అందరినీ ఆకట్టుకునేలా ఆభరణాలు
తిరుపతి మంగళం: అందరినీ ఆకట్టుకునేలా ఆభరణాలను వినియోగదారులకు అందించడం మలబార్‌గోల్డ్ షోరూం వారి ప్రత్యేకత అని ప్రముఖ సినీనటి నిత్యామీనన్ తెలిపారు. తిరుపతి టౌన్‌క్లబ్ సర్కిల్లో ఉన్న మలబార్‌గోల్డ్ షోరూంలో ఏర్పాటు చేసిన ‘ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యూవెలరీ’ ప్రదర్శనను సినీనటి నిత్యామీనన్, తిరుపతి ఎమ్మెల్యే ఎం. సుగుణమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతిలో అనేక జ్యూవెలరీ షోరూంలు ఉన్నప్పటికీ మలబార్ గోల్డ్ షోరూం ఒక ప్రత్యేకత కలిగి ఉందన్నారు. మహిళల కోరికలకు తగ్గట్టుగా అన్ని రకాల మోడళ్లలో ఆభరణాలు ఆకట్టుకుంటున్నాయన్నా రు. ఆకర్షించే ఆభరణాలతో పాటు వినియోగదారులకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నారని తెలిపారు.
అనంతరం మలబార్ గోల్డ్ మార్కెటింగ్ హెడ్ కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ నాణ్యతకు మారుపేరు తమ మలబార్‌గోల్డ్ షోరూం అన్నారు. తమ షోరూం లో వజ్రాభరణాలపై వినియోగదారులకు15 శాతం రాయితీ కల్పిస్తున్నామన్నారు. తమకు వచ్చే ఆదాయంలో 10 శాతం పేదల సంక్షేమానికి వినియోగిస్తున్నామని తెలి పారు. అలాగే పేదల విద్యార్థుల ఉన్నత విద్యకు కూడ తాము సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రదర్శన ప్రారంభోత్సవ కార్యక్రమంలో నాయకులు మునిశేఖర్, మలబార్ గోల్డ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.