సెమీస్‌లో అక్షర
న్యూఢిల్లీ: జాతీయ జూనియర్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్ అండర్-16 బాలికల సింగిల్స్‌లో రాష్ట్ర క్రీడాకారిణి ఇస్కా అక్షర సెమీస్‌కు చేరింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ అక్ష ర 6-1, 6-2తో రిషిక (తమిళనాడు)పై నెగ్గింది. తనతో పాటు వన్షిక 6-2, 6-3తో జెనిఫర్ లుయిఖామ్పై, రమ్య నటరాజ్ 2-6, 7-6, 6-2తో రెండో సీడ్ జీల్ దేశాయ్‌పై, అభినిక 2-6, 6-4, 6-1తో స్నేహల్ మానెపై గెలిచి సెమీస్‌కు అర్హత సాధించారు.
సెమీఫైల్లో అక్షర తన డబుల్స్ భాగస్వామి వన్షిక (న్యూఢిల్లీ)తో తలపడనుంది. మరో వైపు ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు శివదీప్ కొసరాజు, మాన్సి రెడ్డి క్వార్టర్‌ఫైనల్స్‌లో ఓటమి చవిచూశారు. అండర్-14 బాలుర సింగిల్స్‌లో శివదీప్ కొసరాజు 1-6, 3-6తో యుగల్ చేతిలో,బాలికల సింగిల్స్‌లో మాన్సి రెడ్డి 1-6, 1-6తో మిహికా యాదవ్ చేతిలో పరాజయం పొందారు.