KM Pillai
-
బాబ్బాబూ పుణ్యముంటుంది.. ఆయన్ను అరెస్టు చేయండి..
ఇళ్లకొచ్చి అడుక్కునే ముష్టివాళ్ల సంఖ్య ఇప్పుడు తగ్గిపోయింది. ట్రాఫిక్ సిగ్నళ్లలో, గుడులూ, హాస్పిటళ్లూ, హోటళ్ల దగ్గరే ‘బాబ్బాబూ ధర్మం చేయండి బాబూ.. పుణ్యముంటుంది బాబూ..’ అంటూ అడుక్కునే ముష్టివాళ్లు మనకు దండిగా కనిపిస్తుంటారు. ఈ ముష్టివాళ్ల సంగతి సరే.. నిజానికి ఇంకోరకం ముష్టివాళ్లు కూడా ఉంటారు. వారికి అనేకానేక వంకర ప్రయోజనాలు ఉంటాయి. ఆ వంకర ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి అడ్డు పడేవారి మీద కక్ష పెంచుకుంటారు. ఆ కక్ష సాధించుకోవడానికి ఇంకో రకం ముసుగులు తగిలించుకుని, చవకబారు ముష్టెత్తుతూ ఉంటారు.పేర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్ల నుంచి బియ్యం నిల్వల తేడా వచ్చిన కేసులో అటు పోలీసులకు, ఇటు పౌరసరఫరాల శాఖకు, ప్రభుత్వానికి లేని శ్రద్ధ పచ్చ మీడియాకు మాత్రం విపరీతంగా ఉన్నట్టు కనిపిస్తోంది. చట్టప్రకారం అవకాశం ఉన్నా లేకపోయినా కూడా.. పేర్ని నానిని అరెస్టు చేసేవరకు తాము కారుకూతలు కూస్తూనే ఉంటాం.. బురదచల్లుడు చవకబారు రాతలు రాస్తూనే ఉంటాం.. అనే ధోరణిని పచ్చ మీడియా ప్రదర్శిస్తున్నది.పేర్ని నాని స్వయంగా ప్రభుత్వానికి లేఖ రాసిన తర్వాతనే.. బియ్యం నిల్వల్లో తేడా వచ్చిన సంగతి బయటపడింది. అప్పటికీ నిబంధనల ప్రకారం అధికారులు ఎంత జరిమానా విధించారో.. అదంతా కూడా డీడీల రూపంలో చెల్లించేశారు. అయినాసరే.. పేర్నినానిని అరెస్టు చేసేదాకా పచ్చమీడియా కళ్లు చల్లబడేలా కనిపించడం లేదు.‘మేం కేసు పెడతాం అంతే.. అరెస్టులు మాత్రం చేయం.. మీరు కోర్టుకు వెళ్లి ఉపశమనం పొందేవరకు వేచిచూస్తూ ఉంటాం.. అన్నట్టుగా పోలీసులు వేచిచూస్తున్నారంటూ..’ పచ్చమీడియా వారి వెంటపడుతోంది. పేర్నినాని వ్యవహారం బయటకు వచ్చిన నాటినుంచి.. చట్టం తనశైలిలో తాను పనిచేసుకుంటూ పోతోంది. అయితే పచ్చమీడియా మాత్రం అత్యుత్సాహం ఆపుకోలేక.. ఆయనను అరెస్టు చేయడం లేదు, కొల్లు రవీంద్ర గానీ, పార్టీపెద్దలు గానీ.. ఆయన గురించి విమర్శలు చేయడం లేదు. అరెస్టు చేయాలని పోలీసుల వెంటపడడం లేదు.. పేర్ని నానితో కుమ్మక్కు అయినట్టుగా పనిచేస్తున్నారు.. అంటూ రకరకాల కారుకూతలు, చవకబారు రాతలు రాశారు.తీరా పచ్చమీడియా పోరు పడలేకపోతున్నట్టుగా.. కొల్లు రవీంద్ర కూడా ప్రెస్ మీట్ పెట్టి.. ఏదో పేర్నినాని మీద కొన్ని నిందలు వేసి దులుపుకున్నారు. ఆ తర్వాత.. రకరకాల మలుపులు తిరిగిన వ్యవహారంలో గోడౌన్ యజమానిగా రికార్డుల్లో ఉన్న జయసుధకు ముందస్తు బెయిలు వచ్చింది. పచ్చమీడియా పెద్దలు హతాశులయ్యారు. ఈలోగా పోలీసులు.. ‘విచారణలో తెలిసిన సమాచారం మేరకు..’ అనే ముసుగులో పేర్ని నాని పేరును కూడా ఏ6గా కేసులో చేర్చారు.కక్షపూరితంగా వేధించదలచుకుంటున్నారనే భయంతో పేర్ని కుటుంబం అజ్ఞాతంలోకి వెళితే.. నానా చెత్తరాతలు రాసిన పచ్చమీడియా.. ఇప్పుడు ముందస్తు బెయిల్ తర్వాత జయసుధ విచారణకు హాజరైనా కూడా ఓర్వలేకపోతోంది. కుట్రపూరితంగా తన పేరును కూడా ఇరికించిన నేపథ్యంలో పేర్ని నాని ముందస్తు బెయిలుకోసం దరఖాస్తు చేసుకోవడం కూడా పచ్చమీడియాకు కంటగింపే. ఆయనకు ముందస్తు బెయిల్ రావడం కూడా ఖరారే అని సంకేతాలు అందుతున్న వేళ.. తక్షణం ఆయనను అరెస్టు చేయకుండా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారంటూ పచ్చ మీడియా పాపం.. ఆవేదన చెందుతోంది.టీడీపీ, జనసేనల్లో పేర్ని నాని సన్నిహితులున్నారని, వారే ఆయనను కాపాడుతున్నారని పచ్చ మీడియా పాపం కుమిలపోతున్నది. అయినా.. చట్టప్రకారం ఆయన దోషి అయితే గనుక.. కాపాడటం ఎవరి తరం అవుతుంది? జరిగింది నేరం కానప్పుడు.. బియ్యం నిల్వల తేడాకు సంబంధించి.. ఒప్పందంలో ఉన్న నిబంధనల ప్రకారం జరిమానా మొత్తం చెల్లించేసినప్పుడు.. ఇక ఆయనను ఏ రకంగా శిక్షించగలరని పచ్చ మీడియా ఆరాటపడుతున్నదో అర్థం కావడం లేదు. వ్యవహారం మొత్తం గమనిస్తే.. నాని అరెస్టుకోసం పచ్చ మీడియా ముష్టెత్తుకుంటున్నట్టుగా.. బాబ్బాబూ.. మీకు పుణ్యముంటుంది.. అరెస్టు చేయండి బాబూ.. అని దేబిరిస్తున్నట్టుగా కనిపిస్తోంది.-ఎం.రాజేశ్వరి -
వారెవ్వా..! కుదిరితే ఎర.. లేకుంటే వధ్యశిల!
చంద్రబాబునాయుడు ప్రభుత్వం తాము ఎన్నికల్లో ఎలాంటి వంచనాత్మకమైన మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టిందో.. ఆచరణాత్మకం కాని ఎలాంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో.. ప్రజలకు తెలుసు. ఎన్డీయే సర్కారు ఆ హామీలను నిలబెట్టుకుంటుందో లేదో వేచిచూస్తూ వైఎస్సార్సీపీ ఆరునెలల గడువు ఇచ్చింది. ప్రజలకు అదే ధోరణిలో మాయమాటలు చెప్పడం తప్ప.. ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీల విషయంలో నోరు మెదపకుండా ప్రభుత్వం వంచిస్తూనే పాలన సాగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఇచ్చిన హనీమూన్ పీరియడ్ దాటిపోయిందనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ పోరుబాటలో కార్యచరణకు దిగుతుండడం.. కూటమి సర్కారులో వణుకు పుట్టిస్తోంది. వైఎస్సార్సీపీ ఉద్యమ ప్రణాళికకు జడుసుకుంటున్న ప్రభుత్వం రాజకీయం కుటిల వ్యూహాలను అమల్లో పెడుతోంది. ఆ పార్టీ నాయకులను లోబరచుకోవడం.. తమకు అనుకూలంగా మార్చుకుని.. తమ చేతి కీలుబొమ్మల్లాగా ఆడించడం.. వైఎస్సార్సీపీ మీదకే అస్త్రాల్లాగా ప్రయోగించడం అనేది అధికార పార్టీ అనుసరిస్తున్న తాజా వ్యూహంగా ఉంది. వైఎస్సార్సీపీ బలహీన పడుతున్నట్టుగా ప్రజల్లో ఒక తప్పుడు భావనను క్రియేట్ చేయడానికి వైఎస్సార్సీపీ నాయకులతో రాజీనామాలు చేయించడం ఒక తక్షణ ఎజెండాగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. విశాఖపట్నానికి చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి ఇన్నాళ్లుగా తనకు రాజకీయ భిక్ష పెట్టిన, తనను మంత్రిని చేసిన వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. భవిష్యత్తు కార్యాచరణ గురించి ఊహాగానాలు రాయొద్దని మీడియాకు విన్నవించుకున్నారు. ఒకవైపు వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొంటూ.. మరోవైపు కనీసం ఏడాది రోజులైనా ప్రభుత్వానికి హామీలు నెరవేర్చడానికి టైం ఇవ్వకుండా.. అప్పుడే ఉద్యమాలు చేయడం కరెక్టు కాదని అవంతి సూత్రీకరించడం అనుమానాలకు ఆస్కారం ఇస్తోంది. తాడేపల్లిలో కూర్చుని నిర్ణయాలు చేస్తోంటే అమలు చేయడానికి కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారంటూ అవంతి అనడాన్ని లోతుగా గమనిస్తే.. ఆ మాటల వెనుక ‘ఉండవల్లి’ స్క్రిప్టు ఉన్నదనే సంగతి ఎవ్వరికైనా ఇట్టే అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వానికి, తమ హామీలు తీర్చడానికి ప్రజలు అయిదేళ్ల గడువు ఇచ్చారని, అప్పుడే పోరాటాలు సరికాదని.. ప్రభుత్వం తరఫున వకాల్తా పుచ్చుకున్నట్టుగా అవంతి శ్రీనివాస్ సన్నాయినొక్కులు నొక్కుతున్నారు.వైఎస్సార్సీపీ నాయకుల మీద తెలుగుదేశం అండ్ కో పార్టీలు రెండు రకాల గేమ్ ప్లాన్ అమలు చేస్తున్నారు. ఆ పార్టీ నేతలకు గేలం వేసి, ఎర వేసి, ప్రలోభపెట్టి ఆకర్షించడం ఒక పద్ధతి. వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి వస్తే మంచి భవిష్యత్తు చూపిస్తామని ఆశ పెడతారు. గేలం వేస్తే లొంగని వారిని బెదిరిస్తున్నారు. వధ్యశిల బెదిరింపు అన్నమాట. వారి కెరీర్ అంతం అయ్యేలాగా కేసుల్లో ఇరికిస్తామని బెదిరిస్తున్నారు. ఈ రెండురకాల వక్ర మార్గాల్లో ఏదో ఒకదానికి వైఎస్సార్సీపీ నాయకులు లొంగిపోతున్నారు. అయితే రాజీనామా చేసిన నేతలకు మంచి భవిష్యత్తు అనేది బూటకం మాత్రమే. మంత్రి పదవి ఆశ పెట్టి బాలినేని శ్రీనివాస రెడ్డిని చేర్చుకున్నారు. ఆయనతో జగన్ మీద నానా నిందలు వేయించారు. తీరా ఇప్పుడు కరివేపాకు లాగా తీసి పక్కన పడేశారు. తెలుగుదేశం కూటమి పార్టీల ప్రలోభాలకు లొంగి వైఎస్సార్సీపీని వీడుతున్న వారి భవిష్యత్తు కూడా అంతేనని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.:::ఎం.రాజేశ్వరిఇదీ చదవండి: యనమల గతి ఇక ఇంతేనా? -
బ్యాలెట్ కోసం చైతన్యం.. వారిని వణికిస్తోందిగా!
మర్కర్‌వాడీ అంటే కేవలం 1900 ఓట్లున్న కుగ్రామం. మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాలో మల్షిరాస్ తహసీలులో ఉంటుందా పల్లె! ఎంత చిన్న పల్లె అయితేనేం.. ఇవాళ దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పాలకులలో వణుకు పుట్టిస్తోంది. బండారం బయటపడుతుందేమోననే భయాన్ని రేకెత్తిస్తోంది. ఆ చిన్న గ్రామంలోని ప్రజల్లో ఈవీఎంల పట్ల పుట్టిన అనుమానం.. తమ ‘తీర్పు’ను తామే బ్యాలెట్ పేపర్ల ద్వారా మరోసారి క్రాస్ చెక్ చేసుకోవాలని సంకల్పించిన చైతన్యం.. అధికారవర్గాలకు జడుపు తెప్పించింది. ప్రజలు స్వచ్ఛందంగా అలాంటి పోలింగును ప్లాన్ చేసుకోగా.. ఏకంగా మూడు రోజుల పాటూ పోలీసులు పెద్దసంఖ్యలో- ఆ చిన్న పల్లెలో మోహరించి- కర్ఫ్యూ ప్రకటించడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారుతోంది.వివరాల్లోకి వెళితే..ఈ మర్కర్‌వాడీ గ్రామం మల్షిరాస్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇటీవి మహా ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి ఉత్తమ్రావ్ జన్ఖడ్ 13,147 ఓట్ల మెజారిటీతో గెలిచారు. నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) కు చెందిన ఆయన, బిజెపి అభ్యర్థి సిటింగ్ ఎమ్మెల్యే రామ్ సత్పుతే ని ఓడించారు. విజయం దక్కినా సరే ఆయన మర్కర్‌వాడీ గ్రామంలో పోలింగుమీద అనుమానం ఉండిపోయింది. ఆ గ్రామంలో తనకు ప్రజాబలం దండిగా ఉన్నదని, గత ఎన్నికల్లో తనకు ఆ గ్రామంలో చాలా మంచి మెజారిటీ వచ్చిందని ఈ సారి మాత్రం ఓట్లు తగ్గాయని ఆయనకు అనుమానం వచ్చింది. 1900 ఓట్ల ఆ చిన్న గ్రామంలో ఈసారి 1003 ఓట్లు బిజెపికి పడగా, ఎన్సీపీ (ఎస్పీ) జన్ఖడ్ కు కేవలం 843 ఓట్లు దక్కాయి. అందుకే ఆయన అంతా ఆశ్చర్యపోయారు. .గెలిచిన అభ్యర్థి మాత్రమే కాదు.. ఆ గ్రామస్తులకు కూడా అదే ఆశ్చర్యం కలిగింది. జన్ఖడ్ కు ఆ పల్లెలో పాపులారిటీ ఎక్కువనేది అక్కడి వారి మాట. కేవలం పాపులారిటీ మాత్రమే కాదు. ఆయనకు అక్కడ కులబలం కూడా మెండు! ఉత్తమ్రావ్ జన్ఖ్- ధన్‌గఢ్ కులానికి చెందిన వారు. ఆ పల్లెలో అధికసంఖ్యాకులు ఆ కులం వారే. వారందరికీ కూడా అనుమానం వచ్చింది. దాంతో అంతా కలిసి తహసీల్దార్ దగ్గరకు వెళ్లి రీఎలక్షన్ పెట్టాలని డిమాండ్ చేశారు. వారి విజ్ఞప్తిని యన తోసిపుచ్చడంతో.. ఈవీఎంలలో ఏదో మతలబు జరిగిఉండొచ్చునని, అందుకే బిజెపికి ఎక్కువ ఓట్లు పడ్డాయని అనుమానించిన గ్రామస్తులు తామే స్వయంగా బ్యాలెట్ పేపర్ తో మాక పోలింగ్ లాగా మంగళవారం నాడు పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. వారు సన్నాహాలు చేసుకునేలోగా ప్రభుత్వ వర్గాలకు వణుకు పుట్టింది.మోడీ సర్కారు తెచ్చిన కొత్త నేర చట్టాల్లోని భారతీయ నాగరిక్ సురక్ష సంహితలోని 163 సెక్షన్ ప్రకారం ఆ చిన్న గ్రామంలో కర్ఫ్యూ విధించారు. మంగళవారు వాళ్లు పోలింగ్ ప్లాన్ చేసుకోగా గురువారం వరకు కర్ఫ్యూ ఉంటుందని ప్రకటించి.. యాభై మంది సాయుధ పోలీసుల్ని మోహరించారు.మేం వేసిన ఓట్లు ఎలా మళ్లిపోయాయో చెక్ చేసుకోవడానికే ఈ ప్రయత్నం చేస్తున్నామని.. అధికారులు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా సరే.. పోలింగ్ నిర్వహించి తీరుతామని వారు పట్టుదలగా ఉన్నారు.ఆలోచన పుట్టిస్తున్న చైతన్యం..చిన్న పల్లె లోని ప్రజల్లో పుట్టిన చైతన్యం దేశ ప్రజలందరినీ ఇప్పుడు ఆలోచింపజేస్తోంది. వారేీ ప్రభుత్వాన్ని రీపోలింగ్ అడగడం లేదు. మాక పోలిగ్ తరహాలో తమలో తాము నిర్వహించుకోవాలనుకున్నారు. ఈవీఎంలో వచ్చిన ఓట్లకు, తాము బ్యాలెట్ ద్వారా ఓటు చేస్తే రాగల ఓట్లకు తేడాలను గమనించాలనుకున్నారు. ఈవీఎంల సత్యసంధతను పుటం వేయాలనుకున్నారు. అయితే ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం నిరపాయకరమైన వారి ప్రయత్నాన్ని మాత్రం అడ్డుకుంటోంది.ఒకవేళ ఈ ప్రయత్నాన్ని ఆపుచేయించాలని భావించినా సరే.. నలుగురు వ్యక్తులు ఒకచోట గుమికూడరాదు అని చెప్పే 144 సెక్షన్ విధిస్తే సరిపోయేదానికి ఏకంగా మూడురోజుల పాటు కర్ఫ్యూ పెట్టడం అంటే ఆందరికీ ఆశ్చర్యమే. చిన్న పల్లె మర్కర్‌వాడీ యంత్రాంగాన్ని అంతగా వణికిస్తూంటే.. ఈవీఎం ల విషయంలో సమ్ థింగ్ ఈజ్ ఫిషీ అని దేశం అనుకోకుండా ఎలా ఉంటుంది?.. ఎం.రాజేశ్వరి -
చల్లపుచ్చుకుని ముంత దాచుకుంటున్న పవన్!
చల్లకొచ్చి ముంత దాచుకోవడం అనే సామెత ఒకటుంది. ఆ సామెత వెనుక ఓ బుల్లి కథ కూడా ఉంది. ఓ ఊళ్లో ఆదెమ్మ, సోదెమ్మ అనే ఇద్దరున్నారు. ఇద్దరూ ఇరుగు పొరుగువారే. ఆదెమ్మకు ఏదైనా అవసరం వస్తే మొహమాటమూ సిగ్గు లేకుండా సోదెమ్మను అడిగి పుచ్చుకుంటుంది. కానీ సోదెమ్మకు కాస్త సిగ్గు ఎక్కువ. ఓసారి సోదెమ్మకు చల్ల (మజ్జిగ) కావాల్సి వచ్చింది. ఇంట్లో నిండుకున్నాయి. మొగుడికేమో మజ్జిగ చుక్క లేకపోతే ముద్ద దిగదు. అందుకని వేరే గత్యంతరం లేక చేతిలో ఓ ముంత పట్టుకుని ఆదెమ్మ దగ్గరకు వెళ్లింది. ‘రా రా సోదెమ్మక్కా.. ఏంటి సంగతులు’ అని అడిగింది ఆదెమ్మ. సోదెమ్మకు చల్ల అడగాలంటే సిగ్గేసింది. ముంతను కొంగు చాటున దాచుకుంది. కాసేపు కబుర్లు చెప్పి ఖాళీ ముంతతోనే తిరిగి ఇంటికి వెళ్లింది. భోజనంలోకి మజ్జిగ లేనందుకు మొగుడితో తిట్లు కూడా తినింది. ..ఇదీ కథ!ఏదైనా పనిమీద ఒకరి వద్దకు వెళ్లినప్పుడు, ఏ పనిగా వచ్చామో చెప్పకుండా దాచుకుంటే, మొహమాటపడితే పని జరిగేదెలాగ? కాబట్టి కార్యార్థవై ఉన్నప్పుడు మొహమాటం తగదని ఈ సామెత చెబుతుంది. ఈ సామెత నీతి డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ కు కూడా తెలుసు!కానీ పవన్ కల్యాణ్ రూటే సెపరేటు. ఆయన చల్లకోసం వస్తారు. మొగమాటలం లేకుండా అడిగి పుచ్చుకుంటారు. కానీ.. తాను పొరుగింట్లో చల్ల అరువు పుచ్చుకున్న సంగతి మరెవ్వరికీ తెలియకూడదని మాత్రం అనుకుంటారు. చల్ల పుచ్చుకున్న తర్వాత ఆ ముంతను.. దాచిపెట్టుకుని, గుట్టు చప్పుడు కాకుండా వెళ్లిపోవాలని అనుకుంటారు. తమ మధ్య కేవలం కబుర్లు మాత్రమే సాగాయని వాడలోని ఇతరుల్ని మభ్య పెట్టాలని అనుకుంటారు. ఆయన అటు ఢిల్లీ, ఇటు ఉండవిల్లీ నేతలతో సాగిస్తున్న భేటీల మర్మం అలాగే కనిపిస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో మూడు రాజ్యసభ ఎంపీ సీట్లకు ఉపఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల్లో తన వ్యవహారాలన్నీ చూసుకున్న అన్నయ్య నాగబాబును ఎంపీగా రాజ్యసభకు పంపాలని పవన్ కోరిక. అడిగితే కాదనేంత సీన్ చంద్రబాబుకు లేదుగానీ.. ఈసారే ఇస్తారా.. నెక్ట్స్ టైం అంటారా అనేది అనుమానం. అందుకే ముందుగా ఢిల్లీ వెళ్లి మోడీ, అమిత్ షాలతో చర్చలు జరిపి.. తన మనోవాంఛను వారి ఎదుట చెప్పుకున్నారు. మూడింటిలో ఒక ఎంపీ సీటు కోసం బిజెపి పట్టుపట్టకుండా ఉంటే.. తాను దక్కించుకోవచ్చునని ముందుగా అక్కడ చక్రం తిప్పారు. తీరా ఇవాళ చంద్రబాబు ఉండవిల్లి నివాసానికి వెళ్లి మాట తీసుకునే ప్రయత్నం చేశారు.బాబు వద్దకెళ్లడమూ మాట పుచ్చుకోవడమూ అయింది. అయితే తాను ఎంపీ సీటు కోసం వీరందరి ఇళ్లకూ కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నానని ప్రజలకు తెలియరాదు– అనేది ఆయన కోరిక. అంటే చల్ల పుచ్చుకోవాలి గానీ.. ఆ సంగతి ఇతరులకు మాత్రం తెలియద్దన్నమాట.పైకి మాత్రం.. కాకినాడ బియ్యం స్మగ్లింగ్ గురించి బాబుతో చర్చించినట్లుగా, రాష్ట్ర ప్రయోజనాలు సాధించడం గురించి ఢిల్లీ పెద్దలతో మంతనాలు చేసినట్టుగా.. బాహ్య ప్రపంచానికి ఆయన డప్పు కొట్టుకుంటున్నారు. తాను అన్నయ్య నాగబాబు ఎంపీ సీటు కోసమే తిరుగుతున్నట్టుగా జనం గుర్తిస్తే పలుచన అవుతానని భయపడుతున్నారో ఏమో పాపం!.. ఎం. రాజేశ్వరి -
ఏ బుర్రలో ఎన్ని పాములుంటాయో?
ఇదేమిటబ్బా.. ‘ఏ పుట్టలో ఏ పాముంటుందో?’ అనేది కదా సామెత! ఇక్కడేదో తేడా కొడుతోందే అనుకుంటున్నారు కదా? సామెత అదే గానీ.. ఇప్పుడు రోజులు మారిపోయాయి. మోసకారి బతుకులు బతికే వారి బుర్రల్లో రకరకాల విషనాగులు, అనకొండలు, ర్యాటిల్ స్నేక్ లు రకరకాల పాములు.. అనేక రకాల టక్కుటమారాల మాయోపాయాల రూపంలో దాగి ఉంటున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే.. ఎవడితో ఫోటో దిగాలన్నా సరే.. కూసింత సెలబ్రిటీ స్టేటస్ ఉండే వాడు వణికి చచ్చిపోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కంగారు పుడుతోంది. ఇక్కడ కట్ చేసి ఒక పాత ముచ్చట చెప్పుకుందాం..నాకు తెలిసి సినీ రంగంలో చాలా పెద్దాయన ఉండేవాడు. చాలా అంటే చాలా అన్నమాట. సొంత బ్యానర్ మీద సినిమాలు తీసినా కూడా.. ఎన్నడూ ఆ సినిమా కోసం బయటి కార్యక్రమాలకు రాలేనంత పెద్దాయన. ఆయన సినిమాలకు రాష్ట్రంలో ఏవైనా సంస్థలు అవార్డులు ప్రకటిస్తే.. ఆ సమాచారం పెద్దాయనకు వెళ్లిన వెంటనే.. ‘థాంక్యూ’ అనే పదం వచ్చేది కాదు. అసలు ఆ అవార్డు తాము తీసుకోవాలా వద్దా? అనే మేధోమధనం చేసేవాళ్లు.. తన అనుంగు సహచరులతో కలిసి! తన డికెష్టీలను పరిశోధన కోసం పంపేవాళ్లు. ఆ సంస్థ ఎలాంటిది? దాని సారధులు ఎలాంటి వాళ్లు? వారి పుట్టుపూర్వోత్తరాలు, పుట్టుమచ్చలు ఏమిటి? అన్నీ ఆరా తీసేవాళ్లు.అంతా తేలిన తర్వాత.. ఆ అవార్డు తీసుకోవాలా వద్దా? తీసుకోదలచుకుంటే.. తాను వెళ్లాలా? తన ప్రతినిధులు వెళ్లాలా? అనేది ఆ పెద్దాయన డిసైడ్ అయ్యేవాళ్లు! అవార్డు ఇస్తానన్నారు కదా అని ఎగబడి వెళ్లి తీసేసుకుంటే.. తనతో దిగిన ఫోటోలను అవతలి వాళ్లు మార్కెట్ చేసేసుకుని.. లాభపడిపోతారేమో అని ఆ పెద్దాయనకు భయం. అంత అతిజాగ్రత్త అన్నమాట. ఈ ముచ్చట మొత్తం కొన్ని దశాబ్దాల కిందటిది. ఇప్పుడు ఆయన లేరు. కానీ అప్పట్లో ఆయన పాటించిన జాగ్రత్తలు మాత్రం అందరికీ అవసరమేమో అనిపిస్తున్నది. ఇక్కడ కట్ చేసి అసలు సంగతిలోకి వద్దాం..విశాఖకు చెందిన తొనంగి కాంతిదత్ అనే కుర్రాడున్నాడు. పదో తరగతి ఫెయిలయ్యాడు. సెలబ్రిటీలతో కార్యక్రమాలు నిర్వహించడం వారితో ఉన్న ఫోటోలు పరిచయాలను ప్రచారానికి వాడుకుని.. వారందరూ తనకు భాగస్వాములని, తన వ్యాపారాల్లో బినామీలుగా పెట్టుబడులు పెట్టారని చెప్పుకుంటూ.. ఇతరుల నుంచి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టించడం.. అంతా అయిన కొన్నాళ్లకు ఆ వ్యాపారం బోర్డు తిప్పేయడం అనే టెక్నిక్ ను కనుగొన్నాడు.ఊళ్లమీదికొచ్చి చేయి చూసి జాతకం చెప్పే, సిగలో ఈకలు దూర్చుకున్న కొండదొర.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేషూ, నాగార్జునలతో దిగిన ఫోటోలని చూపించి డప్పు కొట్టుకున్నట్టే అన్నమాట! ఈ ప్రబుద్ధుడు ముందు విశాఖలో పింక్ థాన్ అనే కార్యక్రమం పేరుతో సెలబ్రిటీలు చాలా మంది అక్కడికొచ్చేలా ప్లాన్ చేశాడు. హైదరాబాదులో సస్టెయినబుల్ కార్ట్ అంటూ ఓ దుకాణం తెరిచాడు. ఓ సెలబ్రిటీతో రెండు కోట్లు పెట్టుబడి పెట్టించాడు. అందులో గందరగోళాలు గమనించి ఆమె త్వరగానే తప్పుకున్నారు.తర్వాత హైదరాబాదులో చైన్ ఆఫ్ హోటల్స్ ప్రారంభించి.. ఓ మాజీ మంత్రి, ఓ సినిమా ఫ్యామిలీ తన వాటాదారులని నమ్మించి ఇతరులతో కోట్లు పెట్టుబడి పెట్టించాడు. ఆ రెండు దుకాణాలను ఎత్తేసి.. తృతీయ జువెలర్స్ అంటూ కొత్త దందా మొదలెట్టాడు. సినీ నటి అందులో పార్టనర్ అని చెప్పుకుని.. ఇతరులతో మరికొన్ని కోట్లు పెట్టుబడి పెట్టించాడు. తీరా ఒకటి రెండు వ్యవహారాలు పోలీసు గడప తొక్కగానే ప్రస్తుతం కటకటాల్లో ఉన్నాడు.కట్ చేస్తే.. జనం ఇంత సులువుగా ఎలా మోసపోతున్నారనేది ఆలోచించాల్సిన సంగతి. అలాగే సెలబ్రిటీలు ఎవరికైనా తమకు పుట్టుపూర్వోత్తరాలతో సహా తెలియని వ్యక్తులు వచ్చి కార్యక్రమాలకు, అవార్డులకు పిలిస్తే వెళ్లడానికి భయపడాల్సిన పరిస్థితి. ఏ అవార్డు పుచ్చుకుంటే.. ఆ ఫోటోలతో ఎవరెలాంటి కొత్త మోసాలను ప్లాన్ చేస్తుంటారో ఎవ్వరికీ బోధపడని ఆధునిక రోజులు. సైబర్ మోసాల ద్వారా.. అమాయకులైన పేద ప్రజలు అకౌంట్లలో ఉన్నదంతా ఊడ్చుకుపోయేలా మోసపోవడం చాలా చూస్తున్నాం. ఇప్పుడిలా సెల్రబిటీలు మోసపోయే వారు కొందరు.. మోసాల క్రీడలో తాము పావులుగా మారుతున్నవారు మరికొందరు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నారు. ఇలాంటివి మరికొన్ని జరిగితే.. ఎవరు ఏ అవార్డు ఆఫర్ చేసినా, గెస్టుగా పిలిచినా.. సెలబ్రిటీలు.. ముందు చెప్పుకున్న పెద్దాయన సిద్ధాంతాన్ని ఫాలో అయి.. వంద ఆలోచిస్తారేమో మరి!-ఎం. రాజేశ్వరి. -
చంద్రబాబును చూసి టీడీపీ సీనియర్లలో జాలి!
‘అనగనగా ఒక ఊరిలో ఒక నాగుపాము ఉండేది. తనకు ఎవరు కనిపిస్తే వారిని కాటేసి చంపేసేది. లేదా, చిన్న జీవులైతే తినేసేది. అదంటే అందరికీ చాలా భయం. కొన్నాళ్లకు ఆ నాగుపాము బాగా ముసలిది అయిపోయింది. ఈలోగా ఒక వేటగాడు దానిని పట్టుకుని కోరలు పీకి మళ్లీ అడవిలో వదిలేశాడు. ఇక కదలలేని పరిస్థితి వచ్చింది. జనం గానీ, మిగిలిన జీవులు గానీ దాన్ని పట్టించుకోవడమే మానేశాయి. దానికి పొట్టగడవడం కూడా కష్టమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరోజు ఆ దారిలో ఒక సన్యాసి వెళుతూ ఉంటే ఆయనను తనకో దారి చూపించమని ప్రాధేయపడింది. ఆయన దానితో.. ‘నువ్వు కదలలేని, కరవలేని ముసలి పామువి అయిపోయావు గానీ కనీసం బుసకొట్టగలవు కదా.. కాబట్టి బుస కొడుతూ ఉండు.. అందరూ నిన్ను చూసి భయపడతారు’ అని సలహా చెప్పి వెళ్లాడు.ఈ ఐడియా భలే ఉందని ఆ పాముకు అనిపించింది. అప్పటి నుంచి బుస కొట్టడం ప్రారంభించింది. కొన్ని జీవులు భయపడేవి కూడా! కొన్నాళ్లకు వాటన్నింటికీ అసలు విషయం అర్థమైంది. ‘ఈ పాము బుసకొడుతుందే తప్ప.. కాటు వేయలేదు’ అని తెలుసుకున్నాయి. పిల్లి గుడ్డిదైతే ఎలుక దాని ఎదుట బ్రేక్ డ్యాన్స్ చేసినట్టుగా.. చిట్టెలుకలు, చిట్టి కుందేళ్లు కూడా ఆ పాము ఎదుట డిస్కో డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాయి. ఆ పాము గట్టిగా బుస కొడుతుంది. కానీ మిగిలిన జీవులు కనీసంగా కూడా పట్టించుకోవడం మానేశాయి. పాపం.. ఆ పాము ముసలి బతుకు అలాగే గడిచిపోయింది’ ఇదీ కథ.ఈ కథకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయాలకు చిన్న సామ్యం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తానంటే అందరికీ హడల్ అని, తనను చూసి అందరూ జడుసుకుంటూ ఉంటారని అనుకుంటూ ఉంటారు. తాను రంకె వేస్తే భూకంపం వస్తుందని కూడా అనుకుంటూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఆయన పార్టీలోని సీనియర్లలోనే చంద్రబాబు పట్ల భయం కాదు కదా.. జాలి కలుగుతోంది.దేశంలోనే నన్ను మించిన సీనియారిటీ ఉన్న నాయకుడు లేరని ఆయన చెప్పుకుంటూ ఉంటారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా తనను మించిన మహానుభావులు లేరని కూడా అనుకుంటూ ఉంటారు. కానీ, సొంత పార్టీలో ఆయనకు ఒకప్పుడు ఉన్నంత విలువ, గౌరవం, ఆయన పట్ల భయం ఇప్పుడు లేవు. తాజాగా ఆర్టీపీపీ తడి బూడిద గొడవ ఇందుకు పెద్ద ఉదాహరణ.ఆర్టీపీపీ నుంచి వచ్చే తడి బూడిదను అమ్ముకోవడంలో రోజుకు దాదాపుగా రెండు లక్షల రూపాయల దందా తెలుగుదేశం నేతలు సాగిస్తున్నట్టుగా గుసగుసలున్నాయి. దీనికోసం కూటమి పార్టీల నాయకులే కొట్టుకుంటున్నారు. లోకల్ టీడీపీ భూపేష్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకరరెడ్డి మధ్య తగాదాలు ముదిరాయి. మంత్రి గొట్టిపాటి రవికుమార్, నారా లోకేష్ రాజీ చర్చలు చేసినా.. వారు దిగిరాలేదు. అప్పుడు బుస కొట్టడానికి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. అందరినీ తన ఎదుట హాజరుకావాలని పురమాయించారు.ఆయన మాటలను జేసీ ప్రభాకర రెడ్డి బేఖాతర్ అన్నారు. బీజేపీ ఆదినారాయణ రెడ్డి వచ్చి తన వాదన చెప్పుకుని వెళ్లిపోయారు. బాబు ‘బుస’లను సొంత పార్టీ వారు కూడా పట్టించుకోవడం లేదు. సొంత పార్టీలోని సీనియర్లు మాత్రమే కాదు, పార్టీలో బొడ్డూడని నాయకులు, తొలిసారి ఎమ్మెల్యే అయిన అప్రెంటిసులు కూడా చంద్రబాబు బుసలను పట్టించుకోవడం లేదు. లోకల్‌గా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే దందాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. దందాలు చేస్తే తాటతీస్తా అని చంద్రబాబు హెచ్చరిస్తుంటారు. బహుశా ఈ అప్రెంటిస్ ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు హూంకరింపులు చూసి జాలిగా నవ్వుకుంటూ ఉంటారేమో! ఒకప్పట్లో ఎడాపెడా పార్టీ నేతల మీద చర్యలు తీసుకుంటూ మీడియాలో ప్రచారం కోరుకుంటూ తమ మీద రెచ్చిపోతూ వచ్చిన చంద్రబాబునాయుడు.. ఇప్పుడు అప్రెంటీసులకు కూడా లెక్కలేకుండా అయిపోయారని ఇప్పుడు సీనియర్లు బాబు పరిస్థితి మీద జాలిపడుతున్నారు.-ఎం.రాజేశ్వరి -
అది కత్తి పార్టీ అని ముందే తెలీదా!
నలుగురినీ మోసం చేసేవాడు నీతో మంచిగా ఉంటున్నాడంటే దాని అర్థం.. నీతో వాడికి ఏదో అవసరం ఉన్నదని.. అవకాశవాదంతో మాత్రమే నీతో మంచిగా ఉన్నాడని!. ఈ మర్మం తెలియకుండా.. చాలా మంది.. ‘వాడు ఎలాంటి వాడైతే నాకేంటి.. నాతో మంచిగానే ఉంటున్నాడు కదా’ అనే కన్వీనియెంట్ ఆత్మవంచనతో స్నేహాలు చేస్తుంటారు, కొత్తబంధాలు కుదుర్చుకుంటూ ఉంటారు. కానీ నీతో అవసరం తీరిన తర్వాత.. అవతలివారి నిజస్వరూపం బయటపడిన తర్వాత బుద్ధి వస్తుంది. అప్పటికి సరిదిద్దుకోవడానికి ఏమీ మిగలదు.. ఆ చేదు అనుభవం తప్ప! చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమవుతుంది? ఈ వ్యవహారం కూడా అంతే!.ఈ ఉపోద్ఘాతం మొత్తం ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవికి అతికినట్టుగా సరిపోతుంది. తాడికొండ ఎమ్మెల్యేగా.. వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున గెలిచి.. అనర్హురాలిగా ప్రకటింపబడిన శ్రీదేవి ఇప్పుడు గొల్లుమంటున్నారు. రాజకీయ భిక్ష పెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మోసం చేసి.. చంద్రబాబు పంచన చేరి దొడ్డిదారిలో ఆయనకు చేసిన మేలుకు తనకు తగిన శిక్ష పడింది. ఆమె బహుశా పశ్చాత్తాప పడుతున్నట్లే కనిపిస్తున్నారు. కానీ ఏమిటి ప్రయోజనం? గత జల సేతుబంధనం అంటే ఇదే!. ఇంతకూ ఏం జరిగిందంటే.. సీఎం జగన్ అనుగ్రహంతో ఉండవల్లి శ్రీదేవి తాడికొండ ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటినుంచి నియోజకవర్గంలో విచ్చలవిడిగా అవినీతి దందాను ప్రారంభించారు. ఇసుక దందాలు, పేకాట క్లబ్బులు నిర్వహించారనే అపకీర్తిని మూటగట్టుకున్నారు. పోలీసు అధికారులతో చాలా దురుసుగా మాట్లాడిన ఆడియో రికార్డులన్నీ అప్పట్లో బయటకు వచ్చాయి. తీరు మార్చుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ పలుమార్లు సూచించినా ఫలితం లేకుండా పోయింది. నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటుదనే ఉద్దేశ్యంతో అక్కడ ఎమ్మెల్యేగా ఆమెను పక్కన పెట్టి వైఎస్సార్సీపీ ఇన్‌చార్జ్‌ను మార్చారు. దీంతో, ఉండవల్లి శ్రీదేవి చంద్రబాబుతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని.. గత ఏడాది ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశానికి ఓటు వేసి, వైఎస్సార్సీపీకి వెన్నుపోటు పొడిచారు. పార్టీ ఆమెను సస్పెండ్ చేశాక.. పదవిలో మాత్రం కొనసాగారు. ఇటీవల స్పీకర్ ఆమెను అనర్హురాలిగా కూడా ప్రకటించారు. అయితే.. తెలుగుదేశానికి దొడ్డిదారిలో చేసిన ఫేవర్‌కు ప్రతిఫలంగా ఆమె తిరువూరు ఎమ్మెల్యే లేదా, బాపట్ల ఎంపీ సీటును ఆశించారు. కానీ.. ఆమెతో అవసరం తీరిపోయినందున చంద్రబాబు ఖాతరు చేయలేదు. ఆ రెండు స్థానాలనూ వేరే వారికే కేటాయించేశారు.ఈ ఘటనలతో శ్రీదేవికి జ్ఞానోదయం అయింది. ‘రాజకీయాలు ఎలా ఉంటాయో.. ఎవరు ఎలాంటి వారో ఈరోజు అర్థం అయ్యింది!!’ అంటూ హ్యాష్ ట్యాగ్ బాపట్ల అని ఒక కత్తి బొమ్మతో సహా ఆమె ట్వీట్ చేశారు. ఇక్కడ కత్తి బొమ్మకు అర్థమేమిటి అనేదే చర్చ. బాపట్ల టికెట్ ఇస్తానని చెప్పిన చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనేది ఆమె ఉద్దేశం కావొచ్చునని ట్వీటు చూసిన వారి ఊహ. తెలుగుదేశం వెన్నుపోటుల కత్తిపార్టీ అని కూడా ఆమె ఆగ్రహించి ఉండవచ్చు. అయితే, అది కత్తి పార్టీ అనే సంగతి ముందే తెలియదా అని, మామను కూలదోసి పార్టీని కబ్జాచేసిన చంద్రబాబు వెన్నుపోటులకు బ్రాండ్ అంబాసిడర్ అని తెలియదా? అంటూ రకరకాలుగా ఇప్పుడు ప్రజలు ఆమె ట్వీట్‌పై కామెంట్ చేసుకుంటున్నారు. అయినా కత్తి బొమ్మతో నిరసన తెలియజెప్పే హక్కు ఆమెకు లేదని, తనకు రాజకీయ భిక్ష పెట్టిన సీఎం జగన్‌ను వెన్నుపోటు పొడిచిన ప్రతిఫలమే ఇప్పుడు అనుభవిస్తున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.-వంశీకృష్ణ -
బాబు సీక్రెట్ సిగ్నల్.. నా ఆశీస్సులుంటాయ్ గెలుచుకు రండి!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన కుటిల రాజకీయ ఎత్తుగడలను మళ్లీ తెరమీదకు తెస్తున్నారు. ఒకవైపు భాగస్వామ్య పక్షాల కోసం త్యాగాలు తప్పవని అంటూనే.. మరోవైపు వారి వెనుక గోతులు తవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. తెలుగుదేశం అభ్యర్థులు తిరుగుబాటు చేసి బరిలో నిలుస్తూ ఉంటే, పైపై బుజ్జగింపులతో వారిని పోటీ నుంచి తప్పించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు.అయితే, ఈ బుజ్జగింపులు మొత్తం నాటకాలేనని, రహస్య సంకేతాలు, సందేశాలు, రహస్య దూతల ద్వారా వారికి ఆయన పుష్కలంగా ఆశీస్సులు అందజేస్తున్నారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. భాగస్వామీపక్షాలకు కేటాయించిన సీట్లలో తెలుగుదేశం తిరుగుబాటు అభ్యర్థులను దొంగ చాటుగా ప్రోత్సహిస్తూ, ఆ సీటు గెలుచుకుని మళ్లీ మన పార్టీలోకి వచ్చేయండి అని చంద్రబాబు వారికి రహస్యంగా సూచిస్తున్నట్లు తెలుస్తోంది.ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రమైన పోటీ ఉన్న ఒకటి రెండు చోట్ల.. అనివార్యమైన పరిస్థితుల్లో ఒకరికి టికెట్ కట్టబెట్టినప్పటికీ రెండో నాయకుడు తిరుగుబాటు చేస్తుంటే చంద్రబాబు నిర్లిప్తంగా ఉన్నట్లుగా, చిత్తశుద్ధి లేని బుజ్జగింపులు చేస్తున్నట్లుగా వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే అనేక నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అతలాకుతలంగా ఉంది. అసంతృప్తులు, అసమ్మతులు భగ్గుమంటున్నాయి. పార్టీ ఆఫీసులలో విధ్వంసం జరుగుతోంది. ఐదేళ్లపాటు చాకిరీ చేయించుకున్న పార్టీ అధిష్టానం ఎన్నికల సమయం వచ్చేసరికి రిక్త హస్తం చూపించడంపై ఇన్నాళ్లు కష్టపడిన నాయకులు కుతకుతలాడిపోతున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి తానే బరిలో ఉంటానని పవన్ కళ్యాణ్ ప్రకటించిన తర్వాత అక్కడ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న వర్మ వర్గీయులలో అసంతృప్తి రాజుకుంది. 2014 ఎన్నికలలో ఇండిపెండెంట్‌గా విజయం సాధించినంతటి సొంత బలం వర్మకు ఉంది. అదే 2019 ఎన్నికలు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దిగిన వర్మ, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హవా ఎదుట నిలబడలేకపోయారు. ఓటమి తప్పలేదు. కానీ, అప్పటినుంచి ప్రజల్లో ఉంటూ పార్టీని కాపాడుకుంటూ పనిచేస్తూ వచ్చారు. ఇప్పుడు అభ్యర్థిగా పవన్ వస్తాడు అనేసరికి ఆ వర్గం భగ్గుమంటోంది. చంద్రబాబు నాయుడు వర్మకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడినట్లు కూడా సమాచారం వస్తోంది. చర్చించడానికి ఉండవల్లిలో నివాసానికి రమ్మని చంద్రబాబు ఆహ్వానిస్తే.. కార్యకర్తలతో సమావేశం పూర్తయిన తర్వాత వస్తానని వర్మ సమాధానంగా చెప్పారు. పెనమలూరు నియోజకవర్గం పరిస్థితి కూడా గందరగోళంగా ఉంది. అక్కడ బోడే ప్రసాద్‌కు టికెట్ దక్కదని తేల్చి చెప్పేశారు.మైలవరం సీటును వైసీపీ నుంచి కొత్తగా ఫిరాయించి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్‌కి ఇవ్వాల్సి రావడంతో, దేవినేని ఉమామహేశ్వర రావును పెనమలూరుకు బదిలీ చేయాలని చంద్రబాబు కుట్ర. ఇన్నాళ్లు ఆ నియోజకవర్గంలో పనిచేసిన బోడే ప్రసాద్ ఇప్పుడు రగిలిపోతున్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యే బరిలో ఉంటానని.. ఇండిపెండెంటుగానైనా పోటీ చేస్తానని, విజయం సాధించి నియోజకవర్గాన్ని చంద్రబాబుకు కానుకగా ఇస్తానని ఆయన తన భక్తిని చాటుకుంటున్నారు.బీజేపీకి జనసేనకు కేటాయించిన సీట్లలో తన పార్టీ వారు బరిలోకి దిగేలాగా చంద్రబాబు చేసిన వ్యూహరచన పాతది. కొన్ని సంవత్సరాల కిందట బీజేపీలోకి ప్రవేశించిన తెలుగుదేశం నాయకులు, పులవర్తి రామాంజనేయులు తరహాలో ఇప్పుడిప్పుడే జనసేనలో చేరుతున్న నాయకులు అభ్యర్థిత్వాలను దక్కించుకుంటున్నారు. ఆ మొదటి వ్యూహం పూర్తయిన తర్వాత, రెండో వ్యూహాన్ని చంద్రబాబు కార్యరూపంలో పెడుతున్నారు. తమ పార్టీకి చెందిన కొందరిని ఇండిపెండెంట్లుగా బరిలోకి దించుతున్నారు. వారికి తన ఆశీస్సులు ఉంటాయని రహస్య దూతల ద్వారా తెలియపరుస్తున్నారు.పవన్ కళ్యాణ్ పార్టీ గెలిచే సీట్లు తన ప్రభుత్వానికి అవసరం కానీ, ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రభుత్వంలో తలనొప్పిగా మారుతారని, తన కొడుకును వారసుడిగా సీఎం కుర్చీ మీద కూర్చోబెట్టడానికి అడ్డు తగులుతారనే భయం చంద్రబాబులో ఉంది. అందుకే పిఠాపురం నియోజకవర్గంలో వర్మను బుజ్జగిస్తున్నట్లుగా నటిస్తూ, ఇండిపెండెంటుగా పోటీ చేయడానికి ఆయనే ఎగదోస్తున్నారని అభిప్రాయం పలువురిలో కలుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా అనేక నియోజకవర్గాలలో ఇలాంటి కుటిల వ్యూహాలతో చంద్రబాబు మిత్ర పక్షాల అభ్యర్థులను కూడా తనకు అలవాటు అయిన దారిలో వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.- వంశీకృష్ణ -
Pawan Kalyan: ప్చ్.. ఈసారి పూర్తిగా క్షవరం!
పవన్ కల్యాణ్ సెంటిమెంట్లకు, ఇంకా సూటిగా చెప్పాలంటే మూఢ నమ్మకాలకు చాలా చాలా విలువ ఇచ్చే వ్యక్తి అని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆయన తన అత్యంత విశ్వసనీయుడైన సహచరుడితో కలిసి క్షుద్రపూజలు కూడా చేయిస్తూ ఉంటారని, ఆ క్షుద్రపూజలే ఎన్నికల్లో గెలిపిస్తాయనే విశ్వాసంతో కూడా ఉంటారని కూడా గతంలో విస్తృతంగా ప్రచారం అయింది. అలాంటి పవన్ కల్యాణ్ ఒక్కో సమయంలో ఒక్కో రకం సెంటిమెంటును ఆశ్రయిస్తుంటారు. ఈసారి 2024 ఎన్నికలను ఎదుర్కోవడానికి ఆయన ‘క్లీన్ షేవ్’ సెంటిమెంటును నమ్ముకున్నట్టుగా కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ తరచుగా బవిరిగడ్డంతో కనిపిస్తూ ఉంటారు. నిజానికి సినిమా హీరోలు చాలా వరకు షూటింగులు లేని సమయాల్లో గడ్డం మెయింటైన్ చేస్తూ షూటింగు ఉన్నప్పుడు మాత్రం ఆ పాత్ర అవసరాన్ని బట్టి క్లీన్ షేవ్ చేసుకుంటూ ఉంటారు. పవన్ కల్యాణ్, రాజకీయ నేతగా నిత్యం గడ్డంతో కనిపించడాన్నే ప్రజలకు అలవాటు చేశారు. గడ్డంతో మాత్రమే తన మొహానికి కాస్త పెద్దరికం వస్తుందని ఆయన అనుకున్నారో ఏమో తెలియదు. లేదా గడ్డంతో వెళితే గొప్ప రాజకీయ నాయకుడు అయిపోతావని ఎవరైనా స్వాములు ఆయనకు ఉపదేశించారో తెలియదు. మొత్తానికి గడ్డంతోనే రాజకీయం చేస్తూ వచ్చారు. కానీ ఇప్పటిదాకా ఆయన సాధించిన ఫలితం సున్నా. ఈ ఎన్నికల సీజను వచ్చిన తర్వాత.. ముందుగా గడ్డాన్ని పూర్తిగా త్యజించారు. ఎప్పుడు చూసినా ‘క్లీన్ షేవ్డ్’ గా కనిపిస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో ‘క్లీన్ షేవ్’ లుక్ గెలిపిస్తుందనే సెంటిమెంటు ఆయనను ముందుకు నడిపిస్తున్నట్టుగా ఉంది. పాపం ఎన్నికల సీజన్లో పవన్ ఇంకా అనేక సెంటిమెంట్లను కూడా పక్కన పెట్టారు. గత ఎన్నికల సమయానికి ఆయన మెడలో అందరికీ కనిపించేలా కట్టుకున్న ఒక తావీదు సాయంతో రాజకీయం చేశారు. ఎర్రటి దారానికి కట్టిన తావీదు ఉండేది. తావీదు మహిమ తనను గెలిపిస్తుందనే ఆయన బలంగా నమ్మారు. కానీ అది పనిచేయలేదు. తావీదు ఎంత దారుణంగా ప్రతికూల ఫలితాన్నిచ్చింది. పార్టీ తరఫున ఒక్కడు గెలిస్తే, గెలిచిన వెంటనే ఫిరాయించేశాడు. స్వయంగా పవన్ రెండుచోట్ల ఓడిపోయారు.తావీదు మీద ఆయనకు నమ్మకం పోయింది గానీ.. చాలాకాలం దానిని కొనసాగించాడు. ఈలోగా ఉంగరాల పిచ్చి పట్టుకుంది. రాళ్ల ఉంగరాలు ధరిస్తే రాజయోగం పడుతుందని బాబాలో, స్వాములో మళ్లీ పవన్ చెవిలో ఊదినట్టున్నారు. వెంటనే ఆయన బాగా స్ఫుటంగా కనిపించేలా ఎర్రటి పెద్ద రాయి, పగడం లాంటిది, పొదిగిన ఉంగరాన్ని ధరిస్తూ దూసుకెళ్లిపోయారు. ఆ ఉంగరాల ప్రభావం కూడా రాజకీయ వైభవాన్ని అందించలేదు. ఇప్పుడు పవన్ కల్యాణ్ మొత్తంగా స్టైల్ మార్చారు. చేతులకు ఉన్న పదివేళ్లకూ ఒక్క ఉంగరం కూడా లేదు. రాళ్ల ఉంగరాలు గానీ, ఇతరత్ర మంత్ర శక్తులు ఆవాహన చేసిన బంగారు ఉంగరాలు గానీ పెట్టుకోవడం లేదు. తాయెత్తులు ధరించడం లేదు. ఎట్ లీస్ట్ మెడలో అందరికీ కనిపించేలా ధరించడం లేదు. గడ్డాన్ని కూడా పరిత్యజించారు. క్లీన్ షేవ్డ్ వ్యక్తిగా, ఏ ఎగస్ట్రా సెంటిమెంటు ఆభరణాలు, తొడుగులు లేని మనిషిగా ప్రస్తుతం రాజకీయం చేస్తున్నారు. మరి ఈ క్లీన్ షేవ్ సెంటిమెంట్ కనీసం ఆయననైనా గెలిపిస్తుందా? లేదా, ఫలితాలు కూడ క్లీన్ షేవ్ అయిపోతాయా అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో జరుగుతోంది. పవన్ కల్యాణ్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని.. తమ పార్టీ స్థాయికి తగినన్ని సీట్లు పొందడంలోనే విఫలం అయ్యారు. ఆ రకంగా చూస్తే ఇప్పటికే పాక్షికంగా ‘షేవ్’ అయినట్టే. ఎన్నికల ఫలితాల తర్వాత ‘క్లీన్ షేవ్’ అయినట్టా కానట్టా అని తేలుతుంది!.-వంశీకృష్ణ -
జనసేన పవన్: 15 టికెట్లున్నాయ్.. రండిబాబూ రండి!
తనకేదో వీరబీభత్సమైన ప్రజాదరణ ఉన్నదని ముందుగా ప్రచారం చేసుకోవాలి. ఓట్లు పడినా పడకపోయినా పర్లేదు.. స్టార్ట్ కెమెరా యాక్షన్ అనగానే.. ఎమోషన్స్ రకరకాలుగా పండించినంత ప్రొఫెషనల్‌గా, వేదిక ఎక్కితే ఆవేశపూరిత ప్రసంగాలతో విజిల్స్ కొట్టించుకోవాలి. చాలు.. అక్కడితో మాబలం అపూర్వం అని చాటుకుని.. సీట్ల విషయంలో పెద్ద బేరాలు పెట్టవచ్చు. పెద్ద నెంబరు దగ్గర ప్రారంభించి.. వీలైనన్ని దక్కించుకోవచ్చు. సీట్లు దక్కిన తర్వాత పరిస్థితి ఏమిటి.. వాటిని బహిరంగమార్కెట్లో వేలానికి పెట్టవచ్చు. ..అచ్చంగా ఇది పవన్ కల్యాణ్ అనుసరిస్తున్న తీరు!జనసేన పార్టీని స్థాపించి పదేళ్లకు పైగానే అయింది గానీ.. పార్టీ సంస్థాగత నిర్మాణం అనే పదానికి అర్థం కూడా తెలియని నాయకుడు పవన్ కల్యాణ్.. ఇప్పుడు మరోసారి తెలుగుదేశం పొత్తుల్లో ఉంటూ, ఈసారి వారు విదిల్చిన సీట్లలో పోటీకి దిగుతున్నారు. ఇంతకూ ఆయనకు అన్ని స్థానాల్లో పోటీకి అభ్యర్థులు ఉన్నారా? అంటే ఆ పార్టీలో ఎవ్వరివద్దా సమాధానం ఉండదు. ప్రతీచోటా టికెట్ ఆశించే అనాకానీ నేతలు బోలెడుమంది ఉంటారు. కానీ పవన్ కల్యాణ్ ఆశించే ‘బలం’ చూపించగలిగిన వాళ్లు ఎందరుంటారు? అందుకే 24 అనుకుని 21 తగ్గిన తర్వాత 6 సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించిన పవన్ కల్యాణ్.. మిగిలిన 15 సీట్లను బేరానికి పెడుతున్నారు.పవన్ కల్యాణ్ తాను ఎంత గొప్ప నాయకుడిని అని చెప్పుకున్నా.. తన పార్టీ ఎంత గొప్పదని చెప్పుకున్నా.. సభలు గట్రా నిర్వహించేప్పుడు ఆయనతో పాటు వేదికమీద కూర్చోడానికి నాదెండ్ల మనోహర్ తప్ప మరో నాయకుడికి గతి లేదు. అలాగే 24, 21 కాదు కదా.. ఆయన పార్టీకి చంద్రబాబు 50 సీట్లు కేటాయించినా ఆయన వద్ద పట్టుమని పది మంది అభ్యర్థులు కూడా సిద్ధంగా లేరు అనే భావన ప్రజలకు కలుగుతోంది. ఎందుకంటే.. తొలిజాబితా అనే పేరుతో ఐదుగురి పేర్లను, తర్వాత మరొక పేరును పవన్ విడుదల చేశారు. మిగిలిన స్థానాలకు ఎప్పుడు ప్రకటిస్తారో తెలియదు. ఈలోగా.. ఏ పార్టీనుంచి ఎవరు వచ్చి తమ పార్టీలో చేరుతారా? అని ఎదురుచూస్తూ గడుపుతున్నారు. ప్రకటించిన ఆరు సీట్లలో కూడా కొణతల రామకృష్ణ కొన్ని వారాల కిందటే పార్టీలో చేరిన వ్యక్తి. తాజాగా భీమవరంలో మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేనకు రెండు ఎంపీ సీట్లు దక్కగా మచిలీపట్నం సీటును కొత్తగా పార్టీలో చేరిన వల్లభనేని బాలశౌరికి కట్టబెట్టేస్తున్నారు. చూడబోతే ఒకటీ అరా తప్ప జనసేన వాటాకు దక్కిన సీట్లన్నీ జస్ట్ ఇప్పుడే పార్టీలో చేరుతున్న వారికే దక్కుతున్నాయి. సీటు కన్ఫర్మేషన్ తర్వాతనే.. ఉన్న పార్టీని వదలి జనసేనలో చేరుతున్నారనే వాదన కూడా ఉంది. అన్ని సీట్లను కొత్తవారికే ఇస్తోంటే ప్రధానంగా రెండు అనుమానాలు కలుగుతాయి. ఒకటి- జనసేన పార్టీకి అసలు సొంతంగా ఎమ్మెల్యే స్థాయికి పోటీచేయగల నాయకుల కొరత చాలా ఉంది. రెండు- పంపకాల్లో సీట్లను తేల్చుకున్న తర్వాత.. పవన్ కల్యాణ్ వాటిని అమ్మకానికి పెడుతున్నారు. ఇందులో రెండో ఆప్షన్ ఎక్కువ సందర్భాల్లో నిజమని ప్రజలు నమ్ముతున్నారు.పార్టీ దుస్థితి అనాలో లేదా, పవన్ కల్యాణ్‌లోని వ్యాపార మెళకువ అనాలో తెలియదు. మొత్తానికి ఆయన అలవాటు మాత్రం సీట్లను బేరం పెట్టుకోవడమే. తెలంగాణలో బీజేపీతో చాలా దూరం సాగదీసి 119లో ఎనిమిది సీట్లు దక్కించుకున్న పవన్‌కు ఆయా స్థానాల్లో పోటీచేయించేందుకు కూడా అభ్యర్థులు లేరు. సగానికి పైగా అప్పటికప్పుడు కొత్తగా పార్టీలోకి వచ్చి చేరిన వారికి ఆ సీట్లను అమ్ముకున్నారు. ఇప్పుడు ఏపీలో ఆయనకు దక్కినది 21 కాగా.. ఆరు చోట్ల అభ్యర్థులను నిర్ణయించేయగా, మిగిలిన 15 సీట్లను బేరానికి పెట్టారు.నిజానికి పవన్ కల్యాణ్ ఒక స్థానంలో పోటీచేస్తారు కదా అనుకోవచ్చు. అదేం లేదు.. మంచి బేరం తగిలితే.. మొత్తం 15 టికెట్లను కూడా అమ్మడానికి ఆయన సిద్ధమే అని ప్రజలు అనుకుంటున్నారు. ఎటూ దక్కిన రెండు ఎంపీ సీట్లలో ఒకటి వల్లభనేని బాలశౌరి బేరానికి ఇచ్చేసిన పవన్ కాకినాడలో తానే ఎంపీగా పోటీచేస్తారనే ప్రచారం ఉంది. ఎటూ ఏపీలో ఈ కూటమి గెలిచేది లేదు.. ఎంపీగా నెగ్గితే సెంటర్లో మంత్రి కావచ్చునని ఆయన ఆశపడుతున్నారు. అందువల్ల.. మంచి బేరం దొరికితే.. తనకోసం ఒక్కటి కూడా ఉంచుకోకుండా మొత్తం 15 ఎమ్మెల్యే సీట్లను కొత్తగా వచ్చేవారికి అమ్మేస్తారని అనుకుంటున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి, డబ్బు సంచులతో వచ్చేవారికి రెడ్ కార్పెట్ వేస్తున్నారని అనుకుంటున్నారు.-వంశీకృష్ణ -
‘బీజేపీ, జనసేనల్లో వీళ్లను ఓడించండి’
తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించినంత వరకు చంద్రబాబునాయుడుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయనలాగా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసినవాళ్లు ప్రస్తుతానికి లేరు. అలాగే ఆయన పేరుకు ఒక పర్యాయపదం కూడా ఉంది. అదే ‘వెన్నుపోటు’! రాజకీయంగా ఓడిపోయి దిక్కులేకుండా పడి ఉన్న సమయంలో చేరదీసి పార్టీ కీలక బాధ్యతలు కూడా అప్పగించిన సొంత మామయ్యను వెన్నుపోటు పొడిచి పార్టీని, అధికారాన్ని హస్తగతం చేసుకున్న తీరు చంద్రబాబుది. అలాంటి చంద్రబాబు.. తన వెన్నుపోటు బుద్ధులను ఎలా మార్చుకుంటారు? ఎందుకు మార్చుకుంటారు?.. అందుకే.. పొత్తులు కుదిరిన తర్వాత కూడా బీజేపీ, జనసేన పార్టీల తరఫున పోటీచేయబోయే కొందరు అభ్యర్థుల్ని ఓడించడానికి చంద్రబాబు ఇప్పటినుంచే స్కెచ్ సిద్ధం చేసినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. పొత్తుల్లో భాగంగా చంద్రబాబు.. మిత్రపక్షాలు ఇద్దరికీ కలిపి 31 అసెంబ్లీ స్థానాలు, 8 ఎంపీస్థానాలు మాత్రమే కేటాయించారు. వారిలో వారు కొట్టుకునేలా, బీజేపీ అంటే మితిమీరిన భయం ఉన్న పవన్ కల్యాణ్ తనకు విదిలించిన 24 సీట్లలో కూడా కొన్ని కోల్పోయేలాగా ఆయన తన స్కెచ్ ను పదును పెట్టారు. అయితే తాజాగా వినిపిస్తున్న గుసగుసలు ఏంటంటే.. బీజేపీ తరఫున, జనసేన తరఫున కూడా పోటీచేయబోతున్న కొందరు కీలక నాయకుల్ని ఓడించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని!. చంద్రబాబుతో పొత్తుబంధాన్ని వ్యతిరేకించిన వారు, ఆయన వెన్నుపోటు దారుడని, ఆయన్ని నమ్ముకుని రాజకీయం చేస్తే తమను నట్టేట ముంచేస్తాడని బహిరంగంగానే తమ అనుమానాలను వ్యక్తంచేసిన వారు ఈ రెండు పార్టీల్లో కూడా ఉన్నారు. అలాంటి వారు ఎన్నికల్లో నెగ్గరాదని.. వారికి ఓటమి రుచిచూపించి వారి రాజకీయ భవిష్యత్తును అయోమయంలో పడేయాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారట.ఈ వ్యూహానికి ఒక ఉదాహరణ కూడా చెబుతున్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అద్యక్షుడు సోము వీర్రాజు విషయమే తీసుకుందాం. ఆయన పార్టీ సారథిగా ఉన్నన్నాళ్లూ చంద్రబాబునాయుడుకు చుక్కలు చూపించారు. చంద్రబాబు అవినీతి, అక్రమాల గురించి ఒక రేంజిలో ఆడుకున్నారు. చంద్రబాబు అక్రమాల మీద విచారణ జరగాలని కూడా డిమాండ్ చేశారు. పొత్తుల గురించిన చర్చలు మొదలైన తర్వాత కూడా.. సోము వీర్రాజు ప్రతికూలంగా మాట్లాడారు. రాష్ట్రంలో పొత్తులు ఉండవని, 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు తాము ఒంటరిగా పోటీచేస్తాం అని ఆయన చెప్పుకొచ్చారు.అయితే ఇప్పుడు పొత్తులు కుదిరిన తర్వాత ఆయన రాజమండ్రి ఎంపీ నియోజకవర్గం నుంచి బరిలో దిగవచ్చునని వినిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సోము వీర్రాజు ఎంపీగా నెగ్గకుండా.. ఇప్పటికే చంద్రబాబు తమ పార్టీ వారిని పురమాయించినట్లుగా తెలుస్తోంది. పగబట్టిన తాచుపాములాగా.. తనను తిట్టిన సోము వీర్రాజుకు తన తడాఖా చూపించాలని ఆయన అనుకుంటున్నారట. జనసేనలో కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా గతంలో మాట్లాడిన వారిని టార్గెట్ చేస్తున్నారట. ఎమ్మెల్యేల విషయంలోనైనా రాజీపడతారేమో గానీ.. ఎంపీల జాబితాలో మాత్రం.. తనకు గిట్టని వారిని ఓడించడానికి చంద్రబాబు లిస్టు సిద్ధంచేసినట్టు సమాచారం. చంద్రబాబునాయుడు అసలు వైఖరి తెలిసిన వాళ్లు మాత్రం.. ఒకవేళ రాష్ట్ర బీజేపీ సారథి దగ్గుబాటి పురందేశ్వరి నిలబడినా కూడా.. ఆమెను ఓడించడానికి తెరవెనుక కుట్రలు చేస్తారని, మంత్రి పదవుల వద్ద చికాకు పెడతాడనే ఉద్దేశంతో పవన్ కల్యాణ్ ఓటమికి ఆయన కుట్ర చేసినా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. :::వంశీకృష్ణ -
వదినమ్మను లూప్ లైన్లోకి నెట్టిన చంద్రబాబు!
కాపురం చేసే కళ.. కాలు తొక్కిన నాడే తెలుస్తుందని సామెత! చంద్రబాబునాయుడుతో వ్యవహారం ఎలా ఉంటుందో పొత్తు కుదిరిన తర్వాత చర్చలకు కూర్చున్న తొలిరోజునే బయటపడిపోయింది. బతిమాలి బామాలి బిజెపి పెద్దల కాళ్లు పట్టుకున్నంత పనిచేసి మొత్తానికి వారితో పొత్తు కుదుకున్న నారా చంద్రబాబునాయుడు.. పొత్తు ప్రకటన వచ్చిన తర్వాత.. సీట్ల సర్దుబాటు చర్చల కోసం కూర్చున్న తొలిరోజునే తన విశ్వరూపం, అసలు రూపం చూపించేశారు. బిజెపిలో అంతర్గతంగా పొత్తులకు అనుకూలతను రాబట్టిన వదినమ్మ పురందేశ్వరికి అప్పుడే వెన్నుపోటు పొడిచేశారు. చర్చల రోజు నాటికే ఆమెను లూప్ లైన్లోకి నెట్టేశారు. రాష్ట్ర బిజెపి సారధి అయినప్పటికీ.. ఆమె చర్చల్లో లేకపోవడం ఇవాళ్టి రాజకీయ పరిణామాల్లో హైలైట్.రెండు రోజుల కిందట చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ లు ఢిల్లీలో రెండు రోజుల పాటు మకాం వేసి భాజపాతో పొత్తులు కుదర్చుకున్నారు. అయితే ఏ సీట్లలో ఎవరు పోటీచేయాలి అనేది తేలలేదు. ఆ విషయాలు చర్చించడానికి ఢిల్లీ నుంచి కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, బిజెపి నేత బైజయంత్ పండా వచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ యథావిధిగా తన వెన్నంటి నాదెండ్ల మనోహర్ ను తీసుకువెళ్లారు. తెలుగుదేశం తరఫున కూడా అచ్చెన్నాయుడు తదితరులు ఉన్నారు. అయితే ట్విస్టు ఏంటంటే.. ఈ భేటీలో పురందేశ్వరి లేరు. ఏపీ భారతీయ జనతా పార్టీకి ఆమె సారథి! అయినా సరే.. ఆమె లేకుండానే.. ఈ మూడు పార్టీల భేటీ జరగడం.. సీట్ల పంపకాల గురించి కీలక నిర్ణయాలు తీసుకోవడం అనేది ఆమె పట్ల అవమానకరమైన నిర్ణయం అనే అభిప్రాయం విశ్లేషకుల్లో వ్యక్తమౌతోంది. ఒకవైపు పురందేశ్వరి బిజెపి పగ్గాలు చేపట్టిన నాటినుంచి.. ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డిని అదేపనిగా తిడుతూ చంద్రబాబునాయుడు బలం పెరగడానికి తన వంతు కృషి చేస్తూ వచ్చారు. చంద్రబాబు తరపున బిజెపిలో పనిచేస్తున్న సరికొత్త కోవర్టుగా కూడా ముద్ర వేయించుకున్నారు. అయితే చంద్రబాబు నాయుడు వెన్నుపోటు అలవాటు గురించి.. ఆమె మరచిపోయినట్టున్నారు. నిజానికి పురందేశ్వరి చంద్రబాబు వెన్నుపోటు ధోరణిని మర్చిపోకూడదు. ఎందుకంటే.. స్వయంగా ఆమె తండ్రి ఎన్ టి రామారావును వెన్నుపోటు పొడిచి.. అధికారం దక్కించుకున్న వ్యక్తి ఆయన! కాకపోతే ఆ వెన్నుపోటు పర్వంలో ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా పాత్రధారి కావడం వలన ఆమె దానిని ప్రస్తావించకపోవచ్చు. కానీ.. కొంతకాలం గడవగానే.. ఆమె భర్తను కూడా లూప్ లైన్లోకి నెట్టేసి పార్టీని మొత్తంగా హస్తగతం చేసుకున్న కుయుక్తుల మేధావి చంద్రబాబు. అలాంటి మరిది కుట్రబుద్ధుల గురించి ఆమెకు తెలియదని అనుకోలేం. అయినా సరే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె బిజెపి సారథిగా వచ్చిననాటినుంచి చంద్రబాబుకు అనుకూలంగా ఆ పార్టీని నడుపుతూ వచ్చారు. పొత్తులకు అనుకూల నివేదికలను తయారుచేసి ఢిల్లీ పంపారు. మరిది కోసం ఇన్ని చేసినప్పటికీ.. ఆయన మాత్రం.. తన వెన్నుపోటు బుద్ధి పోనిచ్చుకోకుండా.. ఆమెను పొత్తుకుదిరిన వెంటనే లూప్ లైన్లోకి నెట్టేశారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. చంద్రబాబు వెన్నుపోటు టేలెంట్ ను ముందుముందు ఆమె మరింతగా చూడాల్సి వస్తుందని కూడా పార్టీలో అనుకుంటున్నారు.:::వంశీకృష్ణ