భయాందోళనలు కలిగిస్తున్న వింత జంతువు
స్కాట్లాండ్: మునుపెన్నడూ కనిపించని ఓ వింత జంతువు స్కాట్లాండ్లోని ఓ గ్రామ ప్రజలలో భయాందోళనలు కలిగిస్తోంది. స్కాటిష్ ఫీల్డ్‌లలో ఈ జంతువు కనిపించడంతో జిమ్మీ రైట్(66) అనే వ్యక్తి దాన్ని కెమెరాలో బంధించాడు. అనంతరం సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది.
అది ఏంటో అర్ధంకాక సగటు నెటిజన్ తల పట్టుకుంటున్నాడు. కొందరు అది తాబేలు జాతికి చెందిందై ఉంటుందని పేర్కొనగా.. మరికొందరు అది మాంసాహారేమోనని భయాందోళనలు వ్యక్తం చేశారు. ఈ జంతువును రైట్.. స్కాట్లాండ్లో గల పశ్చిమ స్టిర్లింగ్‌షైర్‌లోని కెల్లెర్న్ గ్రామంలో చూశాడు.
తన కొడుకు పెంచుకుంటున్న కుక్కను బయటకు తీసుకెళ్లిన సమయంలో వింత జంతువు కౌ ఫీల్డ్‌లో దర్జాగా నడుచుకుంటూ వెళ్లడాన్ని ఫోటో తీశాడు. తొలుత ఆ జీవిని తాను షాక్‌కు గురయ్యానని రైట్ అన్నారు. డైనోసార్‌ను అది పోలి ఉండటంతో భయమేసిందని చెప్పారు. వెంటనే ఆ ప్రాంతం నుంచి ఇంటికి వచ్చేసినట్లు వెల్లడించారు.