పెద్దదర్గాలో ఘనంగా ఉరుసు ఉత్సవం
కడప కల్చరల్ : అస్థానె మగ్దూమ్ ఇల్లాహిలోని హజరత్ ఖ్వాజా సయ్యద్‌షా అమీనుల్లా హుసేనీ చిష్ఠివుల్ ఖాద్రీ సాహెబ్ ఉరుసు ఉత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ గురువుల మజార్ వద్ద ప్రత్యేకంగా ఫాతెహా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు పీఠాధిపతి దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందారు. దర్గా ప్రాంగణంలోని దుకాణాల వద్ద మహిళలు కిటకిటలాడారు. ఉదయం నుంచి రాత్రి వరకు దర్గా ఆధ్వర్యంలోని లంగర్‌ఖానాలో వేలాది మంది భక్తులకు భోజన సౌకర్యం కల్పించారు.