స్పాండిలైటిస్‌కు హోమియోపతితో సంపూర్ణ నివారణ
నేటి మానవ జీవన విధానానికి ఎక్కువ దూరం ప్రయాణించి ఉద్యోగాలు చేయడం, రోజులో 2-4 గంటలు సమయం ప్రయాణానానికి కేటాయించడం, ఆఫీసులో ఎక్కువ సమయం కంప్యూటర్ మీద పనిచేయడం వలన వెన్నెముకపై అధిక ఒత్తిడి వలన స్పాండిలైటిస్‌కు దారి తీయడం సహజం.
స్పాండిలైటిస్: వెన్నుపూసల మధ్య జరిగే ఇన్ఫ్లమేషన్ స్పాండిలైటిస్ అంటారు. స్పాండిలైటిస్, స్పాండిలోసిస్ మధ్య భిన్న వ్యత్యాసం ఉన్నది. స్పాండిలైటిస్ అనేది ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఇది ఎక్కువగా 20-40 ఏళ్ళ వయస్సు ఉన్న వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. స్పైనల్ జాయింట్ల మధ్య ఇన్ఫ్లమేషన్ వల్ల ఇది వస్తుంది.
స్పాండిలోసిస్ అంటే డీజనరేటివ్ ఆర్థరైటిస్. ఇది ఎక్కువగా 40 ఏళ్ళు పైబడిన వారిలో కనిపిస్తుంది. వెన్నెముకలో ఉండే మృదులాస్థి, దాని చుట్టూ ఉండే కణజాలం డీ జనరేటివ్ మార్పులకు గురి కావడం వలన ఇది వస్తుంది.
ఇందులో రెండు పూసల మధ్య ఉండే డిస్క్ అరుగుదల వలన అధిక ఒత్తిడికి గురి అయినప్పుడు డిస్క్ వాచటం, డిస్క్ బయటికి పొడుచుకొని రావడం వలన వెన్నెముకల మధ్యలో ఉండే నరాలపైన ఒత్తిడి పెరుగుతుంది.
స్పాండిలైటిస్ గాని, స్పాండిలోసిస్ గాని వెన్నెముకలో ఏ భాగంలోనైనా జరిగే అవకాశం ఉంటుంది. కాని ముఖ్యంగా మెడ దగ్గర (Lovical spondilitis) వెన్నెముక - లుంబార్ స్పాండిలైటిస్ అంటారు.
కారణాలు:
వెన్నెముకకు దెబ్బలు తగలటం
అధిక బరువును ఒక్కసారిగా ఎత్తడం
సరి అయిన డ్రైవింగ్ పద్ధ్దతులను పాటించకుండా ఎక్కువగా డ్రైవింగ్ చేయడం వలన వెన్నుపూసల మధ్య ఒత్తిడి అధికమై ఈ సమస్య వస్తుంది
వయస్సు పెరిగే కొద్ది వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ అరుగుదల వలన
కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వలన కూడా ఇది వస్తుంది. (ఆంకిలైజింగ్ స్పాండిలైటిస్)
క్షయవ్యాధి వెన్నెముకకు పాకడం వలన ఇది వస్తుంది. (Potts disease)
ప్రస్తుత పరిస్థితులలో ఎక్కువగా కంప్యూటర్‌మీద పనిచేయడం వలన చిన్న వయస్సువారు కూడా స్పాండిలైటిస్ బారిన పడుతున్నారు.
లుంబార్ స్పాండిలైటిస్ లక్షణాలు
నడుమునొప్పి, కాలి నొప్పి, నడుము నుంచి క్రింది కాలివేళ్ళ వరకు లాగడం, పిరుదుల్లో నొప్పి, మంటగా ఉండడం, తొడదగ్గర తిమ్మిరిగా ఉండడం.
కారణాలు: సియాటికా అనే నరం నడుము నుండి కాలివేళ్ళ వరకు ప్రయాణిస్తుంది. ఈ నరం L4-L5 ఒత్తిడికి గురి కావడం వలన ఈ నొప్పి వస్తూ ఉంటుంది. ఇది లుంబార్ స్పాండిలైటిస్‌లో సర్వసాధారణంగా కనిపించే లక్షణం.
కొన్ని సందర్భాలలో దీనివలన పేషెంట్ నడవడం కూడా చాలా కష్టం అవుతంది. కొంతకాలం పూర్తిగా బెడ్‌రెస్ట్ తీసుకునే పరిస్థితి వస్తుంది.
రకాలు
సర్వైకల్ స్పాండిలోసిస్
లుంబార్ స్పాండిలోసిస్
ఆంకిలైజింగ్ స్పాండిలోసిస్
పాట్స్ డిసీజ్
సర్వైకల్ స్పాండిలైటిస్ లక్షణాలు: వెన్నెముకలో వచ్చే ఒత్తిడిని బట్టి లక్షణాలు ఉంటాయి.
మెడ దగ్గర నొప్పి రావడం, వెనుక భాగంలో అరల కదలికలో నొప్పి ఎక్కువ కావడం, మెడ, ఛాతి, భుజాలు, ఛాతి మొత్తంలో నొప్పి వచ్చే అవకాశం ఉంది.
మంట, మొద్దు బారినట్లుగా ఉండడం, తిమ్మిరిగా ఉండటం జరుగుతుంది. ఈ తిమ్మిరి ఛాతీ నుంచి వీపు వరకు ఉంటుంది. కొన్నిసార్లు తల తిరగడం, వాంతులు కావడం, కళ్ళు మసకబారడం వంటి లక్షణాలు ఉంటాయి.
ఆంకిలైజింగ్ స్పాండిలైటిస్
ఇది జీవనక్రియల్లో జరిగే మార్పుల వలన వచ్చే ఆటో ఇమ్యూనో డిసీజ్. దీనిలో ముఖ్యంగా వెన్నెముక, దానిచుట్టూ కణజాలం మృదుత్వాన్ని కోల్పోయి వెన్నెముక కదలికలు అన్నీ ఆగిపోయి గట్టిగా కర్రలా తయారవుతుంది. దీనిని ‘బాంబూ’ అంటారు. జన్యుపరమైన కారణాల వలన ఇది ఎక్కువగా సంభవిస్తుంది. ఇది ఎక్కువగా వెన్నెముక, తుంటి ఎముకలు శాక్రో ఇలియాక్ జాయింట్స్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. అన్నీ మృదుత్వాన్ని కోల్పోయి గట్టిపడి పోతాయి. దానిమూలంగా వెన్నెముకలో సాధారణ కదలికలు నిలచిపోతాయి. ఇది ఎక్కువగా 15-40 ఏళ్ళు వయసు ఉన్న వారిలో కనిపిస్తుంది. దీనిని హెచ్ఎల్బీ-27 అనే పరీక్ష ద్వారా నిర్థారించవచ్చును.
లక్షణాలు:
వెన్నెముక గట్టిపడి కదలికలను తగ్గించడం
వెన్నునొప్పి
వెన్నెముక బయటకు పొడుచుకొని రావడం
జ్వరం
నీరసం, బరువు తగ్గడం.
నిర్థారణ పరీక్షలు :
ఎక్స్-రే స్పైన్
ఎమ్ఆర్ఐ ఆఫ్ స్పైన్
సీబీపీ,
ఈఎస్ఆర్
హెచ్‌సీబీ-27
హోమియో చికిత్స
హోమియో వైద్య విధానం ద్వారా కేవలం రోగ లక్షణాలైన నొప్పి, తిమ్మిరి, మంటలు తగ్గించడమే కాకుండా జబ్బు యొక్క మూలాలనుండి పూర్తిగా మరియు శాశ్వతంగా తగ్గించటం.
హోమియోకేర్‌లో గ్రూప్ ఆఫ్ డాక్టర్లు స్పాండిలైటిస్ మీద ప్రత్యేకమైన అధ్యయనం చేసి జెనెటిక్ కాన్సిట్యూషన్ సిమ్యూలిమ్ ట్రీట్మెంట్ విధానం ద్వారా దీనిని సంపూర్ణంగా నయం చేయవచ్చని నిర్థారించారు.
డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్
సి.ఎం.డి.,
హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్
ఉచిత సలహా సంప్రదింపుల కొరకు: 9550001188/99
టోల్ ఫ్రీ: 1800 102 2202
బ్రాంచ్‌లు: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు.