రూ.10వేల కోట్ల ఎఫ్డీఐలకు ఆమోదం
న్యూఢిల్లీ : నాట్కో ఫార్మా, మైలాన్ ల్యాబరేటరీస్, బంధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సహా 23 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. వీటి విలువ రూ. 10,379 కోట్లు ఉంటుంది. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ఐపీబీ) సిఫార్సుల మేరకు వీటిని ఆమోదించిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) 13 ప్రతిపాదలనపై నిర్ణయాలను వాయిదా వేసింది. ఆరు ప్రతిపాదనలను తిరస్కరించింది. క్యాథలిక్ సిరియన్ బ్యాంక్లో విదేశీ పెట్టుబడుల పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెంచే (విలువ సుమారు రూ. 1,200 కోట్లు) ప్రతిపాదన ఉంది.