kesrinivasaravu
-
టైలర్ల ఫెడరేషన్‌ను పునరుద్ధరించాలి
గుంటూరు ఈస్ట్: టైలర్ల ఫెడరేషన్‌ను పునరుద్ధరించాలని ది టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. టైలర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లో దీక్షా శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజీవ్ విద్యామిషన్ ద్వారా కుట్టించే యూనిఫారాల కాంట్రాక్టును అసోసియేషన్ సభ్యులకు ఇవ్వాలన్నారు. గుర్తింపు కార్డులు, వృద్ధ టైలర్లకు పెన్షన్, ఉచిత బీమా, కుటుంబ సభ్యులకు ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలన్నారు. వృత్తిపన్ను మినహాయింపుతోపాటు షాపులకు విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి షేక్ సుభానీ మాట్లాడుతూ ఆధునిక జుకీ మిషనరీపై శిక్షణ ఇవ్వాలన్నారు. తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు ఇస్తున్నట్టే ఇక్కడా రాయితీలు ఇవ్వాలని కోరారు. అన్ని ముఖ్యపట్టణాల్లో ఇళ్ల స్థలాలు, కమ్యూనిటీ హాళ్లు మంజూరు చేయూలన్నారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు కలెక్టర్ కార్యాలయ ఏవో ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. సంఘం కోశాధికారి పి.లక్ష్మయ్య, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వి.వెంకటేశ్వర్లు, పలువురు టైలర్లు పాల్గొన్నారు. -
తూర్పు డెల్టాలో 37 శాతం నాట్లు పూర్తి
ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాసరావు అవనిగడ్డ : కృష్ణా డెల్టా ఆయకట్టు పరిధిలోని తూర్పుడెల్టాలో 37 శాతం వరినాట్లు పూర్తయినట్లు ఇరిగేషన్ సూపరింటెండెంట్ ఇంజినీర్ కె.శ్రీనివాసరావు చెప్పారు. ఇప్పటి వరకు తూర్పుడెల్టాలో 4.15లక్షల ఎకరాల్లో నాట్లు వేసినట్లు తెలిపారు. పులిగడ్డ ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఆదివారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ గుంటూరు జిల్లాలోని పశ్చిడెల్టాలో 1.79 లక్షల ఎకరాల్లో నాట్లు వేయగా, 31 శాతం పూర్తయినట్లు చెప్పారు. యనమలకుదురు లాకుల నుంచి నిమ్మగడ్డ లాకు వరకు ఒకే స్థాయిలో సాగునీటిని విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. శ్రీకాకుళం, ఘంటసాల ప్రాంతాల్లోని కాలువ చివరి భూములకు సాగునీరందడం లేదని రైతులు తమ దృష్టికి తీసుకురావడంతో వంతులువారీ విధానాన్ని అమలుచేయాలని సూచించినట్లు చెప్పారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులందరూ ఒకేసారి వ్యవసాయ పనులు ప్రారంభించటంతో సాగునీటి ఎద్దడి ఏర్పడిందని, సాగునీటి విడుదలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించటానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దివిసీమలోని కాలువ చివరి భూములకు సైతం పూర్తిస్థాయిలో సాగునీరు అందించటమే తమ లక్ష్యమని చెప్పారు. సాగునీటి వినియోగంపై కృష్ణారివర్ బోర్డు అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 15వ తేదీలోపు వరినాట్లు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. కరువు కాలువకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేస్తున్నామని, సాగునీటిని రైతులు సద్వినియోగం చేసుకుని, ముందస్తుగా నాట్లు వేయటానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వరినాట్లు పూర్తయిన తర్వాత ఇలాంటి వర్షాభావ పరిస్థితులే నెలకొంటే వంతులువారీ విధానం అమలుపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ ఈఈ జి.గంగయ్య, డీఈ భానుబాబు, ఆర్సీ డీఈ ఆర్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.