makthal
-
పదేళ్లుగా తెలంగాణను బీఆర్ఎస్ నాశనం చేసింది
-
మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి కన్నుమూత
-
కలెక్టర్ హరిచందనపై.. మక్తల్ ఎమ్మెల్యే మండిపాటు
నారాయణపేట: ‘జిల్లాలో అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ జీరోగా తయారైంది.. నా ఎమ్మెల్యే పదవి పోయినా పర్లేదు.. నేనేంటో చూపిస్తా.. ఇక్కడ నియంత పాలన సాగదు’ అంటూ నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి కలెక్టర్ దాసరి హరిచందనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జెడ్పీ చైర్పర్సన్ వనజమ్మ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో విద్యాశాఖ ఎజెండా చదువుతుండగా సమావేశానికి డీఈవో ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. ‘కలెక్టరే సమావేశాలకు రారు.. ఇక జిల్లా అధికారులు ఎందుకు వస్తార’ని అసహనం వ్యక్తం చేశారు. ‘జెడ్పీ సమావేశమంటే పిల్లలాటైంది.. ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులందరూ పనికిమాలిన వాళ్లా.. వచ్చేసారి అందరం కలసి కలెక్టరేట్‌కు వెళ్లి జెడ్పీ మీటింగ్ పెట్టాలి’అని అన్నారు. ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే, అక్కడ (కలెక్టరేట్లో) కలెక్టర్ రహస్య సమావేశాలు పెట్టడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ‘తెలంగాణ తెచ్చుకుంది.. జిల్లా వచ్చింది ఇందుకోసమేనా’ అని అసంతృప్తి వెళ్లగక్కారు. ఐదుగురు కనిపిస్తే కలెక్టర్‌కు బుగులు పుడుతుందని, వెంటనే పోలీసులు వచ్చి వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలిస్తారని అన్నారు. సంగంబండ ముంపు బాధితులు కలెక్టరేట్‌కు వస్తే వారిని అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. మక్తల్ నుంచి ఓ మహిళా సర్పంచ్ సమస్య పరిష్కారం కోసం వస్తే అగౌరవపరిచారని, ఇదే కలెక్టర్ బిల్డింగ్‌పై నుంచి దూకి చస్తానని ఆమె తనతో ఫోన్లో చెప్పారన్నారు. జిల్లాకేంద్రంలో రూ.కోట్ల విలువైన ఎస్ఎల్ డిగ్రీ కళాశాలను ప్రభుత్వానికి ఇస్తే తమ సొసైటీ బిల్డింగ్ దగ్గరికి ఆర్అండ్బీ అధికారులను పంపించి పెనాల్టీ కట్టాలని నోటీసులు పంపించారన్నారు. భారత్‌మాల కోసం దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్నారని, ధర నిర్ణయించి తిరిగి నోటిఫికేషన్ వేసి భూములు తీసుకోవాలని కోరారు. (క్లిక్: టీఆర్ఎస్కు రాజయ్య గుడ్‌బై) -
9వేల బస్తాల ధాన్యం పట్టివేత
మక్తల్: ఎలాంటి అను మతి లేకుండా కర్ణాటక నుంచి తెలంగాణకు ఒకేసారి 16 లారీలలో తీసుకువ స్తున్న సుమారు తొమ్మిది వేల ధాన్యం బస్తాలను మక్తల్ పోలీసు లు పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి సిర్పూర్, సిర్వార్, మాన్వే, రాయచూర్ నుంచి ధాన్యం లోడుతో ఈ లారీలు ఆదివారం తెల్లవారుజామున వస్తుండగా నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో సీఐ సీతయ్య, ఎస్ఐ రాములు పట్టుకున్నారు. ఒక్కో లారీలో 500 నుంచి 800 వరకు ధాన్యం బస్తాలు ఉన్నట్టు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.రెండు కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఇదిలాఉండగా నల్లగొండ నుంచి కర్ణాటక రాష్ట్రానికి సిమెంట్ తీసుకుని వెళ్లామని.. తిరుగు ప్రయాణంలో కొందరు వ్యక్తులతో మాట్లాడుకుని ధాన్యం లోడ్ తీసుకువస్తున్నామని లారీ డ్రైవర్లు చెప్పడం గమనార్హం. సరిహద్దు చెక్‌పోస్టు ఎలా దాటారు! నారాయణపేట జిల్లా కృష్ణ మండలం వాసునగర్ వద్ద సరిహద్దు చెక్‌పోస్టు ఉన్నా ఈ లారీలను పట్టుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణలో ధాన్యం రేటు ఎక్కువగా ఉండటంతో కర్ణాటకలో దళారుల నుంచి కొని.. కొందరు పెద్దల సహకారంతో ఇలా తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
తేనెటీగలను చెదరగొట్టబోయి వ్యక్తి సజీవ దహనం
మక్తల్: బస్సుల్లో చేరిన తేనెటీగలను చెదరగొట్టేందుకు నిప్పు పెట్టడంతో మూడు బస్సులు దగ్ధం కావడమేగాక, ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. నారాయణపేట జిల్లా మక్తల్‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. మక్తల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన మూడు బస్సులను నిర్వాహకులు ఏడాది కాలంగా స్కూల్ పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో నిలిపి ఉంచారు. ఉపయోగంలో లేకపోవడంతో వాటిలో తేనెటీగలు చేరాయి. దీనిని గమనించిన స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ స్థానికులైన బుడగజంగాలు మహదేవ్ (46), గోపీకి వాటిని తొలగించాలని సూచించారు. దీంతో వారిద్దరూ శనివారం సాయంత్రం కొబ్బరికొమ్మను కాల్చి బస్సులో మంటబెట్టారు. తేనెటీగలు చెల్లాచెదురుకాగా ఒక్కసారిగా మంటలు రేగి బస్సులు దగ్ధమయ్యాయి. అందులో చిక్కుకున్న మహదేవ్ సజీవ దహ నం కాగా, గోపీ ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డాడు. కొద్దిసేపటికి చుట్టుపక్కలవారు గమనించి మంటలను ఆర్పి పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ రాము లు పరిశీలించి మృతదేహాన్ని మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య బుజ్జమ్మ విలేకరులతో మాట్లాడుతూ, స్కూల్ ప్రిన్సిపాల్ ఫోన్ చేయడంతోనే తన భర్తతో పాటు మరో వ్యక్తి అక్కడికి వెళ్లి తేనెతుట్టెను రాల్చారని చెప్పారు. ఈ సంఘటనలో సుమారు రూ.30 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. చదవండి: సంబరాల్లో అపశ్రుతి.. తెలంగాణ భవన్లో మంటలు -
మళ్లీ ఆ నాలుగు జిల్లాల్లో కరోనా
సాక్షి, హైదరాబాద్: గత కొద్ది రోజులుగా జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లాలకే పరిమితమైన కరోనా.. మళ్లీ జిల్లాలకు పాకుతోంది. గత 14 రోజులుగా ఒక్క కేసూ నమోదు కాని జాబితాలో ఉన్న సూర్యాపేట, వికారాబా ద్, నల్లగొండ, నారాయణపేట్ జిల్లాల్లో మంగళవారం ఒక్కో కేసు చొప్పున నమోదు అయ్యాయని ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్‌రావు విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించారు. రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే 71 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మూడు జిల్లాలతో పాటు జీహెచ్ఎంసీలో 38, రంగారెడ్డి జిల్లా ఏడు, మేడ్చల్ ఆరు, ఇతర రాష్ట్రాల నుంచి వలసల ద్వారా 12, విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా 4 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,991కు చేరింది. మంగళవారం హైదరాబాద్ పరిధిలో ఒక వృద్ధురాలు మృతి చెందింది. దీంతో మొత్తం మృతి చెందినవారి సంఖ్య 57కు చేరింది. ప్రస్తుతం ఆసుపత్రిలో 650 మంది చికిత్స పొందుతున్నారు. మంగళవారం 120 మంది కోలుకోగా, వారితో కలిపి 1284 మంది డిశ్చార్జి అయ్యారు. 14 రోజులుగా కేసులు నమోదు కాని జిల్లాలు.. ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదుకాని జిల్లాల జాబితాలో వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తి జిల్లాలు ఉన్నాయి. గత 14 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాని జిల్లాలు సోమవారం నాటికి 25 ఉండగా, అవి మంగళవారం 21కి తగ్గాయి. ప్రస్తుతం 14 రోజులుగా నమోదు కాని జిల్లాల జాబితాలో కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, భూపాలపల్లి, నాగర్‌కర్నూలు, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, భద్రాద్రి, ఆసిఫాబాద్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ అర్బన్, గద్వాల, జనగాం, నిర్మల్‌లు ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంట్లో మరో ముగ్గురికి కరోనా కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంట్లో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వారింట్లో ఇప్పటివరకు నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. వర్క్ ఫ్రంహోం చేస్తు న్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ (38)కు సోమవారం కరోనా వచ్చిన విషయం తెలిసిందే. ఆయుర్వేద ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించగా భార్య (31), కూతురు, వారి వద్ద ఉండే బావమరిది కుమారుడుకి పాజిటివ్‌గా తేలింది. 4 నెలల బాలుడికి కరోనా.. నారాయణపేట్ జిల్లా మక్తల్ మండలంలోని జక్లేర్‌లో 4 నెలల బాలుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. వాస్తవానికి జలుబు, దగ్గుతో బాధపడుతున్న ఈ బాలుడిని ఈనెల 25న మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, మహబూబ్‌నగర్ జనరల్ ఆసుపత్రికి తరలించగా, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని నిలోఫర్‌కు పంపారు. మంగళవారం పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులను గాంధీ ఆసుపత్రి క్వారంటైన్‌కు తరలించారు. అలాగే వికారాబాద్ జిల్లా తాండూరులో ఏడాది బాలుడికి కరోనా సోకింది. వినాయక్‌చౌక్ ప్రాంతంలోని కూరగాయల మార్కెట్లో నివాసం ఉంటూ కిరాణ షాపు నిర్వహిస్తున్న వీరి కుటుంబం.. నాలుగు రోజుల కింద రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో జరిగిన ఓ విందుకు హాజరైంది. అయితే చిన్నారి మేనమామ కూడా ఈ కార్యక్రమానికి వచ్చాడు. అనంతరం ఆయనకు కరోనా లక్షణాలు కన్పించడంతో పరీక్షలు చేయగా, పాజిటివ్ అని తేలింది. ఏడు నెలల చిన్నారికి కరోనా వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని బండివెల్కిచర్లలో 7 నెలల బాబుకు కరోనా సోకింది. బొంరాస్‌పేట మండలం గౌరారం గ్రామానికి చెందిన ఓ కుటుంబం.. 4 రోజుల కింద బండి వెల్కచర్లలో నిర్వహించిన ఓ శుభకార్యానికి హాజరైంది. అయితే ఇదే విందులో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన వ్యక్తికి కరోనా సోకినట్లు తెలియడంతో కార్యక్రమానికి వచ్చిన వారందరినీ హోంక్వారంటైన్ చేశారు. వీరిలో 10 మందికి పరీక్షలు చేయగా, నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. వారిలోఒకరు 7 నెలల చిన్నారి ఉన్నాడు. ఆరు కుటుంబాలకు కరోనా.. దగ్గరి బంధువులైన ఆరు కుటుంబాలకు చెందిన దాదాపు 30 మందికి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపింది. జియాగూడ, బోరబండ, గౌలిపురా, హర్షగూడ, సంతోష్‌నగర్‌లో ఐదుగురు అక్కాచెల్లెళ్లు వారి కుటుంబాలతో నివాసం ఉంటున్నారు. వీరి అమ్మగారిల్లు పహాడీషరీఫ్ కాగా, జియాగూడలో కరోనా తీవ్ర స్థాయిలో ఉండటాన్ని దృష్టిలో ఉంచుకుని పిల్లలంతా పహాడీషరీఫ్‌కు వచ్చారు. ఇదే సమయంలో బోరబండ, సంతోష్‌నగర్, గౌలిపురాకు చెందిన వారు కూడా పహాడీషరీఫ్‌కు వచ్చారు. కొందరు జియాగూడ నుంచి హర్షగూడకు కూడా వెళ్లారు. దీంతో ఐదుగురు అక్కా చెల్లెళ్ల కుటుంబాలతో పాటు అమ్మగారి కుటుంబం కరోనా బారిన పడింది. మొత్తం దాదాపు 30 మంది వరకు కరోనా బారినపడి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, సనత్‌నగర్ డివిజన్లో ఒకే కుటుంబానికి చెందిన మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. 4 రోజుల కింద 65 ఏళ్ల వృద్ధురాలికికరోనా రావడంతో ఆసుపత్రికి తరలించారు. నలుగురు పోలీసులకు పాజిటివ్ హైదరాబాద్‌లోని స్పెషల్‌బ్రాంచ్ ఏఎస్సైకి కరోనా పాజిటివ్ వచ్చింది. గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన ఇటీవల కింగ్ కోఠి ఆసుపత్రిలో పరీ క్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. వలస కార్మికులను తరలించే క్రమంలో బహదూర్‌పుర, కామాటిపురా, షాలిబండ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుళ్లలో ముగ్గురికి కూడా కరోనా సోకింది. అలాగే కరోనా సోకిన వారికి చికిత్స అందిస్తున్న ఓ స్టాఫ్ నర్సుకు పాజిటివ్ వచ్చింది. -
ఆఫీస్ బాయ్ నుంచి ఆర్టిస్టుగా..
ఊట్కూర్ (మక్తల్): నాటకాలపై చిన్ననాటి నుంచే మక్కువ ఉండడంతోపాటు.. డ్యాన్స్, పాటలు, డైలాగ్‌లు చెప్పడంలో ప్రతిభ కనబరుస్తుండేవాడు నాని. ఆ కళలనే నమ్ముకొని ఎలాగైనా టీవీ, సినిమా రంగాల్లో ప్రతిభ కనబర్చాలని పొట్టుచేత పట్టుకొని హైదరాబాద్ వెళ్లాడు. పట్టుదలగా ప్రయత్నించి.. ప్రస్తుతం పలు సీరియళ్లు, సినిమాలలో నటిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. తండ్రి మరణంతో బతుకుదెరువు కోసం.. ఊట్కూర్ మండలంలోని కొల్లూర్ గ్రామ పంచాయతీలో కారోబార్‌గా పనిచేస్తున్న ఏసప్ప, కమలమ్మ కుమారుడు తిమోతి (నాని). గ్రామంలో 5వ తరగతి వరకు చదువుకున్నాడు. ఊట్కూర్‌లో ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తిచేశాడు. తండ్రి మృతి చెందడంతో ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మధ్యలో వదిలి జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడే ఓ కాఫీ హౌస్‌లో పనిచేస్తుండగా సీనిమా ఇండ్రస్ట్రీలో పనిచేస్తున్న సంజీవ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తనకు నటన అంటే ఇష్టమని, పాఠశాలలో వార్సికోత్సవాల్లో చిన్న, చిన్న నాటకాలు వేసేవాడినని తనకు సినిమా ఇండ్రస్టీలో ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని కోరడంతో ఆఫిస్ బాయ్‌గా నియమించాడు. ఆఫీస్ బాయ్ నుంచి ఆర్టిస్టుగా.. కుటుంబ భారాన్ని మోసేందుకు కాఫీ షాపులో పనిచేస్తూనే.. మరో వైపు తనకు బాగా ఇష్టమైన నాటకాలు, డ్యాన్స్, డైలాగ్‌లు చెప్పడంపై నాని మరింత నైపుణ్యం పొందాడు. కొంత మంది ప్రొడ్యూసర్లు, డైరక్టర్లు పరిచయం కావడంతో వారి సహకారంలో సినిమాల్లో, సీరియళ్లలో చిన్న, చిన్న ప్రాతలు వేస్తూ ప్రతిభ కనబరుస్తున్నాడు. సినీ హీరోలు నరేశ్, రాజ్‌తరుణ్, కమేడియన్ రఘుబాబు, పాసాని కృష్ణమురళి తదితరులతో కలిసి పాత్రలు వేశాడు. జెమిని, జీ తెలుగు, మా టీవీలలో సీరియళ్లలో నటిస్తున్నాడు. పల్లెటూరి యువకుడు.. సినిమాల్లో, టీవీ సీరియల్లలో నటించడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నటిస్తున్న సీరియళ్లు ఇవే.. జెమిని టీవీలో మధుమాసం, రెండు రెండ్ల ఆరు, అభిలాశ, జీ టీవీలో బంగారు గాజులు, రాధమ్మ కూతురు, గుండమ్మ కథ, మా టీవీలో వదినమ్మ, లక్ష్మికళ్యాణం, కృష్ణవేణి సీరియళ్లలో నటిస్తున్నాడు. తమ గ్రామ యువకుడు టీవీ సీరియళ్లలో ప్రతిభ కనబర్చడంపై నానిని గ్రామస్తులు అభినందిస్తున్నారు. -
ఇంట్లోకి మొసలి.. హడలెత్తిన కాలనీ
కృష్ణా (మక్తల్): మండల కేంద్రంలోని ధర్మశాల ప్రాంతంలో ఓ మొసలి శక్రవారం తెల్లవారుజామున ఏకంగా ఇంట్లోకి ప్రవేశించింది. దాంతో ఆ ప్రాంత ప్రజలు భయబ్రాంతులకు లోనయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ధర్మశాల వీధి కృష్ణానది ఒడ్డునుంచి దాదాపు 100 అడుగుల దూరంలో ఉంటుంది. కాగా ప్రతి రోజు మాదిరిగానే అర్చకుడు గిరీష్జోషి తెల్లవారుజామున లేచి నదికి వెళ్దామని ఇంట్లో నుంచి బయటకు వస్తుండగా ఇంటి ఆవరణలో ఓ మూలన మొసలి కనిపించింది. దీంతో ఇంట్లో వారు భయబ్రాంతులకు గురై చుట్టు ప్రక్కల జనాలను పిలిచారు. ఆ ప్రాంతంలోని వ్యక్తులు చేపలు పట్టడంలో నిష్ణాతులవడంతో ఆ మొసలిని చాకచక్యంగా పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చారు. విషయాన్ని జిల్లా ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో దానిని వారు స్వా«దీనం చేసుకున్నారు. ఇదిలాఉండగా, నీటిని వదిలి జనవాసాల్లోకి మొసళ్లు వస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
ప్రియాంక హత్య కేసు; నిందితుల్లో ఒకడిది లవ్‌మ్యారేజ్
సాక్షి, మక్తల్: డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసులో నిందితులు కారణంగా తమ గ్రామానికి చెడ్డ పేరు వచ్చిందని నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామ వాసులు అంటున్నారు. తమ గ్రామానికి చెందిన ప్రియాంకరెడ్డి హత్య కేసులో నిందితులు చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్ కుమార్ ఇంత ఘాతుకానికి పాల్పడ్డారంటే నమ్మలేకపోతున్నామని గ్రామస్తులు చెప్పారు. ఈ ముగ్గురు సొంతూరిలో బాగానే ఉండేవారిని, వారిపై ఎటువంటి ఫిర్యాదులు లేవని వెల్లడించారు. ఊళ్లో ఎక్కువగా కనబడేవారు కాదన్నారు. వీరి తల్లిదండ్రులు మంచివాళ్లేనని, కూలిపని చేసుకుని జీవిస్తున్నారని చెప్పారు. చెన్నకేశవులు ఐదు నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నాడని తెలిపారు. గుడిగండ్ల గ్రామంలో 60 మంది వరకు లారీల మీద పనిచేస్తున్నారు. ప్రియాంకరెడ్డి హత్య కేసులో లారీ నంబర్ ఆధారంగానే నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మహ్మద్ పాషాది గుడిగండ్ల పక్క గ్రామైన జక్లేర్. అతడి దగ్గర చెన్నకేశవులు, శివ, నవీన్ పనిచేస్తున్నారు. ఈ నలుగురు ప్రియాంక స్కూటర్ టైర్‌ను పథకం ప్రకారం పంక్చర్ చేసి తర్వాత ఆమెను ట్రాప్ చేసి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇంతటి దారుణానికి పాల్పడిన నిందితులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని గుడిగండ్ల, జక్లేర్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు నిందితుల కుటుంబ సభ్యులు ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. రెండు నెలల నుంచి లారీ క్లీనర్ పనిచేస్తున్నాడని శివ తండ్రి తెలిపాడు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వచ్చి పోలీసులు తమ కుమారుడిని తీసుకెళ్లారని చెప్పాడు. ఊరిలో మంచిగానే ఉండేవాడని, ఎటువంటి చెడు పనులు చేయలేదని వివరించాడు. ఆవారా తిరుగుతుండటంతో తాను తిట్టేవాడినని, దాంతే మహ్మద్ పాషా వద్ద క్లీనర్‌గా చేరాడని వెల్లడించాడు. తన కొడుకు మైనర్ అని, అతడి వయసు 17 ఏళ్లు మాత్రమేనని తెలిపాడు. ప్రియంకారెడ్డి హత్యకేసులో ఉన్న నిందితుల్లో ఒక్కొక్కరిది ఒక్క భిన్న మనస్తత్వం కలిగి ఉన్నారు. నిందితుల్లో ముగ్గురు 20 సంవత్సరాలు కూడా దాటని వారున్నారు. ఇందులో నవీన్ కుమార్ ఓ భిన్నమనస్తత్వం కలిగి ఉన్నాడు. తన మామూలు బైక్ ను స్పోర్ట్స్ బైక్‌లా మార్చుకున్నాడు. అంతే కాదు హెడ్ లైట్ తీసేసి దాని స్థానంలో డేంజర్ అని బొమ్మ వేసుకున్నాడు. ఇక టైగర్ బొమ్మలతో పాటు, వివిధ క్యాప్షన్లతో బైక్ తయారు చేసుకుని, రంద్రాలు పెట్టిన సైలెన్సర్ సౌండ్‌తో గ్రామంలో హల్ చల్ చేసేవాడని గ్రామస్తులు చెప్తున్నారు. సంబంధిత వార్తలు... ప్రియాంక హత్య.. గుండె పగిలింది నమ్మించి చంపేశారు! భయమవుతోంది పాప.. ప్లీజ్ మాట్లాడు ప్రియాంక హత్య కేసులో కొత్త విషయాలు ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు అప్పుడు అభయ.. ఇప్పుడు ! -
మక్తల్‌ను దత్తత తీసుకుంటా...
సాక్షి, మాగనూర్ (మక్తల్): మక్తల్ నియోజకవర్గాన్ని ద త్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని.. ఇది నా బాధ్యతగా తీసుకుంటానని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ప్రకటించారు. అలాగే మండలం లోని పునరావాస గ్రామాలైన నేరడగం, ఉజ్జెల్లిల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానని వెల్లడించా రు. మక్తల్ టీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రాంమోహన్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ గురువారం రాత్రి మాగనూరు మండల కేంద్రంలో గురువారం రా త్రి నిర్వహించిన రోడ్డు షోలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత ఎన్నికలు అభివృద్ధి, అవకాశవాదానికి నడుమ జరుగుతున్నాయని తెలిపారు. ఈ మేరకు ప్రజలు అభివృద్ధి వైపు నిలిచి రాంమోహన్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే మండల సరిహద్దులో ఉన్న కృష్ణా నదీ జలాలను సమగ్రంగా ఉపయోగించుకుని రైతులకు సాగు, తాగునీరు అందిస్తామని తెలిపారు. తెలంగాణలో వచ్చేది కారు.. కేసీఆరే ఊట్కూర్ (మక్తల్) : రానున్న ఎన్నికల్లో తెలంగాణలో గెలిచేది కారు.. వచ్చేది కేసీఆరేనని ప్రజలు అంటున్నారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఊ ట్కూర్‌లో జరిగిన రోడ్డు షోలో ఆయన మాట్లాడా రు. మక్తల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అ న్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. తెలం గాణ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత వి ద్యుత్ అందిస్తోందని చెప్పారు. అయితే, గత కాం గ్రెస్ ప్రభుత్వం మూడు గంటల కరెంటు ఇచ్చేవారని.. ఈసారి మహాకూటమి గెలిస్తే ఆరు గంటల విద్యుత్ మాత్రమే ఇస్తారని తెలిపారు. ఇక తాము రైతులకు ఇస్తున్న పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.8వేల నుంచి రూ.10వేలకు పెంచనున్నట్లు తెలిపారు. అదే మహాకూటమి అధికారంలోకి వస్తే సమన్వయ సమితి సంఘాలు, రైతు పెట్టుబడి సాయం ఎత్తివేస్తామని చెబుతున్నందున ప్రజలు విజ్ఞతతతో ఆలోచించి ఓటు వేయాలని హరీశ్‌రావు కోరారు. ఊట్కూర్ పెద్ద చెరువుకు నీరు ఊట్కూర్ పెద్దచెరువుకు లిఫ్ట్ ద్వారా నీరు అందించి మండలంలో ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తామని హరీశ్‌రావు వెల్లడించారు. ఊట్కూర్‌లో రైతు బజార్ ఏర్పాటు, బస్టాండ్ మరమత్తులు చేపడుతామని, అంబేద్కర్ భవన్‌కు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రచార కార్యక్రమాల్లో మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం మోహన్‌రెడ్డి, ఐడీసీ చైర్మన్ శంకర్‌రెడ్డి, స్టేట్ ట్రేడ్ యూనియన్ కార్పొరేషన్ చైర్మన్ దేవరి మల్లప్ప, టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బాద్మి శివకుమార్, జెడ్పీటీసీలు సరిత మధుసూదన్‌రెడ్డి, సూర్యప్రకాశ్‌రెడ్డి, చిట్టెం సుచరిత, విఠల్‌రావు ఆర్యతో పాటు ఎల్లారెడ్డి, శ్రీనివాసులు, ఈశ్వరయ్య, సురేందర్, ఉజ్జెల్లి సూరి, అరవింద్‌కుమార్, సుధాకర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, గోవిందప్ప పాల్గొన్నారు. -
దొరలపాలన అంతమవ్వాలి.. ప్రజాస్వామ్యం బతకాలి..
సాక్షి, అమరచింత : తెలంగాణ రాష్ట్రంలో గడీల పాలనలో విసిగివేసారిన జనం దొరలపాలనకు చరమగీతం పలికి బహుజనులకే రాజ్యాధికారం అందించడానికి ముందుకురావాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గసభ్యుడు జాన్‌వెస్లీ అన్నారు. సోమవారం అమరచింతలో బీఎల్ఎఫ్ మక్తల్ నియోజకవర్గ అభ్యర్థి వెంకట్రాంరెడ్డిని గెలిపించాలని కోరుతూ అమరచింతలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఎస్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీళ్లు,నిధులు, నియామకాలు అంటూ గద్దెనెక్కిన ముఖ్యమంత్రి కేసీఆర్ నీళ్లను మింగాడని, నిధులను దోచుకున్నాడని నియామకాలను వదిలేశారని ఆరోపించారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు ఇస్తానని, అర్హులైన ప్రతిఒక్కరికీ డబుల్ బెడ్రూంలను నిర్మించి ఇస్తానని ప్రగల్భాలు పలికి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా గాలికి వదిలేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ప్ర జాసంక్షేమాన్ని విస్మరించిన ఆయారాజకీయ పార్టీలు మరోమారు తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారని వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసి బీఎల్ఎఫ్ బలపర్చిన అభ్యర్థులను ఆదరించి గెలిపించాలని కోరారు. మక్తల్ నియోజకవర్గాన్ని పరిపాలించిన చిట్టెంరాంమోహన్‌రెడ్డి, కొత్తకోట దయాకర్‌రెడ్డి వారిసొంత ఆస్తులను పెంచుకున్నారే తప్పా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయలేదన్నారు. మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా లేకపోవడం శోచనీయం అన్నారు. కొత్తమండలాలతో పాటు కొన్నిచోట్ల పాతమండలాల్లో కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా ఏర్పాటు చేయలేని పాలకులను సాగనంపాలన్నారు. నియోజకవర్గం నుంచి బీఎల్ఎఫ్ అభ్యర్థిగా పోటీచేస్తున్న వెంకట్రాంరెడ్డికి మద్దతివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఎఫ్ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి, సీపీఎం మండల కార్యదర్శి జీఎస్.గోపి, సీపీఎం సీనియర్ నాయకులు మహిమూద్, శ్యాంసుందర్, బుచ్చన్న, రమేష్, తిమ్మోతి, వెంకటేష్ పలువురు పాల్గొన్నారు. -
ప్రజాసేవ చేయడమే లక్ష్యం..
సాక్షి, మక్తల్: నియోజకవర్గ ప్రజలందరికీ సేవ చేయాలన్నదే తమ ధ్యేయమని ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి మాదిరెడ్డి జలందర్‌రెడ్డి అన్నారు. మాజీ జెడ్పీటీసీ అక్కల సత్యనారాయణ ఆధ్వర్యంలో దాసర్పల్లి, బోందల్‌కుంట, గ్రామాలకు చెందిన పార్టీ వార్డు సభ్యుడు డైరెక్టర్లు, వివిధ నాయకులు దాదాపు 300 మంది కార్యకర్తలతో బారీగా చేరారు. మొదటగా మాజీ జెడ్పీటీసీ అక్కల సత్యనారాయణను జలందర్‌రెడ్డి శాలువాతో ఆవ్వానించి సన్మానం చేశారు. పట్టణంలో జలందర్‌రెడ్డి ప్రచారం చేశారు.అందరూ ట్రాక్టరు గుర్తు రావడంతో అందరి అశీర్వాదమేనని అన్నారు. అనంతరం జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అక్కల సత్యనారాయణ మాట్లాడారు. గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యమని అన్నారు. తాగునీటి వసతి, రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు. వార్డు సభ్యులు గొల్లపల్లి నారాయణ, సత్యనారాయణగౌడ్, హన్మంతు, రవికుమార్,బాలప్ప, కట్టవెంకటేస్, యూనిష్ లక్ష్మారెడ్డి, రాజుల ఆశిరెడ్డి, సూర్యనారాయణ, నీలప్ప, రంజిత్‌రెడ్డి, వెంకటేష్, మల్లేష్, మామిళ్ల ఆంజనేయులు, శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. జలంధర్‌రెడ్డికి పెరుగుతున్న ఆదరణ నర్వ: నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి జలంధర్‌రెడ్డికి రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని బంగ్ల లక్ష్మీకాంత్‌రెడ్డి అన్నారు. నర్వలో నిర్వహించిన ప్రచారంలో జెడ్పీటీసీ సభ్యుడు లక్ష్మీవెంకటయ్య, విశ్వబ్రాహ్మణ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు ఆచారి ఆయనకు మద్దతు తెలిపారు. రజక సంఘం మండల అధ్యక్షుడు తమ మద్దతు తెలిపారు. రైతు నేస్తం ట్రాక్టర్ గుర్తు రావడంతో జలంధర్‌రెడ్డి విజయం ఖాయమన్నారు. ఎంపీటీసీలు వెంకట్‌రెడ్డి, సంధ్య అయ్యన్న, ఆంజనేయులు, నాగిరెడ్డి, హన్మంతురెడ్డి, కోఆప్షన్ సభ్యులు ఫజల్, రజక సంఘం బొజ్జన్న, యాంకి వెంకటేష్, రవికుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నర్వ: మద్దతును ప్రకటిస్తున్న జెడ్పీటీసీ, విశ్వభ్రాహ్మణ, రజక సంఘం నాయకులు -
ఆశీర్వదిస్తే.. అభివృద్ధి చేస్తా..!
సాక్షి, మక్తల్: నియోజకవర్గ ప్రజలందరు ఎన్నికల్లో గెలిపిస్తే ఎంతో బుణపడి ఉంటానని, మక్తల్‌కు సేవ చేయాలన్నాదే నా ధ్యేయమని ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి మాదిరెడ్డి జలంధర్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలను అభివృద్ధి చేయడమే నా లక్ష్యమన్నారు. తాగునీటి వసతి, రోడ్డను అభివృద్ధి చేయడం వంటి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. మక్తల్, మాగనూర ఊట్కూర్, నర్వ, ఆత్మకూర్, కృష్ణ, అమరచింత మండాలాల కార్యకర్తలు తనవైపు ఉన్నారన్నారు. తనపై నమ్మకం పెట్టి చేరిన వారికి నేను అండగా ఉంటానన్నారు. అలాగే అనంతరం పస్పుల గ్రామంలో జలంధర్‌రెడ్డి సతీమణి పద్మజారెడ్డి పస్పులలో కృష్ణమ్మ తల్లికి పూజలు చేసి ప్రచారం నిర్వంహించారు. ఇంటింటికి తిరుగుతూ జలంధర్‌రెడ్డికి ఓటు వేసి ఆశీర్వదించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు లక్ష్మారెడ్డి, నియోజకవర్గ నాయకుడు ఆశిరెడ్డి, మక్తల్ మాజీ సర్పంచ్ సూర్యనారాయణ, మాజీ ఎంపీపీ గంగాధర్‌గౌడ్, లక్ష్మీకాంత్‌రెడ్డి, పురం వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సంతోష్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, బాబుల్‌రెడి, నీలప్ప, రంజిత్‌రెడ్డి, అబ్ధుల్‌హూసేన్, వెంకటేష్, మల్లేష్, శ్రీకాంత్‌రెడ్డి, దామెదర్‌రెడ్డి, సలీం తదితరులు పాల్గొన్నారు. సోమేశ్వర్‌బండలో పలువురి చేరిక మక్తల్ మండలం సోమేశ్వర్‌బండలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు అసమ్మత్తినాయకులు ఆశిరెడ్డి, సంతోష్‌రెడ్డి, నారాయణరెడ్డి సమక్షంలో చేరారు. అందరు జలంధర్‌రెడ్డికి మద్దతు తెలపాలని కోరారు. -
భర్త గెలుపు ‘పాట్లు’
సాక్షి, ఆత్మకూర్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గ అభివృద్దికోసం మక్తల్ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెంరాంమోహన్‌రెడ్డిని మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని చిట్టెంసుచరిత అన్నారు. ఆదివారం ఆత్మకూర్ పట్టణంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈసంధర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మక్తల్ ఎమ్మెల్యేగా చిట్టెం రాంమోహన్ రెడ్డి ఎన్నో అభివృద్ది కార్యక్రమాలను చేపట్టారన్నారు. అభివృద్దికోసం మరోసారి కారుగుర్తుకు ఓటువేసి గెలిపించాలని అభ్యర్థించారు. గుంటిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్తలు చిట్టెం సుచరిత సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ.డాక్టర్ శ్రీధర్‌గౌడ్, సింగిల్‌విండో అధ్యక్షుడు గాడి కృష్ణమూర్తి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవికుమార్ యాదవ్, ఎంపీటీసీ. గాయత్రి, నాయకులు మశ్చెందర్‌గౌడ్, రామక్రిష్ణ, రియాజ్, జమాల్, శ్రీను పాల్గొన్నారు. -
మక్తల్‌లో ఇందిరమ్మ ప్రచారం..
సాక్షి, మక్తల్ : మక్తల్ నియోజకవర్గానికి 1978 జరిగిన ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ తరఫున నర్సిములు నాయుడు పోటీ చేశారు. ఈ మేరకు ఆయనకు మద్దతుగా మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ప్రచారానికి వచ్చారు. మక్తల్‌లోని రాయచూర్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిపన బహిరంగ సభలో ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆనాటి ఇందిరాగాంధీ హిందీ ప్రసంగాన్ని రైల్వేశాఖ మాజీ శాఖ సహాయమంత్రి మల్లికార్జున్ తెలుగులోకి అనువదించారు. అయితే, ఆ ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థులు పలువురు ఓటమి పాలయ్యారు. కానీ మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఫార్మసిస్టుగా పని చేస్తూ రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన నర్సిములునాయుడు మాత్రం జనతా పార్టీ అభ్యర్థి చిట్టెం నర్సిరెడ్డి, రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి రాంచంద్రరావు కల్యాణి వంటి వారిని ఓడించి మక్తల్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. -
పేదల అభ్యున్నతే టీఆర్ఎస్ ధ్యేయం
సాక్షి, మక్తల్: పేదల అభ్యున్నతే టీఆర్ఎస్ ధ్యేయమని ఇచ్చిన మాట నెరవేరుస్తామని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం వివిద పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రామ్మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. అనంతరం గ్రామాల్లో చిట్టెం రాంమోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంకేన్‌పల్లిలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్లో చేరారు. మక్తల్, నర్వ, ఊట్కూర్, మాగనూర్ మండాలాల్లోప్రజలు టిఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. ఎస్‌ఎస్‌టీసీ చైర్మన్ దేవరి మల్లప్ప, మార్కెట్ చైర్మన్ నర్సింహగౌడ్, ఎంపీపీ గడ్డంపల్లి హన్మంతు, ఎంపీటీసీలు రవిశంకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ గోవర్ధన్‌రెడ్డి,గ్రామ రైతు సంఘం కోఆర్డినేటర్ సంయుక్తరెడ్డి, నర్సిరెడ్డి, రాంలింగం, మహిపాల్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ మారుతిగౌడ్, ఆంజనేయులుగౌడ్, కె.శ్రీహరి పాల్గొన్నారు. కృష్ణా(మాగనూర్): మండల పరిధిలోని గుడెబల్లూర్‌లో ఆదివారం తాజామాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారనే అభివృద్ది సాధ్యమని అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని కాంగ్రెస్ నాయకులు 200 మంది టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ నర్సింహాగౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు విజప్పగౌడ్, మక్తల్ అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్ ఆంబ్రేష్, విజయగౌడ్, శంక్రప్ప,తిమ్మప్ప పాల్గొన్నారు. మాగనూర్: మండల కేంద్రంలో ఆదివారం టీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సతీమణి చిట్టెం సుచరిత ప్రచారం చేశారు. సరిత మధుసూదన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ పూలవతి, పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి, నాయకులు శివరాంరెడ్డి, రాఘవరెడ్డి, సూగిరెడ్డి, శ్రీనివాసులు, సూరి.సురేందర్, సుదర్శన్‌గౌడ్, డిజిల్ సాబణ్ణ, తదితరులు పాల్గొన్నారు. నర్వ: నియోజకవర్గంలో ఏ గ్రామానికి ప్రచారానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని జరగబోవు ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని చిట్టెం చాణిక్యారెడ్డి అన్నారు. ఆదివారం ఉందేకోడ్, జంగంరెడ్డిపల్లి గ్రామాల్లో జంగంరెడ్డిపల్లిలో 50 మంది యువకులు పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శేఖర్‌యాదవ్, విజయ్‌కుమార్, జనార్దన్‌రెడ్డి, రామన్‌గౌడ్, మాజీ సర్పంచు భగవంతు, మల్లేష్‌యాదవ్, మహేష్‌గౌడ్, నందు, రంగారెడ్డి, పాండు, అశోక్, తదితరులు పాల్గొన్నారు. -
భీమా పుష్కరాలు ప్రారంభం
మాగనూర్ (మక్తల్): మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణా మండలంలో వ్రహిహిస్తున్న భీమా నది పుష్కరాలు గురువారం ప్రారంభమయ్యా యి. ఈ నది పుష్కరాల కోసం మూడు పుష్క ర ఘాట్లు ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి 7.23 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛ రణల నడుమ పుష్కరుడికి మంగళ హారతి ఇచ్చి పుష్కరాలు ప్రారంభమైనట్లుగా ప్రకటిం చారు. నేరడగం పక్షిమాద్రి విరక్త మఠం పీఠాధిపతి శ్రీ పంచమ సిద్ధలింగ మహా స్వా మి, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా దేవదాయ శాఖ కమిషనర్ శ్రీనివాస్‌రావు, మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి తదితరులు పూజల తర్వాత నదీ స్నానం ఆచరించారు. -
పారదర్శకత కోసమే టీజేఎస్
సాక్షి, మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్ : తెలంగాణలో రాజకీయ పార్టీలు ప్రజలే కేంద్రంగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎదిర, టీచర్స్ కాలనీ, పాతపాలమూరు, బండ్లగేరిలో మంగళవారం ఆయన పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఎదిరలో ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పార్టీలు ఏర్పడాలే తప్ప స్వార్థరాజకీయాల కోసం కాదన్నారు. పారదర్శకతతో రాజకీయాలను అందించడానికే టీజేఎస్ పార్టీని ఏర్పాటుచేశామని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల ను ప్రజల్లోకి తీసుకెళ్లి, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామన్నారు. తెలంగాణ అమర వీరుల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. ప్రజల అభిప్రాయం తీసుకోకుండానే ఎదిరె పంచాయతీని మున్సిపాలిటీలో విలీనం చేశారన్నారు. ఇలా విలీనం చేయడం వల్ల వ్యవసాయం చేసుకునే రైతులకు పన్నుల భారం పడుతుందని తెలిపారు. పుస్తకాలు కొత్తవి.. సమస్యలు పాతవి ప్రభుత్వం రైతులకు అందించిన చెక్కుల పంపిణీలో చాలా మంది రైతులకు అన్యాయం జరిగిందని కోదండరాం పేర్కొన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన పాసు పుస్తకాలు మాత్రమే కొత్తవని, వాటిలో రైతుల పేర్లు సరిగా రాకపోవడం, భూమి పూర్తిస్థాయిలో రికార్డు కాకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొన్నారన్నారు. రైతులు అంటే ఆర్థికంగా వెనుకబాటు ఉండి, తక్కువ భూమిలో సేద్యం చేసుకునే నిజమైన లబ్దిదారులకు చెక్కులు ఇవ్వడం వల్ల న్యాయం జరుగుతుందన్నారు. చెక్కుల పంపిణీలో అన్యాయం జరిగిన వారికి న్యాయం జరిగే విధంగా టీజేఎస్ పార్టీ వెంట ఉంటుందన్నారు. అందుకోసం రాష్ట్రంలో అన్ని జిల్లాలో కూడా పర్యటించి చెక్కుల పంపిణీలో ఉన్న లోటు పాట్లు రైతులకు జరిగిన ఇబ్బందిపై ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఈమేరకు పలువురు కోదండరాం సమక్షాన టీజేఎస్‌లో చేరగా, టీచర్స్ కాలనీలో ముస్లిం మహిళలకు రంజాన్ కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీజేఎస్ జిల్లా కన్వీనర్ రాజేందర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వసంత నర్సింహులు, నాయకులు మంత్రి నర్సిహ్మయ్య, బాల్కిషన్, దేవరాజ్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. పాలమూరుపై కేసీఆర్ సవతి ప్రేమ మక్తల్ : సీఎం కేసీఆర్ పాలమూరు జిల్లాపై అభివృద్ధిలో సవతి ప్రేమ చూపిస్తున్నారని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం అన్నారు. మక్తల్‌లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గతంలో 90శాతం పనులు చేసి కేవలం 10 శాతం పనులు చేయలేదని అన్నారు. ఎన్నికల హామీలను ఏ మాత్రం అమలు చేయలేదని తెలిపారు. తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు ఆవిర్భావ దినోత్సవం రోజున గౌరవించలేదని విమర్శించారు. అంతకు ముందు మక్తల్ పెద్ద చెరువులో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఒండ్రు మట్టిని తరలిస్తున్నారని చెప్పగా.. ఈ పనులు రైతుల కోసమా, ఇటుక బట్టీల వ్యాపారస్తుల కోసమా అని ప్రశ్నించారు. టీజేఎస్ కన్వీనర్ రాజేందర్‌రెడ్డితో పాటు నర్సిములు, సూర్యప్రకాష్, దత్తాత్రేయ, మొద్దు రాములు, పోలప్ప, జంసీర్, అశోక్ పాల్గొన్నారు. భూములు లేకుండా చేయడమేనా? మాగనూర్ (మక్తల్) : భూప్రక్షాళనలో జరిగిన అవకతవకల కారణంగా పేదలు తమ భూములపై హక్కులు కోల్పోయే ప్రమాదమున్నందున తక్షణమే రికార్డులు పూర్తిస్థాయిలో సరిచేయాలని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. భూప్రక్షాళనలో నష్టపోయిన రైతుల అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. మండల కేంద్రంలో రైతులతో ఫిర్యాదులు స్వీకరించారు. ప్రభుత్వం చేపట్టిన భూ ప్రక్షాళన పేద రైతులకు న్యాయం జరగడమేమో కానీ ఉన్న భూమి కోల్పోయే పరిస్థితులు ఉన్నాయన్నారు. టీజేఎస్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, నర్సిములు, ముదిరాములు, సూర్యప్రకాష్ ఉన్నారు. -
అట్రాసిటీ చట్టాన్ని కాపాడుకుందాం
సాక్షి, మక్తల్ : కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చేందుకు కుట్ర పన్నిందని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె.వై రత్నం, కేఎన్పీఎస్ రాష్ట్ర నాయకుడు డి.చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం పట్టణంలోని ఎస్ఎస్ పంక్షన్హాల్లో కేఎన్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా మొదటి మహసభలో వారు అతిథులుగా విచ్చేసి మాట్లాడారు. అంటరానితనం, అణచివేతకు వ్యతిరేకంగా పోరాటాలను చేయాలని, దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్ధాలు దాటుతున్నా ఇంకా ప్రజలు తమ హక్కులను పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత పీడిత కులాల మహిళలను అవమానించే రీతిలో జోగిని, బస్వినీలుగా మార్చే సంస్కృతి నుంచి బయట పడాలని సూచించారు. తెలంగాణ వచ్చిన వెంటనే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ మాట మార్చారని, మైనార్టీలపై దాడులు చేస్తుంటే పట్టించుకోవడంలేదన్నారు. సమాజంలో సామాజిక సమానత్వం, స్వేచ్ఛ, సౌబ్రాతృత్వం విలువలను కాపాడాటానికి అందరు తమవంతు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కెఎన్పీఎస్ రాష్ట్ర నాయకులు భూరం అభినవ్, రాములు, బండారి నర్సప్ప, రమేష్, లింగన్న, కృష్ణ, శ్రీదేవి, రాంచందర్, మద్దిలేటి, వామన్, మున్వర్‌అలీ, బండారి లక్ష్మణ్, వెంకటేస్ తదితరులు పాల్గొన్నారు. -
మక్తల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
మహబూబ్‌నగర్: జిల్లాలోని మక్తల్ మండలం, కాచ్వార్ గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్తల్ వైపు నుంచి వస్తోన్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులంతా చామన్‌పల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పెండింగ్ ప్రాజెక్టులకు రూ.11వేల కోట్లు
ఇంకా 3 వేల కోట్లు వెచ్చిస్తాం: హరీశ్‌రావు * రైతుల కళ్లలో ఆనందం చూడటమే సర్కార్ ధ్యేయం * సంగంబండ రిజర్వాయర్‌కు నీటి విడుదల మక్తల్: పెండింగ్ ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.11 వేల కోట్లు ఖర్చు చేసిందని, ఇంకా రూ.3 వేల కోట్లు వెచ్చించి మిగతా ప్రాజెక్టులను పూర్తి చేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌లో రాజీవ్ బీమా ఎత్తిపోతల పథకం(సంగంబండ) స్టేజీ-1, స్టేజీ-2లను గురువారం ఆయన ప్రారంభించి సంగంబండ రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేశారు. గురుకుల పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. పాలమూరు ప్రజలు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న సంగంబండ రిజర్వాయర్‌ను తమ ప్రభుత్వం ప్రారంభించి రైతులకు సాగు నీరందిస్తుందని, ఈ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. టీడీపీ నాయకులు ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా వాటిని అధిగమిస్తామన్నారు. ‘సీఎం కేసీఆర్ రైతు బిడ్డ.. రైతుల సంక్షేమం కోసమే ఆయన ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అందులోనూ మహబూబ్‌నగర్ జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.. ఎన్ని నిధులైనా వెచ్చించి ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేస్తాం’ అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. విపక్షాల పప్పులుడకవు పాలమూరు- రంగారెడ్డి, మల్లన్నసాగర్ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, అయితే.. వారి పప్పులు ఉడకవని హరీశ్ చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి 18 లక్షల ఎకరాలకు సాగు నీరందించి రైతు కళ్లలో ఆనందం చూడటమే కేసీఆర్ ధ్యేయమని చెప్పారు. వచ్చే సంవత్సరం నాటికి బీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు పూర్తి చేసి 8 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. జిల్లా నుంచి లక్షల మంది వలస వెళ్లిన వారు తిరిగి తమ స్వగ్రామాలకు వచ్చి బీడుబారిన పొలాలను సాగు చేసుకునేందుకు అవకాశం వచ్చిందన్నారు. గోదాముల అభివృద్ధికి వెయ్యి కోట్లు జిల్లాలోని గోదాముల కోసం ప్రత్యేకంగా రూ.వెయ్యి కోట్ల నిధులు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. రాష్ర్టంలో ఎస్సీ రెసిడెన్సియల్ పాఠశాలలు 134 మంజూరు చేయగా.. పాల మూరు జిల్లాకు 24 పాఠశాలలను కేటాయించారని గుర్తు చేశారు. చంద్రబాబు పల్లకీ మోస్తున్న తెలంగాణ టీడీపీ నాయకులు రేవంత్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, దయాకర్‌రెడ్డిలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన ప్రాజెక్టుల గురించి నోరువిప్పని కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఇప్పుడు రద్దు చేయాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అంతకుముందు మంత్రి హరీశ్‌రావు సంగంబండ రిజర్వాయర్ వద్దకు వెళ్లి పరిశీలించారు. కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
సంగంబండకు మోక్షం
మక్తల్: పాలమూరు జిల్లా వరప్రదాయిని భీమా ప్రాజెక్టుకు ఇన్నాళ్లకు మోక్షం లభించింది. గురువారం భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి, పంచాయతీరాజ్ శాఖ జూపల్లి కృష్ణారావు భీమా ఫేజ్–1 నుంచి సంగంబండ రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు 1995లో అప్పటి ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. పనులు చేపట్టకపోవడంతో uమొదటి పేజీ తరువాయి జలయజ్ఞం పేరిట దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పెండింగ్ ప్రాజెక్టుల్లో భాగంగా 2004 నవంబర్ 24న మక్తల్‌లో మరోసారి శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి రైతుల్లో ఆశలు రేకెత్తాయి. దీనికి రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకంగా నామకరణం చేశారు. చివరకు సంగంబండ రిజర్వాయర్ కింద ఇటీవల ఎడమకాల్వ పనులను పూర్తిచేశారు. రిజర్వాయర్‌కు 2.5కిలోమీటర్ల పొడవు మేర ఆనకట్టను నిర్మించారు. తాజాగా ఈ ప్రాజెక్టు కింద 75వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. వచ్చే ఖరీఫ్ నాటికి మాగనూర్, మక్తల్, నర్వ, ఆత్మకూర్, చిన్నచింతకుంట, వనపర్తి, కొల్లాపూర్, పెద్దమందడి, పెబ్బేర్, పాన్‌గల్, వీపనగండ్ల, కొల్లాపూర్, కొత్తకోట, దేవరకద్ర మండలాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. ప్రాజెక్టు స్వరూపం ఇలా.. మక్తల్ మండలం పంచదేవ్‌పహాడ్ వద్ద భీమా పంప్‌హౌస్‌కు లిఫ్ట్ చేస్తున్నారు. చిన్నగోప్లాపూర్ వద్ద ఫేజ్–1 పంప్‌హౌస్ నిర్మించారు. రెం డో పంప్‌హౌస్‌ను మక్తల్ సమీపంలో నిర్మించా రు. కృష్ణానది నుంచి గ్రావిటీ ఓపెన్ కెనాల్ ద్వారా నీటిని ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి మక్తల్‌లో నిర్మించిన ఫేజ్–1 పంప్‌హౌస్‌కు కెనాల్ ద్వారా నీరు సరఫరా అవుతుంది. అలాగే సంగంబండ రిజర్వాయర్‌కు నీటిని సరఫరా చేసే వీలుంటుంది. ఫేజ్–1 ద్వారా భూత్పూర్, సంగంబండ రిజర్వాయర్లలో దాదాపు మక్తల్, మాగనూరు, నర్వ, ఆత్మకూర్ మండలాల్లో 1.11లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీంతో ఈ ప్రాంతరైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి ఆశయం కోసం భీమాను సాధించి తీరిన ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. -
సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి
మక్తల్ : కార్మికుల హక్కుల రక్షణకు సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా సహాయకార్యదర్శి కిరణ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని సమావేశాలు, బైక్‌ర్యాలీతో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చామని అన్నారు. అందులో భాగంగానే పట్టణంలోని ఐబీ నుంచి నెహ్రూగంజ్, సంగంబండ, నల్లజానమ్మగుడి, పాతబజార్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం రాస్తారోకో నిర్వహించారు. పనికి తగిన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు. కార్యక్రమంలో ఇప్టూ నాయకులు భుట్టో, శ్రీనివాసులు, రమేష్, రాము, గోపి, రాజు, వెంకటేష్, సజన్, మారెప్ప, దేవప్ప, తదితరులు పాల్గొన్నారు. -
సార్వత్రిక సమ్మె విజయవంతం చేయండి
మక్తల్: సెప్టంబర్ 2న దేశ వ్యాప్త సమ్మేను విజయవంతం చేయాలని ఇఫ్టూ ఆధ్వర్యంలో మక్తల్‌లో బుధవారం పోస్టర్‡ విడుదల చేశారు. అనంతరం కార్యలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలు ఏమాత్రం పరిష్కరించడం లేదని అన్నారు.నెలకు 18 వేల రూపాయాలు వేతనం ుఇవ్వాలని డిమాండ్ చేశారు.నిత్యావసర వస్తువల ధరలు విపరీతంగా పెరిగాయని విమర్షించారు. కాంట్రాక్టు పద్దతిని రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఇప్టూ నాయకులు కిరణ్, భుట్టో, రాము, శ్రీనువాసులు,లక్ష్మణ నర్సిములు,చెన్నయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ఫొటోగ్రఫీ దినోత్సవం
మక్తల్ : ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా శుక్రవారం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అందరూ కలిసికట్టుగా ఉండి తమ సమస్యలను పరిష్కరించుకుందామని అన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు బి.శ్రీనివాసులు, పాపిరెడ్డి, హసన్, నర్సింహ, హస్మొద్దీన్, శంకర్, జయంత్, అశోక్‌రెడ్డి, ఆనంద్, మైబు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.