lakshman kumar
-
అడ్లూరి, జీవన్‌రెడ్డి తులాభారం!
జగిత్యాల: మండలంలోని మల్లన్నపేట మల్లికార్జున స్వామిని ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి దర్శించుకున్నారు. అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మల్లన్నకు పూజలు చేసిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎత్తు బంగారం ఇచ్చారు. గ్రంథాలయ మాజీ చైర్మన్ కటారి చంద్రశేఖర్ రావు, సర్పంచ్‌లు సిద్దంకి నర్సయ్య, నిశాంత్ రెడ్డి, చిర్ర గంగాధర్, రాజ్యలక్ష్మి తిరుపతి రెడ్డి, వెంకటపద్మ, మాజీ సర్పంచ్ బీమ సంతోష్, నేరెల్ల మహేశ్, బుచ్చిరెడ్డి, గంగాధర్, ఉమేశ్ పాల్గొన్నారు. -
కావాలనే స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి మిస్ చేశారు..
-
సీసా పెంకులతో పొడుచుకుని నడిరోడ్డుపై వ్యక్తి వీరంగం
భీమవరం క్రైం:భీమవరం మండలం కొవ్వాడపుంత ప్రాం తంలో ఓ వ్యక్తి బుధవారం సీసా పెంకులతో పొట్ట, గుండెలపై పొడుచుకుని అరుస్తూ హడావుడి చేశాడు. భయబ్రాంతులకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు అతన్ని భీమవరం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. రూరల్ ఏఎస్సై ఎం.లక్ష్మణకుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నరసాపురం సమీపంలోని పీచుపాలెం గ్రామానికి చెందిన మోటూరి గంగాధర్ (30) వడ్రంగి పని చేస్తుంటాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంపాటు హైదరాబాద్ ఉన్న అతడు ఇటీవల తన అత్తగారి ఊరైన శివదేవుని చిక్కాల వచ్చి నివాసం ఉంటున్నాడు. గంగాధర్‌తో ఘర్షణ తలెత్తడంతో అతని భార్య పిల్లలను తీసుకుని గణపవరంలో ఉంటున్న సోదరుడి వద్దకు వెళ్లిపోయింది. దీంతో గంగాధర్ మంగళవారం గణపవరం వెళ్లి వారితో గొడవపడ్డాడు. బుధవారం ఉదయం భీమవరం మండలం కొవ్వాడ పుంత సమీపంలోని ఆంజనేయస్వామి గుడి వద్ద సీసా పెంకులతో పొడుచుకొని, అక్కడి వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. రోడ్డుపై వచ్చీపోయే వాహనాలకు అడ్డంగా నడుస్తూ హడావుడి చేశాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు అక్కడకు చేరుకున్న టూటౌన్ పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించగా, డాక్టర్ రామాంజనేయులు చికిత్స అందించారు. సీసా పెంకులు పొట్ట లోపలకు వెళ్లిపోవడంతో పేగులు బయటకు వచ్చాయి. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. ఇంతలోనే అతను ప్రాణాలు విడిచాడు. గంగాధర్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఏఎస్సై లక్ష్మణకుమార్ తెలిపారు. గురువారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తారని చెప్పారు. శాడిస్ట్‌లా వ్యవహరించేవాడు గంగాధర్ గతంలో కూడా శాడిస్ట్‌లా వ్యవహరించేవాడని అతని భార్య తెలిపింది. మద్యానికి బానిసై భయబ్రాంతులకు గురిచేసేవాడని, తన పిల్లలను సిగరెట్లతో కాల్చడం, తన చేతులపై బ్లేడుతో కోసుకోవడం చేసేవాడని వివరించింది. కొవ్వాడపుంతలో బంధువులు ఎవరూ లేరని, తన భర్త అక్కడకు వచ్చి సీసా పెంకులతో ఎందుకు పొడుచుకున్నాడో అర్థం కావడం లేదని తెలిపింది. -
వికటించిన మధ్యాహ్న భోజనం!
వాంతులు చేసుకున్న విద్యార్థులు కంపు కొట్టిన సాంబారు అన్నం బయట పారబోత చోడవరం రూరల్, న్యూస్‌లైన్: గోవాడ జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించింది. ఆదివారం మధ్యాహ్న భోజనం చేసిన కొందరు విద్యార్థులకు వాంతులకు గురయ్యారు. మరికొందరు అన్నం బయట పారబోశారు. ఇది తెలిసి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. సాంబారు బాగోలేక వాంతులు అయ్యాయని, అందుకే భోజనాలను పారబోశామని విద్యార్థులు తెలిపారు. ఈ ఉన్నత పాఠశాలలో సుమారు 700 మంది విద్యార్థులు ఉన్నారు. రోజూ మాదిరి ఆదివారం మధ్యాహ్నభోజనం తిన్న కొందరు విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. మళ్ల సాయి, ఎస్. శ్యామల, తదితరులు కొద్ది సేపు అస్వస్థతతో ఇబ్బంది పడ్డారు. కొందరు భోజనం మానేశారు. మరి కొందరు పళ్లాల్లోని అన్నాన్ని బయట పారబోశారు. ఇది తెలిసిన గ్రామస్తులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాఠశాలకు చేరుకున్నారు. వెంటనే మండల విద్యాశాఖాధికారి(ఎంఈఓ)కి ఫిర్యాదు చేశారు. ఆయన ఎకాయెకిన పాఠశాలకు చేరుకుని వంటలను పరిశీలించారు. వంట షెడ్డు లేకపోవడంతో ఆరుబయట వంటలు చేస్తున్నారు. దీనికి తోడు సమీపంలోనే విద్యార్థుల మరుగుదొడ్లు ఉన్నాయి. వాటిని శుభ్రపరిచిన దాఖలాలు కనిపించడం లేదు. కాగా సాంబారులో వినియోగించిన టమాటా, ఇతర కూరల వల్ల రుచి పాడయిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం మిగిలిన పప్పును సాంబారులో ఆదివారం వినియోగించారని కొందరు విద్యార్థులు ఆరోపించారు. మధ్యాహ్న భోజనం నిర్వాహకులతోపాటు ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని గ్రామస్తులు ఆరోపించారు. తాము పాత్రలను శుభ్రం చేసి వండుతున్నామని, పైన చెట్ల నుంచి ఏదైనా పడి ఉండవచ్చని నిర్వాహకులు అంటున్నారు. మాజీ సర్పంచ్ ఏడువాక లక్ష్మణకుమార్, ఏడువాక సింహాచలం ఆధ్వర్యంలో పలువురు తల్లిదండ్రులు, యువకులు ఈ విషయమై హెచ్ఎం, ఎంఈవోలను నిలదీశారు. సెలవులో ఉన్నందున తాను ఈ రోజు వంటలను పరిశీలించలేదని హెచ్ఎం రవీంద్రబాబు తెలిపారు. మళ్లీ వండి మధ్యాహ్నం మూడు గంటలకు విద్యార్థులకు భోజనం పెట్టారు. -
వివేక్‌వి అర్థంలేని విమర్శలు
సాక్షి, కరీంనగర్: మంత్రి శ్రీధరబాబుపై ఎంపీ వివేక్ చేస్తున్న విమర్శలు అర్థరహితమని, ఆయన మతితప్పి మాట్లాడుతున్నారని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అడ్ల్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. శ్రీధర్‌బాబు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పటినుంచీ తె లంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారని, పార్టీ శ్రేణులకు ఉద్యమం లో దిశానిర్ధేశం చేశారని గుర్తు చేశారు. వం టావార్పు లాంటి జేఏసీ కార్యక్రమాల్లో కాం గ్రెస్ కార్యకర్తలు పాల్గొనేలా శ్రీధర్‌బాబు చొరవ చూపారని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ తుదిదశకు చేరిన సమయంలోనూ కాంగ్రెస్ అధిష్టానానికి 50 ఏళ్లుగా తెలంగాణకు జరిగిన అన్యాయాలను వివరించారన్నారు. కీలక సమయాల్లో మంత్రి అధిష్టానం పెద్దలను కలిసి తెలంగాణ ఆకాంక్షలను బలంగా వినిపించారని, పలు సందర్భాల్లో ఆయన వినిపించిన వాదనలు ఢిల్లీ నేతలపై ప్రభావం చూపాయని అన్నారు. కాంగ్రెస్‌లో అనేక పదవులు పొంది, సీఎం పదవిపై కాంక్షతోనే టీఆర్ఎస్లోకి వెళ్లిన వివేక్‌కు మంత్రి శ్రీధర్‌బాబుపై విమర్శలు చేసే నైతిక అర్హత లేదన్నారు. ఇకనైనా వివేక్ పద్ధతి మార్చుకోవాలని, ఇలాగే విమర్శలు చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు సహించరని హెచ్చరించారు.