Laila khan
-
నటి కుటుంబం దారుణ హత్య.. తీర్పు వెలువరించిన కోర్టు!
బాలీవుడ్ నటి లైలా ఖాన్ ఫ్యామిలీ దారుణ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆమె సవతి తండ్రికి ముంబయి సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. దాదాపు 13 ఏళ్ల క్రితం జరిగిన ఈ దారుణ ఘటనపై విచారణ చేపట్టిన ముంబయి సెషన్స్ కోర్టు తుది తీర్పు వెలువరించింది.అసలేం జరిగిందంటే?బాలీవుడ్ నటి లైలా ఖాన్ ఫ్యామిలీ దారుణ హత్యకు గురికావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆమె సవతి తండ్రి అయిన పర్వేజ్ తక్ వారి ఫ్యామిలీ మొత్తాన్ని హతమార్చాడు. ఈ ఘటన 2011లో మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని ఇగత్‌పురిలో జరిగింది. ఈ ఘటనలో లైలా ఖాన్‌తో పాటు ఆమె తల్లి షెలీనా, తోబుట్టువులైన అజ్మీనా, జారా, ఇమ్రాన్, కజిన్ రేష్మాను అతను కాల్చిచంపాడు. వారి మృతదేహాలను వారి బంగ్లాలోనే పాతిపెట్టి పరారయ్యాడు.అయితే ఈ ఘటన జరిగిన దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఈ దారుణం బయటకొచ్చింది. ఆ తర్వాత కేసు నమోదు చేసుకున్న పోలీసులు పర్వేజ్ తక్‌ను జమ్మూకశ్మీర్‌లో అరెస్ట్ చేశారు. కాగా.. పర్వేజ్ తక్ లైలా తల్లి షెలీనాకి మూడవ భర్తగా పోలీసులు నిర్ధారించారు. ఆస్తి వివాదం కారణంగానే ఆరుగురిని అత్యంత కిరాతకంగా కాల్చి చంపినట్లు విచారణలో వెల్లడైంది.అసలు లైలా ఖాన్ ఎవరు?బాలీవుడ్ నటి లైలా ఖాన్ 2008లో విడుదలైన వాఫా: ఎ డెడ్లీ లవ్ స్టోరీలో నటించింది. ఈ చిత్రానికి రాకేశ్ సావంత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాజేష్ ఖన్నా సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత 2008లో కూల్ నహీ హాట్ హై హమ్ చిత్రంలో కనిపించింది. కాగా.. అంతకుముందే లైలా ఖాన్ 2002లో కన్నడ చిత్రం మేకప్‌తో సినిమాల్లోకి అడుగుపెట్టింది. -
నటి దారుణ హత్య.. 13 ఏళ్ల తర్వాత దోషిని తేల్చిన కోర్టు
దాదాపు 13 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన ప్రముఖ నటి కేసులో సంచలన నిజాలు బయటపడ్డాయి. ఆమెని దారుణంగా హత్య చేసింది ఎవరో తెలిసిపోయింది. ఈ క్రమంలోనే విచారణ పూర్తవగా.. తాజాగా కోర్టు తీర్పు ఇచ్చింది. సవతి తండ్రి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసి అందరూ షాకవుతున్నారు. ఇంతకీ అసలేం జరిగింది?1978లో ముంబయిలో పుట్టి పెరిగిన రేష్మా పటేల్.. సినిమాల్లోకి వచ్చేటప్పుడు లైలా ఖాన్ అని తన పేరు మార్చుకుంది. 2002లో కన్నడ మూవీతో హీరోయిన్ అయ్యింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ రాజేశ్ ఖన్నాతో చేసిన 'వాఫా'.. ఈమెకు ఓ మాదిరి గుర్తింపు తీసుకొచ్చింది. 2011లో 'జిన్నాత్' అనే సినిమా చేస్తుండగా.. విరామం రావడంతో కుటుంబంతో కలిసి ట్రిప్‌కి వెళ్లింది. ఆ తర్వాత కనిపించకుండా పోయింది.(ఇదీ చదవండి: రొమాంటిక్ సీన్స్.. నాకు ఒళ్లంతా దద్దుర్లు వచ్చేశాయి: టాలీవుడ్ హీరోయిన్)దీంతో లైలా తండ్రి నాదిర్ పటేల్.. తన కుటుంబ సభ్యులు కనిపించట్లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ మొదలుపెట్టారు. నటి మొబైల్ సిగ్నల్ చివరగా నాసిక్‌లో ఉన్నట్లు గుర్తించారు. లైలాకు అక్కడ ఫామ్ హౌస్ ఉందని తెలిసి పోలీసులు వెళ్లగా.. అది కాస్త కొంతవరకు అగ్ని ప్రమాదానికి గురై ఉంది. కొన్నాళ్ల తర్వాత జమ్ము కశ్మీర్లో వీళ్ల వాహనం దొరకడంతో కేసు క్లిష్టంగా మారింది. అయితే లైలాతో పాటు ఆమె కుటుంబ సభ్యుల ఆచూకీ మాత్రం దొరకలేదు.లైలా సవతి తండ్రి పర్వేజ్ తక్‌పై ఎందుకో పోలీసులకు అనుమానమొచ్చింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తి విషయంలో గొడవ జరిగిందని.. దీంతో భార్య షెలీనాను చంపి ఆ తర్వాత లైలా-ఆమె అక్క అమీనా, కవలలు జారా-ఇమ్రాన్, కజిల్ రేష్మాని హత్య చేసినట్లు ఒప్పుకొన్నాడు. ఆ తర్వాత బంగ్లా నుంచి కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాలని వెలికి తీశారు. మొత్తంగా 40 మందిని విచారించారు. ఈ క్రమంలోనే తాజాగా ముంబై సెషన్స్ కోర్టు.. పర్వేజ్ని ఈ కేసులో దోషిగా తేల్చింది. మే 14న శిక్ష ఖరారు చేయనుంది.(ఇదీ చదవండి: 20 ఏళ్లకే పెళ్లి.. 'బిగ్‌బాస్' స్టార్ షాకింగ్ నిర్ణయం) -
లైలాఖాన్ అస్తిపంజరాలను తిరస్కరించిన తండ్రి
ముంబై: నటి లైలాఖాన్, ఆమె ఐదుగురు సభ్యుల హత్య కేసు వివాదం మరో మలుపు తిరిగింది. వీరంతా మూడేళ్ల క్రితం హత్యకు గురయ్యారు. పోలీసులు ఇటీవల వారి అస్తిపంజరాలను అప్పగించగా లైలా తండ్రి నాదిర్ పటేల్ తిరస్కరించారు. పోలీసులు దర్యాప్తును పక్కదోవ పట్టించారని, హంతకులు ఇప్పటికీ స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపించారు. ఈ విషయాలను కోర్టుకు కూడా తెలియజేశానని పటేల్ విలేకరులకు తెలిపారు. లైలా మారుతండ్రి పర్వేజ్ తక్ ఈ ఆరు హత్యలకు కారకుడని పేర్కొంటూ ముంబై క్రైంబ్రాంచ్ పోలీసులు అతణ్ని అరెస్టు చేశారు. కిష్టవార్‌కు చెందిన తక్ లైలాతోపాటు ఆమె తల్లి షెలీనా, పెద్దక్క అజ్మీనా, సోదరి జారా, సోదరుడు ఇమ్రాన్, సమీప బంధువు రేష్మాను హత్యమార్చడని పేర్కొంటూ గత అక్టోబర్‌లో చార్జిషీటు సమర్పించారు. షెలీనా తన రెండో భర్త అసిఫ్‌తో సంబంధాలు కొనసాగించడం సహించలేకే కుటుంబ సభ్యులందరినీ హతమార్చానని టక్ అంగీకరించాడు. షెలీనాకు టక్ మూడోభర్తని పోలీసులు తెలిపారు. అయితే పటేల్ మాత్రం ఆసిఫ్‌పై అనుమానం వ్యక్తం చేశారు.