బిల్లులు చెల్లించాలని రైతుల ధర్నా
సుబాబుల్ బిల్లుల్ని వ్యవసాయ మార్కెట్ కమిటీయే చెల్లించాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. కృష్ణా జిల్లా కంచికచర్ల సమీపంలో ఉన్న కాగితపు పరిశ్రమ ఉంది. దీనికి సమీప గ్రామాల రైతులు సుబాబుల్ కర్రను వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా సరఫరా చేస్తుంటారు. ఆ సంస్థ బిల్లులు సక్రమంగా చెల్లించకపోవటంతో బకాయిలు రూ.9.20 కోట్ల వరకు పేరుకుపోయాయి. దీనిపై ఆగ్రహించిన రైతులు సోమవారం సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు రావల్సిన డబ్బులను మార్కెట్ కమిటీ చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆందోళన కొనసాగుతోంది. గతంలో ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా ఈ సమస్య పరిష్కారం కాలేదు.