kavitam
-
ముగిసిన షటిల్ టోర్నమెంట్ పోటీలు
కవిటం (పోడూరు) : స్థానిక శ్రీ చైతన్య షటిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్రి వెంకటరెడ్డి ప్లే గ్రౌండ్లో నాలుగు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర స్థాయి షటిల్ టోర్నమెంట్ పోటీలు శనివారం ముగిశాయి. ముగింపు సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకుడు గుంటూరి పెద్దిరాజు అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు, యువత చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి చూపించాలని సూచించారు. తణుకుకు చెందిన ప్రముఖ వైద్యుడు కర్రి శ్రీనివాసుల రెడ్డితో కలిసి విజేతలకు నగదు బహుమతులు అందించారు. మాజీ ఉప సర్పంచ్ కర్రి శ్రీనివాసరెడ్డి, కర్రి సత్యనారాయణరెడ్డి బ్రదర్స్, పడాల సత్యనారాయణరెడ్డి, చైతన్య షటిల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. విజేతలు వీరే.. మెడలిస్ట్ డబుల్స్ విభాగంలో రాజమండ్రికి చెందిన అవినాష్, అప్పారావు జోడి విజేతగా నిలిచారు. మెడలిస్ట్ సింగిల్స్ విభాగంలో రాజమండ్రికి చెందిన అవినాష్ విజేతగా నిలిచాడు. నాన్ మెడలిస్ట్ డబుల్స్ విభాగంలో గుడివాడకు చెందిన రాము, ప్రతాప్ జోడి విజేతగా నిలిచారు. మెడలిస్ట్ సింగిల్స్ విభాగంలో వీరవాసరానికి చెందిన శ్రీరామ్ రన్నర్‌గా నిలిచాడు. బాలికల డబుల్స్ విభాగంలో కవిటంకు చెందిన సాయికుమారి, భావిక జోడి విజేతగా, ఆశా, మౌనిక జోడి రన్నర్‌గా నిలిచారు. ఉత్తమ ప్రతిభా పాటవ ఆటగాడిగా పాలకొల్లుకు చెందిన ఉదయకిరణ్ బహుమతి అందుకున్నాడు. -
చేపల వేటకు వెళ్లి మృత్యుఒడిలోకి..
కవిటం (పోడూరు): చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. కవిటం వద్ద పాలకొల్లు–మార్టేరు రహదారిపై ఎఫ్‌సీఐ గోడౌన్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో కావడి వెంకటేశ్వరరావు(50) మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. పాలకొల్లు బెత్లహోమ్పేటకు చెందిన కావడి వెంకటేశ్వరరావు చేపలు పట్టి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం నరసాపురం ప్రధాన కాలువలో చేపల వేటకు కవిటం ప్రాంతానికి వెళ్లాడు. ఉదయం అక్కడ చేపలు వేటాడి మధ్యాహ్నం సమయంలో ఎఫ్‌సీఐ గోడౌన్ సమీపంలో రోడ్డు దాటుతుండగా పాలకొల్లు వైపు మెటల్ లోడుతో వెళుతున్న లారీ ఢీకొట్టి పంట బోదెలోకి బోల్తా కొట్టింది. దీంతో వెంకటేశ్వరరావు అక్కడికక్కడే మృతిచెం దాడు. ఎస్సై డి.ఆదినారాయణ ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
చేపల వేటకు వెళ్లి మృత్యుఒడిలోకి..
కవిటం (పోడూరు): చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. కవిటం వద్ద పాలకొల్లు–మార్టేరు రహదారిపై ఎఫ్‌సీఐ గోడౌన్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో కావడి వెంకటేశ్వరరావు(50) మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. పాలకొల్లు బెత్లహోమ్పేటకు చెందిన కావడి వెంకటేశ్వరరావు చేపలు పట్టి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం నరసాపురం ప్రధాన కాలువలో చేపల వేటకు కవిటం ప్రాంతానికి వెళ్లాడు. ఉదయం అక్కడ చేపలు వేటాడి మధ్యాహ్నం సమయంలో ఎఫ్‌సీఐ గోడౌన్ సమీపంలో రోడ్డు దాటుతుండగా పాలకొల్లు వైపు మెటల్ లోడుతో వెళుతున్న లారీ ఢీకొట్టి పంట బోదెలోకి బోల్తా కొట్టింది. దీంతో వెంకటేశ్వరరావు అక్కడికక్కడే మృతిచెం దాడు. ఎస్సై డి.ఆదినారాయణ ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.