కెర్సీకి పోలీసు లాంఛనాలతో..
శునకం అంటే విశ్వాసానికి మారుపేరు. అందులోనూ శిక్షణ పొందిన పోలీసు శునకాలైతే నేరగాళ్ల పాలిట సింహస్వప్నంగా ఉంటాయి. ఎక్కడ నేరం జరిగినా వెంటనే అక్కడకు వెళ్లి వాసన పసిగట్టి పోలీసులకు నేర పరిశోధనలో మంచి క్లూలు అందిస్తాయి. బాంబులను గుర్తించడం, డ్రగ్స్ అక్రమరవాణా గుట్టును రట్టు చేయడం కూడా వాటికి బాగా తెలిసిన విద్య.
ఇలా పలు రంగాల్లో గత 12 ఏళ్లుగా పశ్చిమగోదావరి జిల్లా పోలీసులకు సేవలు అందించిన 'కెర్సీ' గురువారం ప్రాణాలు వదిలింది. ఇంతకాలం తమకు చేదోడు వాదోడుగా ఉండటమే కాక.. ఏలూరులోని పోలీసులకు ఎంతో చేరువైన కెర్సీ మరణించడంతో.. దానికి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.