బాలీవుడ్ భామ.. హంగామా
బాలీవుడ్ భామ విద్యాబాలన్ నగరంలో సందడి చేశారు. తాను నటించిన ‘కహానీ 2’ చిత్ర ప్రచారంలో భాగంగా ఆమె మంగళవారం నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ‘తక్ష్’ మల్టీక్యుజిన్ రెస్టారెంట్‌కు వచ్చిన ఆమె చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
ఇదొక అద్భుతమైన సినిమాని, తన కెరీర్లో ఓ మైలురారుుగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. అనంతరం మాదాపూర్‌లోని ఎస్మార్ట్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌ను సందర్శించి కస్టమర్లను పలకరించారు. సరికొత్త బ్రాండ్ ఎల్ఈడీ టీవీని మార్కెట్లోకి విడుదల చేశారు. అదే విధంగా కూకట్‌పల్లిలోని సుజనాఫోరం మాల్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ‘సెల్ఫీ ఫెస్టివల్’ను లాంఛనంగా ప్రకటించారు. గచ్చిబౌలి స్టేడియంలో డిసెంబర్ 11న ‘సెల్ఫీ పండుగ’ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. - సాక్షి, సిటీబ్యూరో/ బంజారాహిల్స్