కెకెడబ్ల్యూ దామోదర్ అనుచరుడు అరెస్ట్
ఏటూరు నాగారం-తాడ్వాయి అటవీ ప్రాంతంలో సోమవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కెకెడబ్ల్యూ దామోదర్ అనుచరుడు సిద్ధబోయిన శివరాజ్ పోలీసులకు చిక్కాడు. అతన్ని అరెస్ట్ చేసిన ములుగు పోలీసులు అతని వద్ద నుంచి 4 డిటోనేటర్స్, 4 జిలిటెన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు.