పాదుషా గారి ఆజ్ఞ మేరకు మంత్రిని ఉరికొయ్యకు వేలాడదీశారు. మరునాడు యధావిధిగా దర్బారుకు వచ్చిన జునైద్‌ను చూసిన పాదుషా నిర్ఘాంతపోయి తానిచ్చిన ఆ ఉత్తరం ఏమయ్యిందని అడిగారు. జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు జునైద్. ఈ మాటలు విన్న పాదుషా నువ్వు మంచి వాడివి కాబట్టే నీ మంచే నిన్ను బతికించింది. పాపానికి ఒడిగట్టిన ఆ మంత్రికి తగిన శాస్తి జరిగిందని చెప్పి జునైద్ కు విలువైన కానుకలు అందించాడు. తోటి వారు సంతోషాల్లో ఉంటే చూసి ఏడ్వడం, బాధల్లో ఉంటే నవ్వడం మనల్ని కష్టాలు పాలు చేస్తుంది. – ముహమ్మద్ ముజాహిద్ -
ఉగ్రవాదంలోకి రాజకీయ నేత కొడుకు
శ్రీనగర్: కశ్మీర్‌లోని తెహ్రీక్–ఎ–హురియత్ అనే రాజకీయ పార్టీ చైర్మన్ కొడుకు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలో చేరాడు. పార్టీ చైర్మన్‌గా అష్రఫ్ శెరాయ్ ఇటీవలే ఎన్నికయ్యారు. 26 ఏళ్ల వయసున్న ఆయన కొడుకు జునైద్ శుక్రవారం అదృశ్యమయ్యాడు. దీనిపై అష్రఫ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఏకే–47 తుపాకీ పట్టుకుని ఆయుధాలు ధరించిన జునైద్ ఫొటో శనివారం సోషల్‌మీడియాలో కనిపించింది. -
అలా అయితేనే సపోర్ట్ చేస్తా: ఆమిర్ ఖాన్
ముంబై: బాలీవుడ్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ సినిమాల విషయంలోనే కాదు తన పిల్లల విషయంలోనూ అలాగే ఉంటానంటున్నాడు. తన పిల్లలు సినిమాల్లోకి రావాలనుకున్నంత మాత్రాన సహాయం చేయనని, వారు దానికి అర్హులు అని తాను భావించినప్పుడే సపోర్ట్ చేస్తానని ముంబైలో విలేకరులతో మాట్లాడుతూ ఆమిర్ స్పష్టం చేశాడు. ఆమిర్‌కు మొదటి భార్య రీనా దత్తాతో ఇద్దరు పిల్లలు.. జునైద్, ఇరాలు ఉన్న విషయం తెలిసిందే. కాగా జునైద్ ఇప్పటికే సినీ రంగం వైపు అడుగులేస్తూ.. తండ్రి నటించిన పీకే సినిమాకు.. దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణి వద్ద అసిస్టెంట్‌గా వర్క్ చేశాడు. జునైద్ థియెటర్‌కు సంబంధించి అధ్యయనం చేస్తున్నాడని.. అయితే ఇరా మాత్రం అలాంటి ప్లాన్లేమీ లేకుండా తన బాటలో నడుస్తోందని ఆమిర్ అన్నాడు. టాలెంట్ ఉంటే వారిని తప్పకుండా సినీరంగం వైపు ఎంకరేజ్ చేస్తానంటూ చెప్పుకొచ్చాడు.