Juvenile offenders
-
13 మందికి సుప్రీం బెయిల్
సాక్షి, న్యూఢిల్లీ: బాల నేరస్తులుగా శిక్షా కాలం ముగిసినా సాధారణ జైళ్లలో ఉన్న 13 మందికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఖైదీల వయసు దరఖాస్తులను పరిష్కరించాలని అలహాబాద్ కోర్టులో న్యాయవాది రిషి మల్హోత్రా 2012లో పిటిషన్ దాఖలు చేశారు. దానికి అనుగుణంగా 13 మంది పిటిషనర్లు నేరాలకు పాల్పడిన సమయంలో బాలలేనని ప్రకటించారు. బాల నేరస్తులుగా ప్రకటించడానికి జువెనైల్ జస్టిస్ బోర్డు నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేనప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని పిటిషనర్లు పేర్కొన్నారు. 13 మంది కేసులకు సంబంధించిన అప్పీళ్లు హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. 18 ఏళ్లలోపు వారికి గరిష్టంగా మూడేళ్లు జైలు శిక్ష అని, అదీ జువెనైల్ గృహాల్లో ఉంచాలని జువెనైల్ జస్టిస్ యాక్ట్ , 2000 సెక్షన్ రెడ్విత్ సెక్షన్ 26 చెబుతోందని పిటిషన్లో పేర్కొన్నారు. జువెనైల్ చట్టం ప్రకారం గరిష్టకాలం శిక్షఅనుభవించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ పిటిషన్లను గురువారం జస్టిస్ ఇందిరా బెనర్జీ జస్టిస్ వి.రామసుబ్రమణియన్ల ధర్మాసనం విచారించింది. బాల్యం దాటిన వారిని గుర్తించాలని అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, వారికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిందని అలహాబాద్ అదనపు అడ్వొకేట్ జనరల్ గరీమా ధర్మాసనానికి తెలిపారు. వారికి బెయిల్ మంజూరు చేయడానికి అభ్యంతరం లేదని, వెరిఫికేషన్ చేయాలని కోరుకుంటున్నామని ధర్మాసనాన్ని కోరారు. -
'పదిమందికి పైగా జువెనైల్స్ను ఉరి తీస్తున్నారు'
దుబాయ్: వివిధ నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణల కింద పదుల సంఖ్యలో బాల నేరస్తులను ఇరాన్లో ఉరి తీయనున్నారని ఆమ్నేస్టి ఇంటర్నేషనల్(అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ) ఆందోళన వ్యక్తం చేసింది. వారంతా కూడా త్వరలోనే పద్దెనిమిదేళ్లలోకి అడుగుపెట్టనున్నారని చెప్పింది. గతంతో కూడా బాల నేరస్తులను ఇరాన్ ఏమాత్రం జాలి లేకుండా మరణ శిక్ష అమలు చేసిందని తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఆమ్నేస్టి ఒక ప్రకటన విడుదల చేసింది. 2005 నుంచి 2015 మధ్యకాలంలో 73మంది బాల నేరస్తులను ఇరాన్ ఉరి తీసినట్లు తమ వద్ద సమాచారం ఉందని తెలిపింది. ఇరాన్ పాశ్యాత్య దేశాలతో అణు ఒప్పందం చేసుకుంటున్న సమయంలోనే తాము ఈ విషయంపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు చెప్పారు. అయితే, ఆ సందర్భంగా కొన్ని తీర్మానాలు ప్రతిపాదించగా వాటిని అంగీకరిస్తున్నట్లు తెలిపిన ఇరాన్ ప్రస్తుతం ఆ తీర్మానాలను నిర్లక్ష్యం చేస్తూ మరోసారి పదిమందికి పైగా ఉరి తీసేందుకు సిద్ధమైందని తెలిపింది. -
ఇళ్లకు నిప్పు పెట్టి చోరీ..
భీమవరం (పశ్చిమగోదావరి) : ఇళ్లకు నిప్పు పెట్టి అనంతరం చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు బాల నేరస్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. భీమవరానికి చెందిన ముగ్గురు బాల నేరస్తులు పట్టణంలోని ఇళ్లకు నిప్పు పెట్టి అనంతరం చోరీలకు పాల్పడుతున్నారు. ఈ విషయంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఈ రోజు నిందితులను అరెస్టు చేశారు.