రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
మరొకరి పరిస్థితి విషమం
ఎదురెదురుగా ఢీకొన్న బైక్‌లు
మంథని : మంథని మండలం ఖానాపూర్ రోడ్లో బుధవారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మంథనిలోని రజక వీధికి చెందిన కొల్లూరి శ్రీనివాస్(35) పని నిమిత్తం ఖానాపూర్‌కు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొనడంతో అతడి తలకు బలమైన గాయమైంది. మంథని సామాజిక వైద్యశాలకు తరలించగా మృతి చెందాడు. భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. అలాగే మరో బైక్‌పై ఉన్న సెంగెం సంతోష్ తలకు బలమైన గాయం కాగా.. ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసి కరీంనగర్‌కు తరలించారు.