మీసాలతో మినీ బస్సులాగాడు..
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని అరిపిరాలకి చెందిన ఎర్రబోయిన కొమురెల్లి యాదవ్ సోమవారం తన మీసాలతో సుమారు 100 మీటర్ల దూరం వరకు మినీ బస్సును లాగాడు. తొర్రూరులో మెకానిక్. ఈయన గిన్నిస్ రికార్డు సాధించాలనే లక్ష్యంతో తన మీసాలను పెద్దవిగా పెం చుకోవడం ప్రారంభించాడు. ఈ మీసా లతో 2012లో గ్యాస్ సిలిండర్, 2013లో మారుతీకారు, 2014లో రెండు మారుతీ కార్లను లాగాడు. ఈసారి ఏకంగా మినీ బస్సును సుమారు 100 మీటర్ల వరకు లాగి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. లారీ వంటి పెద్ద వాహనాన్ని లాగడమే తన లక్ష్యమని చెప్పాడు.