kurlapalli
-
జాతరకొచ్చి కానరాని లోకాలకు..
ఎదురెదురుగా ఢీకొన్న బైక్‌లు యువకుడు దుర్మరణం మరో ముగ్గురికి గాయాలు మరికొన్ని గంటల్లో గంజుకుంటమ్మ (మారెమ్మ) జాతర సÜంబరంగా జరుపుకోవాల్సి ఉంది. ఇల్లంతా బంధువులతో నిండిపోయింది. ఇంతలో పిడుగులాంటి వార్త. రోడ్డు ప్రమాదంలో ఆ కుటుంబ సభ్యుడు ఒకరు దుర్మరణం చెందారు. జాతరకొచ్చి కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది. దేవుడా.. ఎంత పని చేశావయ్యా అంటూ మృతుడి తల్లిదండ్రులు, సోదరీమణులు విలపించారు. కళ్యాణదుర్గం: ఎర్రంపల్లి గేటు వద్ద బుధవారం వేగంగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కుర్లపల్లికి చెందిన బొజ్జన్న (25) అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే ప్రమాదంలో కుర్లపల్లికి చెందిన శిల్ప, కామక్కపల్లికి చెందిన నరసింహులు, కంబదూరుకు చెందిన నారాయణస్వామిలు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. కుర్లపల్లికి చెందిన అగులూరప్ప, రామలక్ష్మమ్మ దంపతులకు కుమారుడు బొజ్జన్నతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బొజ్జన్న ఎనిమిదేళ్లుగా బెంగళూరులో తన చిన్నాన్న గోవిందు వద్ద ప్లెక్సీల ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేస్తున్నాడు. మారెమ్మ జాతర కోసం మంగళవారం స్వగ్రామానికి వచ్చాడు. పండుగ పనులలో భాగంగా బుధవారం తనబంధువు అయిన హనుమంతప్ప కూతురు శిల్పతో కలిసి ద్విచక్రవాహనం (స్పోర్ట్స్ బైక్)లో స్వగ్రామం నుంచి కళ్యాణదుర్గానికి బయల్దేరాడు. కంబదూరుకు చెందిన నారాయణస్వామి తన మిత్రుడైన కామక్కపల్లికి చెందిన నరసింహులును ద్విచక్రవాహనంలో ఎక్కించుకుని కళ్యాణదుర్గం నుంచి స్వగ్రామానికి వస్తున్నాడు. కళ్యాణదుర్గం – కంబదూరు ప్రధాన రహదారిలో ఎర్రంపల్లి గేటు సమీపంలో రెండు ద్విచక్రవాహనాలూ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బొజ్జన్న అక్కడికక్కడే మృతి చెందాడు. శిల్ప తలకు బలమైన గాయమైంది. నారాయణస్వామి తలకు తీవ్ర రక్తగాయాలవగా.. నరసింహులుకు ఎడమకాలు విరిగిపోయింది. ముగ్గురినీ కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం డాక్టర్ల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం అనంతపురం తీసుకెళ్లారు. కాగా నారాయణస్వామి, శిల్పల పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. టౌన్ ఎస్ఐ శంకర్‌రెడ్డి కేసు దర్యాప్తుచేస్తున్నారు. -
బెండకాయల వ్యాన్ బోల్తా
- తొమ్మిది మంది రైతులకు గాయాలు - పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తరలిస్తుండగా ఘటన ------------------------------------------------------------------- కనగానపల్లి : అనంతపురం-బెంగళూరు 44వ నంబర్ జాతీయ రహదారిలోని కనగానపల్లి మండలం కుర్లపల్లి సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది రైతులు గాయపడ్డారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. ఎలా జరిగిందంటే... బుక్కరాయసముద్రం, కె.కె.అగ్రహారం, కొర్రపాడు, నీలారెడ్డిపల్లి గ్రామాలకు చెందిన పది మంది రైతులు కలసి తాము పండించిన బెండకాయలను బెంగళూరు మార్కెట్‌కు తరలించాలనుకుని 407 వ్యాన్‌ను అద్దెకు తీసుకుని బయలుదేరారు. మార్గమధ్యంలోని కుర్లపల్లి సమీపానికి రాగానే జాతీయ రహదారిపై వేగంగా దూసుకువచ్చిన గుర్తుతెలియని వాహనాన్ని తప్పించేందుకు వ్యాన్ డ్రైవర్ ఎర్రిస్వామి ప్రయత్నించాడు. అయితే వ్యాన్ అదుపు తప్పి బోల్తాపడింది. వ్యాన్‌లోని మూటలపై కూర్చొన్న రైతులు ఎగిరి కిందపడ్డారు. ఘటనలో అంజి, నాగరాజు, వెంకటరాముడు, అబ్దుల్ రజాక్, నాగముని, కృష్ణారెడ్డి, నాగర్జున, శివరాం, రమేశ్ అనే రైతులు గాయపడ్డారు. కొందరికి కాళ్లు, చేతులు విరిగాయి. హైవే పెట్రోలింగ్ సిబ్బంది చొరవ ప్రమాదం జరిగిన వెంటనే హైవే పెట్రోలింగ్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. గాయపడ్డ రైతులను వెంటనే అనంతపురం పెద్దాస్పత్రికి తరలించారు. ఆ తరువాత కనగానపల్లి, ధర్మవరం రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి జాతీయ రహదారిపై చెల్లాచెదురుగా పడిన మూటలతో పాటు వ్యాన్‌ను పక్కకు తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేశారు. -
కరువు ఓడించింది...పాడి గెలిపించింది
కుర్లపల్లి(కనగానపల్లి): వరుస కరువులు కర్షక కుటుంబాలను ఛిద్రం చేశాయి. అ యినా మనో స్థైర్యం కోల్పోని రైతులు ప్రత్యామ్నాయంగా పాడిని ఎంచుకున్నారు. క్షీరవిప్లవం సాధించి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలంలోని కుర్లపల్లి గ్రామానికి చెంది న రైతు రామిరెడ్డి కుమారులు ఆదినారాయణరెడ్డి, గోపాల్‌రెడ్డిలకు 20 ఎకరాల పొలం ఉంది.గత ఐదు సంవత్సరాలుగా సక్రమంగా వర్షాలు రాక మెట్ట భూమిలో పంటలు చేతికందలేదు. దీంతో తరి పొలంలో లక్షల రూపాయలు వ్యయం చేసి 20 బోర్లు వేయించా రు. వర్షాలు రాక వాటిలో కూడా నీరు అడుగంటింది. ఈ పరిస్థితుల్లో వారి దృష్టి పాడి రంగంపై పడింది. మొదట నాలుగు పాడి ఆ వులను (జెర్సీ జాతి) కొనుగోలు చేసి పోషణ ప్రారంభించారు. కొంత ఆదాయం రావడంతో తిరిగి మరో ఎనిమిది పాడి అవులను కొనుగోలు చేశారు. ఒక బోరుబావిలో అరకొరకగా వస్తున్న నీటితో ఎకరం పొలంలో పశుగ్రాసం పెంచారు. ప్రస్తుతం వారి వద్ద ఉన్న 10 పాడి ఆవుల ద్వారా రోజుకు 80 లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తున్నారు. లీటరు 20 రూపాయల ప్రకారం ప్రైవేటు డెయిరీలకు విక్రయిస్తున్నారు. రోజుకు రూ. 1600, నెలకు రూ.50 వేలు ఆదాయం అందుతోంది. పశువుల దాణా, వట్టిగడ్డి, వైద్యం, మందులకు నెలకు రూ. 20 వేల దాకా ఖర్చు అవుతుందని, ఇవి పోనూ నెలకు రూ. 30 వేల వరకు ఆదాయం వస్తుందని రైతులు తెలిపారు. ప్రభుత్వం డెయిరీలు ఏర్పాటుచేసి పాలను కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పిస్తే నెలకు మరో రూ. 10 వేల ఆదాయం పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పంటలు పండక తీవ్రంగా నష్టపోయాం వర్షాభావంతో నాలుగు సంవత్సరాల నుంచి పంటలు పండక తీవ్రంగా నష్టపోయాం. అప్పులు చేసి 20 బోర్లు వేయించినా నీరు పడలేదు. దీంతో వేరుశనగ, దోశ, కాయగూరల పంటలు చేతికందక నష్టపోయాం. మూడు సంవత్సరాల నుంచి వ్యవసాయాన్ని వదలేసి పాడి ఆవులను పోషించుకుంటూ ఆదాయాన్ని గడిస్తున్నాం.గడ్డి కొరత లేకపోలే మరింత ఆదాయం పొందవచ్చు. -బి.ఆదినారాయణరెడ్డి, యువరైతు, కుర్లపల్లి గ్రామం, కనగానపల్లి మండలం, అనంతపురం జిల్లా.