అందరికీ ఉచిత బియ్యం
ఆర్డీఓ సూర్యారావు
నర్సీపట్నం టౌన్ : తుఫాన్ బాధితులు అందరికీ ఉచిత బియ్యం అందజేస్తామని ఆర్డీఓ కె.సూర్యారావు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుపు, గులాబీ కార్డుల లబ్ధిదారులు అందరికీ బియ్యాన్ని అందించాలని డీలర్లను ఆదేశించామన్నారు. 10 కిలోల బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, కారం, నూనె పలు రకాల నిత్యావసర సరకులను పంపిణీ చేస్తామని చెప్పారు. గులాబీ కార్డులకు నిత్యావసర సరకులు అపమని చెప్పలేదన్నారు. డీలర్ల నుంచి గులాబి కార్డుల లబ్ధిదారుల జాబితా రావడంలో జాప్యం జరిగిందన్నారు.
ప్రత్యక్ష నష్టం చవిచూడనప్పటికీ పది రోజులుగా విద్యుత్, మంచినీటి సరఫరా కాక అందరినీ బాధితులుగానే ప్రభుత్వం గుర్తించదని తెలిపారు. ప్రతి గ్రామానికి ప్రస్తుతం తమ తగ్గర ఉన్న తెల్లకార్డుల జాబితా ప్రకారం సరకులు నేరుగా పంపామన్నారు. మండలంలోని గోడౌన్లు వద్ద దించకుండా నేరుగా తహశీల్దార్ల కార్యాలయాలకు చేరవేశామన్నారు. డీలర్లు ఇచ్చిన ఇండెంట్ మేరకు చౌకధరల దుకాణాల వద్దకు పంపామని చెప్పారు. సరకులు తక్కువగా ఇచ్చినా అన్ని రకాలు ఇవ్వకపోయినా లబ్ధిదారులు తమ హక్కుగా భావించి అడిగి తీసుకోవాలన్నారు. మంగళవారంతో పంచదార కూడా అందుబాటులోకి రావడంతో అన్ని సరకులు ఇవ్వాలని ధికారులను ఆదేశించినట్టు ఆర్డీఓ తెలిపారు.