live stock officers
-
యుద్ధం ఆగకపోతే.. ఆ దేశాల్లో తిండికి కూడా కటకటే!
ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన దాడి రోజుల తరబడి కొనసాగుతుండటంతో ఇప్పుడా యుద్ధ ప్రభావం యూరప్ దేశాలపైకి పాకుతోంది. ఇప్పటి వరకు యుద్ధం కారణంగా ఉక్రెయిన్, ఆ తర్వాత రష్యాలు ఎక్కువ ఇబ్బందులు పడగా ఇప్పుడు దక్షిణ యూరప్‌కి కష్టాలు మొదలయ్యాయి. పాశ్చాత్య దేశాల్లో మాంసాహారానికి డిమాండ్ ఎక్కువ. అక్కడి ప్రజల ఆహార అలవాట్లలో చికెన్, మటన్, బీఫ్, పోర్క్‌లు చాలా కామన్. ఈ డిమాండ్‌కి తగ్గట్టుగా యూరప్‌లో స్పెయిన్ , ఇటలీ, సెర్బియా, హంగరీ, మాల్డోవా దేశాల్లో భారీ ఎత్తున కోల్లు, మేకలు, ఆవులు, ఎద్దులు, పందులు, గొర్రెల పెంపకం జరుగుతూ ఉంటుంది. లైవ్స్టాక్ని ఇక్కడ ఇండస్ట్రియల్ స్కేల్లో నిర్వహిస్తుంటారు. లైవ్‌స్టాక్‌కి ఆహారంగా అందించే దినుసుల్లో మొక్కజొన్న గింజలు ప్రధానం, యూరప్ దేశాల్లోని లైవ్‌స్టాక్‌కి సరఫరా అయ్యే కార్న్‌లో సింహభాగం ఉక్రెయిన్ నుంచే సరఫరా అవుతుంది. ప్రస్తుతం యుద్ధం కారణంగా దాదాపు నెలరోజులుగా ఉక్రెయిన్ ఓడరేవుల నుంచి షిప్‌లు కదలడం లేదు. మరోవైపు స్పెయిన్, ఇటలీ వంటి దేశాల్లో లైవ్‌స్టాక్‌కి సరిపడ తిండిగింజలు తగిరిపోతున్నాయి. సుమారు 45 రోజలుకు సరిపడా తిండిగింజలు స్టాక్‌గా పెట్టుకోవడం పరిపాటి. యుద్ధం మొదలై ఇప్పటికే 20 రోజులు దాటి పోయాయి. మళ్లీ స్టాక్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో లైవ్‌స్టాక్‌ను మెయింటైన్ చేయలేక.. ఫార్మ్స్ యజమానులు వాటిని ఉన్న పళంగా కబేళాలకు తరలిస్తున్నారు. యూరప్‌లో అత్యధికంగా లైవ్‌స్టాక్ నిర్వహిస్తున్న దేశాల్లో స్పెయిన్‌ది ప్రథమ స్థానం. అక్కడ ఏకంగా 59 మిలియన్ల లైవ్‌స్టాక్ ఉంది. ఆ తర్వాత ఇటలీలో 22.50 మిలియన్ల లైవ్ స్టాక్ ఉంది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు స్పెయిన్ తాత్కాలికంగా బ్రెజిల్, అర్జెంటీనాల నుంచి కార్న్ దిగుమతి చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇటలీ, సెర్బియా, హంగరీ వంటి దేశాలు లైవ్‌స్టాక్‌కి అవసరమైన కార్న్, ఇతర ఉత్పత్తుల కోసం దిక్కులు చూస్తున్నాయి. మరో వారం పది రోజుల్లో యుద్ధం విషయంలో క్లారిటీ రాకపోతే పశువులను పెంచలేని పరిస్థితి నెలకొంటుందని.. అదే పరిస్థితి కనుకు వస్తే ఆఖరికి డెయిరీ పరిశ్రమలో ఉన్న పశువులను సైతం కబేళాలకు తరలించాల్సిన వస్తుందంటున్నారు అక్కడి లైవ్‌స్టాక్ ఫార్మ్ నిర్వాహకులు. డెయిరీ నుంచి పశువులు వధకు గురైతే.. తిరిగి సాధారణ పరిస్థితి వచ్చేందుకు ఆరేడేళ్లు పడుతుందని..అప్పటి వరకు సగం యూరప్ దేశాలకు పాల కొరత తప్పదంటున్నారు. ఇదే పరిస్థితి మాంసం ఉత్పత్తుల విషయంలోనూ చోటు చేసుకుంటుందని హెచ్చరిస్తున్నారు. -
ఇ గోపాలా.. డెయిరీలకు తోడు నీడ
పాల ఉత్పత్తిలో నిరంతరం శ్రమిస్తున్న వారికి అండగా ఉండేందుకు నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్డీడీసీ) ఇ గోపాలా వెబ్‌పోర్టల్‌ని అందుబాటులోకి తెచ్చింది. శ్రీకృష్ణ జన్మాష్టమికి రెండు రోజుల ముందు ఈ వెబ్‌పోర్టల్‌ని కేంద్ర మంత్రి రూపాల ప్రారంభించారు. ప్రధాని మోదీ నిర్ధేశించిన డిజిటల్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా ఈ వెబ్‌పోర్టల్‌ని రూపొందించినట్టు తెలిపారు. డెయిరీలకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మార్కెటింగ్ విధానాలు, నూతన యాజమాన్య పద్దతులు ఎప్పటికప్పుడు డెయిరీ రంగంలో ఉన్నవారికి తెలియ జేసేందుకు ఇ గోపాలా పేరుతో ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ని కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఇ గోపాల అప్లికేషన్ ద్వారా డెయిరీకి సంబంధించి సమాచారంతో పాటు లైవ్ స్టాక్ కొనుగోలు అమ్మకాలు, బ్రీడింగ్ , రోగనిర్థారణ, నివారణ పద్దతులకు సంబంధించిన తాజా సమాచారం అందుబాటులో ఉంటుంది. చదవండి: PMJDY: పీఎంజేడీవై ఖాతాదారులకు రూ.10 వేల ఓవర్ డ్రాఫ్ట్ -
పొంచి ఉన్న పాలసంక్షోభం
పర్చూరు, న్యూస్‌లైన్: పాడి పరిశ్రమ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది. పశుపోషణ భారమై పాల ఉత్పత్తి ఏమాత్రం గిట్టుబాటు కాకపోవడంతో పాడి పశువులను అమ్ముకుంటున్నారు. వేసవితో పోలిస్తే పాల ఉత్పత్తి కొంత పుంజుకున్నా..గతేడాది ఇదే సమయానికి జిల్లాలో ఉత్పత్తి అవుతున్న పాలకు, ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న పాలకు మధ్య 20 శాతం వ్యత్యాసం కనిపిస్తోంది. దాణా ధరలు విపరీతంగా పెరగడం, పాల సేకరణ ధరలు ఖర్చులకు తగినట్లు పెంచకపోవడం ఇందుకు ప్రధాన కారణమని పశుపోషకులు పేర్కొంటున్నారు. జిల్లా డెయిరీతో పాటు ప్రైవేటు డెయిరీల్లో కలిపి ప్రస్తుతం సుమారు 3 లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్నట్లు అంచనా. పది శాతం వెన్న ఉన్న గేదె పాలను జిల్లా డెయిరీకి అనుబంధంగా నడిపే పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల ద్వారా లీటరు 44కు కొనుగోలు చేస్తున్నారు. ప్రైవేటు డెయిరీలైతే * 46 చెల్లిస్తున్నాయి. పశువైద్యం గగనం... ప్రభుత్వ పశువైద్యశాలల్లో సీజనల్ వ్యాధులకు సకాలంలో వైద్యం అందడం గగనమైంది. గ్రామాల్లో తెలిసీ తెలియని వైద్యం చేస్తున్న వ్యక్తుల కారణంగా పశువుల్లో మరణాల శాతం అధికమైంది. పశుసంవర్థక శాఖ అధికారులు మొక్కుబడిగా ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ మమ అనిపిస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో పర్యవేక్షణ కొరవడింది. ప్రభుత్వాస్పత్రుల్లో లైవ్‌స్టాక్ ఆఫీసర్లు, అసిస్టెంట్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్క ఒంగోలు డివిజన్లో లైవ్‌స్టాక్ ఆఫీసర్లు మూడు పోస్టులు, లైవ్‌స్టాక్ అసిస్టెంట్ పోస్టులు ఐదు ఖాళీగా ఉన్నాయి. దీనికితోడు పశువైద్యశాల భవనాలు చాలాచోట్ల శిథిలావస్థకు చేరాయి. నియోజకవర్గ కేంద్రమైన పర్చూరులో పశువుల ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరుకుంది. రైతులు సమకూర్చిన భవనంలో తాత్కాలికంగా పశువైద్యశాల నిర్వహిస్తున్నారు. వీరన్నపాలెంలో పశువైద్యశాలకు నిధులు మంజూరైనా నిర్మాణం నత్తనడకన సాగుతోంది. జిల్లాలో చాలాచోట్ల పరిస్థితి ఇలానే ఉంది. రైతులకు దక్కేది తక్కువే... పశువైద్యం పరిస్థితి ఇలా ఉంటే రైతుల వద్ద తక్కువ ధరకు పాలను సేకరిస్తూ ఎక్కువ ధరకు విక్రయించేందుకు డెయిరీలు మొగ్గుచూపుతున్నాయి. రైతుల వద్ద వెన్నశాతం ఆధారంగా పాలు కొనుగోలు చేసే పాలసేకరణ కేంద్రాలు వినియోగదారులకు మాత్రం నిర్దేశించిన ధరకు విక్రయిస్తుంటారు. ఉదాహరణకు పది శాతం ఉన్న పాలకు మాత్రమే లీటరుకు * 44 చొప్పున అందజేస్తారు. సాధారణంగా రైతులు కేంద్రాలకు తెచ్చే పాలల్లో సరాసరి వెన్న 7-8 శాతం వరకు మాత్రమే ఉంటుంది. వెన్న శాతం ప్రకారం రైతులకు ధర చెల్లిస్తారు. కేంద్రాల్లో పాలు కొనుగోలు చేసే వినియోగదారులకు మాత్రం వెన్నశాతంతో పనిలేకుండా లీటరు * 44 విక్రయిస్తారు. వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పాడి పరిశ్రమపై ప్రభుత్వ ప్రోత్సాహం అంతంతమాత్రంగానే ఉంది. పక్క రాష్ట్రాలైన కర్ణాటకలో పాడి రైతులకు లీటరు * 4, తమిళనాడులో లీటరుకు * 2 చొప్పున ప్రభుత్వాలు ప్రోత్సాహకాన్ని అందజేస్తున్నాయి. మన రాష్ట్రంలో ఈ తరహా విధానం లేకపోగా..వ్యవసాయం మాదిరిగా వడ్డీలేని రుణాలు ఇస్తున్న దాఖలాలు కూడా లేవు. గత నాలుగైదేళ్లలో పాడిపరిశ్రమ కోసం ప్రవేశపెట్టిన ఒక్క పథకం కూడా సక్రమంగా అమలుకు నోచుకోలేదు. జిల్లాను ముంచెత్తుతున్న కల్తీపాలు: ఇక్కడ కల్తీ అవుతున్న పాలు తక్కువగానే ఉన్నా..ఇతర జిల్లాల నుంచి వస్తున్న కల్తీపాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ పర్యవేక్షణ లేదు. తనిఖీలు నిర్వహించిన దాఖలాలూ లేవు. ఏవి అసలు..ఏవి నకిలీ అని నిర్ధారించే పరిస్థితి లేదు. దీనివల్ల ప్రజారోగ్యం దెబ్బతినడంతో పాటు పాడిపరిశ్రమ కుంటుపడుతోంది. ప్రస్తుతం డెయిరీఫామ్‌లు నష్టాల్లో నడుస్తుంటే..2, 3 గేదెల పోషణ కూడా రైతులకు భారమైంది. దీంతో పశువుల్ని అమ్ముకోవాల్సి వస్తోంది. గేదెల్ని కొనేవారు కూడా ముందుకు రావడం లేదు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే గతేడాది * 40 వేలు పలికిన పాడిగేదెలను ప్రస్తుతం * 30 వేలకు సైతం కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. వ్యవసాయ రంగానికి ప్రత్యామ్నాయంగా రైతులను ఆదుకుంటున్న పాడిపరిశ్రమ కనుమరుగయ్యే పరిస్థితుల నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.