విలన్‌గా కమల్..!
కమల్‌హాసన్ ఏం చేసినా సంచలనమే. ఇప్పుడాయన మరో సంచలనానికి సిద్ధమవుతున్నారు. దర్శకుడు లింగుస్వామి నిర్మిస్తున్న ఓ చిత్రంలో కమల్ విలన్‌గా నటించబోతున్నారు. ఈ చిత్రానికి రమేష్ అరవింద్ దర్శకత్వం వహించనున్నారు. కమల్‌హాసన్ నటించిన ‘విశ్వరూపం-2’ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత లింగుస్వామి నిర్మిస్తున్న చిత్రంలో కమల్‌హాసన్ నటించనున్నారు.
ఇందులో విలన్ పాత్రలో ఆయన కనిపించనున్నారు. రమేష్ అరవింద్, కమల్‌హాసన్‌కు ప్రాణస్నేహితుడు. ఈ నేపథ్యంలో కమల్‌హాసన్ కోరిక మేరకు ఆయన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది వరకే సతీ లీలావతి, పంచతంత్రం చిత్రాల్లో కమల్‌హాసన్, రమేష్ అరవింద్ కలిసి నటించారు. కమల్ చిత్రానికి దర్శకత్వం వహించడం గురించి రమేష్ అరవింద్ మాట్లాడుతూ కమల్‌హాసన్ నటించే చిత్రానికి దర్శకత్వం వహించడం ఓ వైపు సంతోషాన్ని, మరో వైపు భయాన్ని కలిగిస్తోందన్నారు.
ఇది వరకే ఆయనతో కన్నడంలో ‘సతీ లీలావతి’ చిత్రాన్ని రీమేక్ చేసి దర్శకత్వం వహించానన్నారు. తాజాగా కమల్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నానని వివరించారు. ఈ చిత్రం మెగా బడ్జెట్‌తో నిర్మించనున్నామని చెప్పారు. దానికి ‘ఉత్తమ విలన్’ అనే పేరును సూచించామని, త్వరలో షూటింగ్ ప్రారంభం కానుందన్నారు. ఇందులో కామెడీతో పాటు యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయన్నారు.