lokeswaram
-
120 మందికి.. ఒకే టాయిలెట్
నిర్మల్: లోకేశ్వరం గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు కనీస వసతులు కరువయ్యాయి. స్థలం సరిపోక కొందరు వెనుదిరుగుతుంటే ఇక్కడ ఉండి చదువుకునే వారికి మూత్రశాలలు, మరుగుదొడ్డి లేక నరకం చూస్తున్నారు. ఉద్యోగ ప్రకటనలు వెలువడిన నుంచి ఇక్కడికి వచ్చే వారిసంఖ్య పెరిగింది. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు గ్రంథాలయం తెరిచే ఉంటోంది. రోజు 120 మందికి పైగా వస్తున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు రాత్రి వరకు ఇక్కడే ఉంటున్నారు. పెద్దసంఖ్యలో యువతులు, మహిళలు వస్తున్నారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఇంత మందికి కేవలం ఒకే మరుగుదొడ్డి ఉంది. సరిపోని గదులు వరుస నోటిఫికేషన్లతో వచ్చే వారి సంఖ్య రెట్టింపైంది. హాలు, చిన్న గదులు ఉన్నాయి. గ్రంథాలయ ఇరుకు గదులోనూ అభ్యర్థులు చదువుకుంటున్నారు. కొద్దిగా ఆలస్యమైన కుర్చీ దొరకని పరిస్థితి. వేసవి ప్రారంభం కావడంతో అందుబాటులో ఉన్న కూలర్లు ఏర్పాటు చేసేందుకు స్థలం లేదు. 2004లో రూ.3 లక్షల గ్రామ పంచాయతీ నిధులతో గ్రంథాలయాన్ని నిర్మించారు. వర్షం కురిస్తే గ్రంథాలయ భవనం ఊరుస్తోంది. ఇంత మందికి ఒకే మరుగుదొడ్డి ఉండడంతో ఆరుబయటకు వెళ్లి మూత్రవిసర్జన చేయాల్సి వస్తోంది. గ్రంథాలయం శిథిలావస్థకు చేరుకుందని, అధికారులు స్పందించి కొత్తది ఏర్పాటు చేయాలని పాఠకులు కోరుతున్నారు. సౌకర్యాలు కల్పించాలి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఇక్కడకు వస్తున్నాం. మూ త్రశాలలు, మరుగుదొ డ్డి లేక ఇబ్బంది పడుతున్నాం. గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు ఒకే చోటకు వెళ్లడం కష్టంగా ఉంది. అధికారులు స్పందించి కొత్త గ్రంథాలయ భవనం నిర్మించాలని కోరుతున్నాం. – రాజశేఖర్, లోకేశ్వరం పాఠకుడు నివేదించాం లోకేశ్వరం గ్రంథాలయం శిథిలావస్థకు చేరిన మాట వాస్తవమే. కొత్త గ్రంథాలయ భవన నిర్మాణం కోసం ఉన్నతాధికారులకు నివేదించాం. నిధులు మంజూరు కాగానే భవనం పనులు ప్రారంభించి పాఠకులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. – పృథ్వీరాజ్, గ్రంథాలయాధికారి, లోకేశ్వరం -
యూడీసీని నిలదీసిన అంగన్వాడీ కార్యకర్తలు
ముథోల్, న్యూస్‌లైన్ : స్థానిక ఐసీడీఎస్ కార్యాలయ ఆవరణలో యూడీసీ మహేశ్‌ను అంగన్వాడీ కార్యకర్తలు మంగళవారం నిలదీశారు. ప్రాజెక్టు పరిధిలోని కుభీర్, భైంసా, లోకేశ్వరం, తానూర్, ముథోల్ మండలాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు టీఏ, డీఏ బిల్లుల విషయమై ప్రశ్నించారు. ఏడాదిగా బిల్లులు రావడం లేదని, అంగన్వాడీ కేంద్రాల అద్దె చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. టీడీఏ, డీఏ, కట్టెల బిల్లులు ఇవ్వాలని కోరితే పర్సంటేజీ అడుగుతున్నాడని ఆరోపించారు. ఐసీడీఎస్ పరిధిలోని 300 మంది అంగన్వాడీ కార్యకర్తలు రూ.6వేల చొప్పున చెల్లిస్తే బిల్లులు చేస్తానని అంటున్నాడని పేర్కొన్నారు. నెలనెల కోడిగుడ్లు ఇవ్వడం లేదని తెలిపారు. -
అపార నష్టం
లోకేశ్వరం, న్యూస్‌లైన్ : మండలంలోని పుస్పూర్, హథ్గాం, సాథ్గాం, రాయపూర్‌కాండ్లీ, ధర్మోరా, పంచగుడి, పిప్రి, వాట్టోలి, గడ్‌చాంద, రాజూరా, మన్మద్, పోట్పల్లి తదితర గ్రామాల్లో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. పంట చేతికొచ్చే సమయంలో వర్షం కురియడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మొక్కజొన్న, జొన్న, మిర్చి, నువ్వు, పొద్దుతిరుగుడు, పసుపు పంటలకు నష్టం వాటిల్లింది. పుస్పూర్ గ్రామంలో స్వల్పంగా వడగండ్లు పడ్డాయి. పంటలకు నష్టం వాటిల్లినా అధికారులు గ్రామాలను సందర్శించడం లేదని రైతులు వాపోతున్నారు. నష్టం అంచనా వేసి పరిహారం అందేలా చూడాలని కోరుతున్నారు. ఖానాపూర్‌లో.. ఖానాపూర్ : మండలంలో గత రెండు రోజులుగా కురిసిన గాలీ వాన బీభత్సంతో పాటు రాళ్ల వర్షం కారణంగా రైతుల పంటలు తీవ్రంగా నష్టపోయారు. వరి, మొక్కజొన్నతో పాటు నువ్వు, కురగాయలు, మామిడి రైతులు సైతం తీవ్రంగా నష్టపోయారు. అతలాకుతలం.. కడెం : మండలంలో శుక్రవారం సాయంత్రం కురిసిన వడగళ్ల వర్షం, ఈదురుగాలులతో పంటలు చాలావరకు దెబ్బతిన్నాయి. పెద్దూరు, మద్దిపడగ, ధర్మాజీపేట, చిన్నబెల్లాల్ తదితర గ్రామాల్లో వరి, పెసర, నువ్వు, మిరప, మొక్కజొన్న, పసుపు, ఉల్లి, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. సుమారు 250 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ధర్మాజిపేట గ్రామానికి చెందిన రైతు మంతెన సత్యం సాగుచేసిన నువ్వు పంట వర్షం ధాటికి నాశనమైంది. కోళ్లఫారంలో 200 కోళ్లు మృత్యువాతపడ్డాయి. పెద్దూరులో దండికె గంగన్న, సంగ మల్లయ్య, చిట్టేటి ముత్తన్న, గజ్జి ఎర్రన్న, సంగ పోషన్న, తౌర్య, బలరాం నాయక్, రవినాయక్ తదితరుల పంటలు దెబ్బతిన్నాయి. దండికె గంగన్నకు చెందిన మిరప పంట పూర్తిగా నేలకొరిగింది. పెద్దూరు తండాలోని ఇస్లావత్ బలరాంనాయక్ పసుపును ఉడకబె ట్టి ఆరబెట్టాడు. అది వర్షానికి తడిసి ముద్దయింది. అంబారీపేట, పాండ్వాపూరు గ్రామాల్లో కొన్ని ఇళ్లు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. పంటల నష్టం వివరాలను వీఆర్వోలు శనివారం నుంచి సర్వే చేస్తున్నారు. నేలకొరిగిన పంటలు తానూరు : మండలంలో శుక్రవారం సాయంత్రం కురిసి న వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లింది. వడగండ్ల వాన ధాటి కి 1600 ఎకరాల్లో గోధుమ, జొన్న పంటలు నేలకొరిగా యి. ఎల్వీ, హిప్నెల్లి, హిప్నెల్లితండా, ఉమ్రి, మసల్గతం డా గ్రామాల్లో నేలకొరిగిన పంటలను చూసి రైతులు తీ వ్ర ఆవేదనకు గురయ్యారు. హిప్నెల్లి గ్రామంలో గాలి ధాటికి 24ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. ఇళ్లలోని బట్ట లు, ఆహార ధాన్యాలు తడిసిపోయాయి. శుక్రవారం రా త్రంతా పక్క ఇళ్లలో తలదాచుకున్నారు. వర్షంతో నిరాశ్రయులుగా మారినా ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడంతో శనివా రం గ్రామస్తులు బెల్తరోడ, తానూర్ ప్రధాన రోడ్డుపై బైఠాయించారు. తహశీల్దార్ అంజయ్య అక్కడికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వం తరఫున పరిహారం ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేశారు. గాలుల ప్రభావంతో విద్యుత్ తీగలు తెగిపోయి మండలంలో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హిప్నెల్లి గ్రామంలో బాధితులకు టీడీపీ నియోజకవర్గ నాయకులు, మాజీ ఎంపీపీ బాశెట్టి రాజన్న వచ్చి 3 క్వింటాళ్ల బియ్యాన్ని పంపిణీ చేశారు. -
‘కస్తూర్బా’తో తగ్గుతున్న డ్రాపౌట్స్
లోకేశ్వరం, న్యూస్‌లైన్ : కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంల ఏర్పాటుతో మండలంలో డ్రాపౌట్ విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. బడి మానేసిన వారి ని చేర్పించి విద్యతోపాటు వృత్తివిద్యపై శిక్షణ ఇస్తున్నారు. స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం 2009 జూన్‌లో ప్రారంభమైంది. ఆరంభంలో ఎనిమిది విద్యార్థులు చేరారు. అప్పటి నుంచి విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2011-12లో మండలంలో డ్రాపౌట్ విద్యార్థుల సంఖ్య ఉండగా.. 2012-13 నాటికి 20కి తగ్గింది. 6, 7, 8, 9, 10వ తరగతుల్లో ప్రస్తుతం 160 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యాలయాన్ని రూ.38.75లక్షలతో, అదనపు గదుల నిర్మాణాన్ని రూ.31.08లక్షలు, ఎఫ్ఎఫ్ నిధులు రూ.30లక్షలతో చేపట్టారు. విద్యార్థులకు కుట్టుశిక్షణ, అల్లికలు, ఎంబ్రయిడరీ, ఆటపాటలపై శిక్షణ ఇస్తున్నారు. పుస్తకాలు, నోట్‌పుస్తకాలు, మూడు జతల దుస్తులు, జామెట్రిక్ బాక్స్, బ్లాంకెట్, కార్పెట్, పళ్లెం, గ్లాసు, ప్రతి నెలా తరగతి ఆధారంగా రూ.55 నుంచి రూ.75వరకు కాస్మోటిక్ చార్జీలు అందజేస్తున్నారు. ఫలితాల్లో ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందిస్తున్నారు. బడిమానేసిన వారిని పాఠశాలలో చేర్పించి మెరుగైన విద్య అందిస్తున్నామని ఇన్చార్జి ప్రిన్సిపాల్ యాదగిరి తెలిపారు.