విలన్‌గా కమల్..! | Kamal Hasan to cast as villain!! | Sakshi
Sakshi News home page

విలన్‌గా కమల్..!

Published Wed, Oct 9 2013 12:42 AM | Last Updated on Fri, Sep 1 2017 11:27 PM

విలన్‌గా కమల్..!

విలన్‌గా కమల్..!

కమల్‌హాసన్ ఏం చేసినా సంచలనమే. ఇప్పుడాయన మరో సంచలనానికి సిద్ధమవుతున్నారు. దర్శకుడు లింగుస్వామి నిర్మిస్తున్న ఓ చిత్రంలో కమల్ విలన్‌గా నటించబోతున్నారు. ఈ చిత్రానికి రమేష్ అరవింద్ దర్శకత్వం వహించనున్నారు. కమల్‌హాసన్ నటించిన ‘విశ్వరూపం-2’ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత లింగుస్వామి నిర్మిస్తున్న చిత్రంలో కమల్‌హాసన్ నటించనున్నారు. 
 
 ఇందులో విలన్ పాత్రలో ఆయన కనిపించనున్నారు. రమేష్ అరవింద్, కమల్‌హాసన్‌కు ప్రాణస్నేహితుడు. ఈ నేపథ్యంలో కమల్‌హాసన్ కోరిక మేరకు ఆయన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది వరకే సతీ లీలావతి, పంచతంత్రం చిత్రాల్లో కమల్‌హాసన్, రమేష్ అరవింద్ కలిసి నటించారు. కమల్ చిత్రానికి దర్శకత్వం వహించడం గురించి రమేష్ అరవింద్ మాట్లాడుతూ కమల్‌హాసన్ నటించే చిత్రానికి దర్శకత్వం వహించడం ఓ వైపు సంతోషాన్ని, మరో వైపు భయాన్ని కలిగిస్తోందన్నారు. 
 
 ఇది వరకే ఆయనతో కన్నడంలో ‘సతీ లీలావతి’ చిత్రాన్ని రీమేక్ చేసి దర్శకత్వం వహించానన్నారు. తాజాగా కమల్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నానని వివరించారు. ఈ చిత్రం మెగా బడ్జెట్‌తో నిర్మించనున్నామని చెప్పారు. దానికి ‘ఉత్తమ విలన్’ అనే పేరును సూచించామని, త్వరలో షూటింగ్ ప్రారంభం కానుందన్నారు. ఇందులో కామెడీతో పాటు యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయన్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement