'మీకు పిల్లల కన్నా పశువులే ముఖ్యమా?'
ముంబయి: సొంత ప్రభుత్వంపై మహారాష్ట్ర బీజేపీ శాసన సభ్యుడు తీవ్ర ఆరోపణలు చేశాడు. తమ పిల్లలకంటే పశువులకే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారంటూ మండిపడ్డాడు. పిల్లల అనాథశ్రమాలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే శిశుసంరక్షణ కేంద్రాలకంటే పశువుల సంరక్షణకే ప్రాధాన్యాన్ని ఇస్తూ వాటికే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు.
'మా రాష్ట్ర ప్రభుత్వం పశువుల ధాణాకోసం రోజుకు ఒక్కదానికి రూ.70 ఖర్చుచేస్తోంది. పిల్లలకు రోజుకు రూ.30 మాత్రమే ఇస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి చిన్నారులకన్నా పశుసంరక్షణే ముఖ్యం' అని అనిల్ బోండే అనే మోర్షి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఆరోపించారు. వెంటనే చిన్నారులకోసం నిధులు పెంచాలని డిమాండ్ చేశారు.