భారత సంతతి చిన్నారికి అత్యంత అరుదైన కిడ్నీ మార్పిడి..!
సాధారణంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారికి కిడ్నీ ఇచ్చే దాత దొరకడం అరుదు. ఒకవేళ దొరికినా ఆపరేషన్ చేశాక జీవితాంత మందులు వాడుతుండాల్సిందే. ఎందుకంటే దాత ఇచ్చిన అవయవాన్ని అతడి శరీరం అంగీకరించదు తత్ఫలితంగా లేనిపోని సమస్యలు ఉత్ఫన్నమవుతుంటాయి వాటిని తట్టుకునేలా నిత్యం రోగ నిరోధక శక్తి కోసం మందులు వాడక తప్పదు. అయితే ఇలాంటి సమస్యలన్నింటికి చెక్‌పెట్టేలా యూకేలోని ఓ ఆస్పత్రి భారత సంతతి చిన్నారికి సరికొత్త కిడ్నీ మార్పిడి చికిత్స చేసింది. విజయవంతమవ్వడమే కాదు ఇప్పుడూ ఆ చిన్నారి చాలా చలాకీగా అందరిలా అన్ని పనులు చేస్తోంది.
అసలేం జరిగిందంటే..భారత సంతతికి చెందిన 8 ఏళ్ల చిన్నారి అదితి శంకర్ అరుదైన జన్నుపరమైన పరిస్థితి కారణంగా కోలుకోలేని మూత్రపిండ వైఫల్యంతో పోరాడుతుంది. గత మూడేళ్లుగా డయాలసిస్‌పైనే జీవనం సాగిస్తోంది. ఆమెకు కిడ్నీ మార్పిడి చేయాల్సి ఉంది. ఈనేపథ్యంలో లండన్‌లోని గ్రేట్ ఓర్మాండ్ స్ట్రీట్ ఆస్పత్రి(ఘోష్) ఒక సరికొత్త కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్‌కి తెరతీసింది. ఇది ఎంతోమంది కిడ్నీ వ్యాధిగ్రస్తుల పాలిట వరంలా మారింది.
చిన్నారి అదితికి కిడ్నీ మార్పిడి చేయడానికి దాతగా ఆమె తల్లే కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఐతే ఈ మార్పిడి చికిత్సకు ముందే అదితికి ఆమె తల్లి ఎముక మజ్జ సాయంతో అధితికి స్టెమ్‌సెల్ మార్పిడి చేశారు. అధితి శరీరం తిరస్కరించకుండా ఉండేలా దాత రోగ నిరోధక వ్యవస్థలా రీప్రోగామ్ చేశారు. దీంతో ఆమెకు మార్పిడి చికిత్స చేసిన తర్వాత కొత్త కిడ్నీ శరీరంపై దాడి చేయదు. ఆమె శక్తి స్థాయిలో మార్పులను వైద్యులు గమనించారు.
ఆమె జీవితాంత రోగనిరోధక స్థాయిలకు సంబంధించే మందులతో పనిలేకుండా హాయిగా కొత్త కిడ్నీతో జీవించేలా చేశారు. ఎలాంటి దుష్ఫరిణామాలు ఉండకుండా ఆమె భవిష్యత్తు మొత్తం హాయిగా సాగిపోతుందని నమ్మకంగా చెప్పారు. ఇప్పుడామె స్విమ్మింగ్ వంటివి హుషారుగా నేర్చుకుంటోంది కూడా. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ తప్ప వేరే ప్రత్యామ్నాయ మార్గం లేని రోగులకు ఈ విధానం ఉపయోగపడుతుందని వైద్యులు తెలిపారు. ఈ చికిత్స విధానం వల్ల కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చయించుకున్న రోగులు ఎలాంటి సమస్యలు ఎదుర్కోరు. పైగా జీవితాంత మందులు వాడాల్సిన బాధ తప్పుతుంది.
“Aditi's always dancing and singing. We’re so happy that she can be the amazing version of herself that she is, thanks to her dual transplant.” Uday, Aditi’s dad.
✨ 8-year-old Aditi is the first child in the UK to receive an improved kidney transplant.https://t.co/xnskoDQ9vA pic.twitter.com/53WMhd3ncv
— Great Ormond Street Hospital (@GreatOrmondSt) September 22, 2023
(చదవండి: ఆత్మహత్య ధోరణి జన్యుపరంగా సంక్రమిస్తుందా? అలానే విజయ్ ఆంటోని కూతురు..)