వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీపై టీడీపీ కార్యకర్తల దాడి
బీరంపాలెం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం కార్యకర్తల దాడులు కొనసాగుతునే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తల దాడులపై గవర్నర్, ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చినా ప్రయోజనం లేకుండా పోతోంది.
తాజాగా తూర్పు గోదావరి జిల్లా బీరంపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీటీసీ మచ్చా వీరభద్రపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు.
ఎంపీటీసీ మచ్చా వీరభద్రపై జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా రంగంపేట పోలీసులు పట్టించుకోకపోవడంపై నిరసన వ్యక్తమవుతోంది. గాయపడిన మచ్చా వీరభద్రను పెద్దాపురంకు తరలించారు.