mandal commission
-
బీసీలకు శాపంగా జాతీయ విద్యా విధానం.. దేశవ్యాప్తంగా బీసీ పోరు!
సాక్షి, హైదరాబాద్: బీసీలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలంటే మండల్ కమిషన్ నిర్దేశించినట్టుగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో, పదోన్నతుల్లో తప్పకుండా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సూరజ్ మండల్ డిమాండ్ చేశారు. దేశంలో బీసీలు సహా కులాల వారీగా జనాభా ఎంత ఉందన్న స్పష్టత వచ్చేలా జనగణన చేయాలని.. ఈ రెండు అంశాల అమలు కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నామని తెలిపారు. ఆ దిశగానే ఈ నెల 11న హైదరాబాద్‌లో బీసీ సదస్సును నిర్వహించి, అందులో లేవనెత్తిన అంశాలతో ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని.. వచ్చే నెలలో హైదరాబాద్‌లో మహా ధర్నా నిర్వహించబోతున్నామని వెల్లడించారు. హైదరాబాద్‌లో బీసీ సదస్సు కోసం వచి్చన సూరజ్ మండల్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. బిహార్ సీఎంగా పనిచేసి బీసీల కోసం ఉద్యమించిన నేత బిందేశ్వర్ ప్రసాద్ మండల్ (బీపీ మండల్) మనవడిగా బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తాను కృషి చేస్తున్నట్టు చెప్పారు. సూరజ్ మండల్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ఏపీ తరహా స్ఫూర్తిని అనుసరించాలి.. ‘‘చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్ ఎప్పట్నుంచో ఉన్నా ఆచరణలోకి రాలేదు. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపుల్లో వైఎస్సార్సీపీ తీసుకున్న నిర్ణయం హర్షించదగినది. బీసీ ల్లోని పలు సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం దక్కేలా ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపు జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే పంథా అనుసరిస్తానని, బీసీలకు ప్రత్యేక ప్రాధా న్యత ఇస్తానని సీఎం జగన్మోహన్రెడ్డి ప్రకటించడం శుభపరిణామం. ఇదే స్ఫూర్తిని దేశ ప్రధాని సహా ఇతర రాష్ట్రాల సీఎంలు, అన్ని రాజకీయ పార్టీలు అనుసరిస్తే బీసీలకు తగిన న్యాయం జరుగుతుంది. బీసీలకు శాపంగా జాతీయ విద్యా విధానం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానం బీసీల పాలిట శాపంలా మారబోతోంది. ఆ పాలసీ పేరిట ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఫీజులను అడ్డగోలుగా పెంచేశారు. అరకొర ఆదాయ కేటగిరీలో ఉన్న బీసీలు ఈ పెరిగిన ఫీజులతో కేంద్ర విద్యా సంస్థల్లో చదువుకోవడంకష్టమే. ఆ సీట్లు చివరికి అగ్రవర్ణాలకే అందుతాయి. అందుకే ఎన్ఈపీలో మార్పులు చేయాలని, ఫీజులు తగ్గించాలని కోరినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం అత్యంత మూర్ఖంగా నిర్ణయం తీసుకుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక బీసీలు అన్ని విధాలా నష్టపోయారు. కేంద్రంలో కనీసం బీసీ మంత్రిత్వ శాఖ లేదు. ఎన్సీబీసీ చైర్మన్, సభ్యులను సకాలంలో నియమించకుండా కాలయాపన చేసి బీసీల హక్కులతో ఆటలాడుతున్నారు. కులాల వారీగా జనగణన అవసరం జనగణనలో కులాల వారీగా లెక్కలు తేల్చాలని ఏళ్లుగా ఉద్యమిస్తున్నాం. అన్ని వర్గాల నుంచి ఈ డిమాండ్ వస్తుండటంతో కేంద్రం జనగణన ప్రక్రియనే వాయిదా వేసింది. జనాభాలో కులాల వారీగా సంఖ్య తేలితే రిజర్వేషన్లు, ఇతర సంక్షేమ పథకాల అమలుకు మార్గం సుగమం అవుతుంది. ఈ అంశం కేంద్ర ప్రభుత్వానికి నచ్చడం లేదు. జనాభాలో అగ్రవర్ణాల సంఖ్య ఎంతో తేల్చకుండానే 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేసింది. బీజేపీ పాలనలో అగ్రవర్ణాలకు ఒక విధంగా, అణగారిన వర్గాలకు ఒక విధంగా న్యాయం ఉంటుందనిపిస్తోంది. -
Sharad Yadav: ‘మండల్’ అమలు వ్యూహం ఆయనదే!
దేశరాజధానిలో 2023 జనవరి 12న తీవ్రమైన గుండెపోటుతో కన్నుమూసిన శరద్ యాదవ్ (75) మృతి దేశవ్యాప్తంగా ఆయన అనుయాయులను, ఆరాధకులను దిగ్భ్రాంతికి గురిచేసింది. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఈ యువ ఎమర్జెన్సీ వ్యతిరేక విద్యార్థి నేత 1974 జయప్రకాష్ నారాయణ్ ఉద్యమ సమ యంలో 27 ఏళ్ల ప్రాయంలోనే పార్ల మెంటు స్థానంలో గెలుపొంది జాతీయ నేతగా మారారు. ఓబీసీ భావన, దాని వర్గీకరణ జాతీయ నిఘంటువుగా మారడానికి చాలాకాలానికి ముందే ఆయన శూద్ర, ఓబీసీ, సామాజిక శక్తుల ప్రతినిధిగా, సోషలిస్టు సిద్ధాంతవేత్తగా ఆవిర్భవించారు. రామ్మనోహర్ లోహియా, కర్పూరీ ఠాకూర్ (బిహార్‌కి చెందిన క్షురక సామాజిక బృందానికి చెందిన నేత)ల సోషలిస్టు సిద్ధాంత భూమిక నుంచి ఉత్తర భారతదేశంలో ఆవిర్భవించిన నూతన యువ శూద్ర, ఓబీసీ నేతల బృందంలో శరద్ యాదవ్ ఒక భాగమై ఉండేవారు. ఈ బృందంలోని ఇతర నేతలు తమ సొంత రాష్ట్రాలకే పరిమితమై పోగా, ఈయన మాత్రం జాతీయ ప్రముఖుడిగా మారారు. ఈ యువ బృందానికి చెందిన ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్‌లు జాతీయ రాజకీయాల నుంచి వెనుదిరిగి రాష్ట్ర రాజ కీయాలకు పరిమితమైపోగా, శరద్ యాదవ్ మాత్రం పార్లమెంటులోనే ఉండిపోయారు. ఏడు సార్లు లోక్‌సభ సభ్యుడిగా, మూడుసార్లు రాజ్యసభ సభ్యుడిగా నెగ్గిన శరద్ యాదవ్ పార్లమెంటులో పేదల అనుకూల సమరాల్లో పోరాడుతూ వచ్చారు. హిందీలో చక్కటి వక్త, తార్కిక చింతనాపరుడైన శరద్ యాదవ్ రాజకీయ వ్యూహకర్తగా ఉండేవారు. ఈయన రాజకీయ వ్యూహం ఫలితంగానే నాటి ఉప ప్రధాని, జాట్ నేత అయిన దేవీలాల్ నుంచి తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలోనూ... మండల్ నివేదికలోని ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ ఇచ్చే అంశాన్ని వీపీ సింగ్ అమలు చేయవలసి వచ్చింది. జనతా దళ్ ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన పరిణామాల గురించి శరద్ యాదవ్ వివరించి చెప్పారు. ‘మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని మ్యానిఫెస్టోలో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాల్సిందిగా జనతా దళ్ ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి మేము సోషలిస్టు నేతలందరినీ సమీకరించడం ప్రారంభించాము. ఇది జరగకుండా శూద్రులకు నిజమైన న్యాయం కలగదని మేము బలంగా నమ్మాము. మండల్ కమిషన్ సిఫార్సులను వీపీ సింగ్ సన్నిహితులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీన్ని అధిగమించడానికి ఆయన ఉపప్రధాని, ప్రముఖ జాట్ నేత దేవీలాల్ చౌదరి అధ్యక్షతన ఒక కమిటీని నియమించారు. చరణ్ సింగ్ జోక్యం కారణం గానే జాట్లను వెనుకబడిన వర్గాల జాబి తాలో మండల్ చేర్చలేక పోయారని తనకు తెలుసు. అయినప్పటికీ అనేక మంది స్థానిక జాట్ నేతలు, బృందాలు రిజ ర్వేషన్ కేటగిరీలో తమను చేర్చాల్సిందిగా తమ తమ రాజకీయ నేతలను ఒత్తి డికి గురి చేశారు. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకున్న వీపీ సింగ్ గొప్ప ఎత్తు వేశారు. జాట్లను రిజర్వేషన్ జాబితాలో చేర్చడానికి తాను వ్యతిరేకమే అయినప్పటికీ, ప్రముఖ జాట్ నేత అయిన దేవీలాల్ జాట్లను చేర్చకుండా మండల్ సిఫార్సులను అమలు చేయబోరని వీపీ సింగ్‌కు కచ్చితంగా తెలుసు. జనతాదళ్ జనరల్ సెక్రెటరీ, పరిశ్రమల మంత్రీ అయిన చౌదరి అజిత్ సింగ్ కూడా వెనుకబడిన వర్గాల హక్కుల కోసం ప్రచారం ప్రారంభించారు, ఓబీసీ జాబితాలో జాట్లను చేర్చాల్సిందేనని నొక్కి చెప్పసాగారు. దీంతో దేవీలాల్ రాజకీయ డైలమాలో చిక్కుకున్నారు. జాట్లను వెనుకబడిన వర్గంగా చేర్చిన ఘనత అజిత్ సింగ్‌కు దక్కకూడదని ఆయన కోరుకున్నారు. మరోవైపు, జాట్లను ఓబీసీ జాబితాలో చేర్చకుంటే తన సొంత జాట్ కమ్యూనిటీ నుంచి ఆగ్రహాన్ని చవిచూసే ప్రమాదాన్ని కూడా దేవీలాల్ కోరుకోలేదు. కాబట్టి, ఇది మండల్ కమిషన్‌పై చర్చకు ముగింపు పలుకుతుందని వీపీ సింగ్ భావించారు. ‘‘1990 ఆగస్టు 3న, వీపీ సింగ్ నాకు కబురంపి ‘సోదరా శరద్! చౌదరి దేవీలాల్ని ఇక ఏమాత్రం నేను సహించలేన’ని చెప్పారు. దేవీలాల్‌తో మాట్లాడతాననీ, ఈ అధ్యాయానికి శాశ్వతంగా ముగింపు పలుకుతాననీ నేను వీపీ సింగ్‌కు హామీ ఇచ్చాను. అయితే దేవీ లాల్‌ని కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించవద్దని నేను వీపీ సింగ్‌ను అభ్యర్థించాను. కానీ అప్పటికే దేవీలాల్‌కి ఉద్వాసన పలుకుతున్న ఆదేశాన్ని తాను రాష్ట్రపతికి పంపేసినట్లు వీపీ సింగ్ సమాధాన మిచ్చారు. దీంతో నేను సంభాషణను ముగించాల్సి వచ్చింది. మరుసటి రోజు తన కార్యాలయానికి రావలసిందిగా వీపీ సింగ్ కబురంపారు. నేను వెళ్లాను. దేవీలాల్ గురించి చర్చించుకున్నాము. నన్ను విశ్వాసంలోకి తీసుకోవాలని వీపీ సింగ్ భావించారు. అలాగైతేనే నేను దేవీలాల్‌తో జతకట్టబోనని ఆయన భావించారు. దేవీలాల్ పక్షంలో నేను చేరినట్లయితే ప్రధానమంత్రిగా తాను ఎక్కువ కాలం కొనసాగలేనని వీపీ సింగ్ భావిస్తున్నారని దీనర్థం. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకున్న నేను మండల్ కమిషన్ సిఫార్సులను వెంటనే అమలు చేస్తున్నట్లు ప్రకటించాలని వీపీ సింగ్‌ను కోరాను. ఆయన 1990 ఆగస్టు 15న దీనిపై ప్రకటన వెలువరించడానికి మొదట అంగీకరించారు. కానీ ఆగస్టు 9వ తేదీనే ఆయన దాన్ని ప్రకటించాల్సి వచ్చింది. అలా ప్రకటించకపోయి ఉంటే నేను ఢిల్లీలో జరగనున్న దేవీ లాల్ ర్యాలీలో చేరడం తప్ప మరొక అవకాశం నాకు ఉండేది కాదు. మండల్ సిఫార్సులను అమలు చేస్తే అవి సమానతా సమాజాన్ని విశ్వసించి, దానికోసం కలగన్న అంబేడ్కర్, కర్పూరీ ఠాకూర్, లోహియా, జయప్రకాష్ నారాయణ్ స్వప్నాలు సాకారమవుతాయని నేను భావించాను. 1990 ఆగస్టు 6న వీపీ సింగ్ నివాసంలో సాయంత్రం 6 గంటలకు క్యాబినెట్ సమావేశం జరిగింది. మండల్ కమిషన్ సిఫార్సుల అమలు ఈ సమావేశ ప్రధాన ఎజెండా. సన్ని హితులు హెచ్చరిస్తున్నప్పటికీ, ఆ మరుసటి రోజు అంటే 1990 ఆగస్టు 7న కేంద్ర ప్రభుత్వం 27 శాతం రిజర్వేషన్లను ఓబీసీలకు కల్పిస్తూ మండల్ కమిషన్ చేసిన రికమంండేషన్ను అమలు చేస్తామని ప్రకటించింది. చివరకు 1990 ఆగస్టు 13న ఓబీసీ రిజర్వేషన్ అమలుకు కేంద్రం నోటిఫికేషన్ జారీచేసింది. ఆగస్టు 10 నుంచే ఆధిపత్య కులాలు రిజర్వేషన్కి వ్యతిరేకంగా నిర సనలు ప్రారంభించాయి. నెలరోజుల పాటు విద్యార్థులు, బ్యూరోక్రాట్లు, టీచర్లు దేశవ్యాప్తంగా రిజర్వేషన్ వ్యతిరేక నిర సనల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. రహదారులు దిగ్బంధనకు గురయ్యాయి.’’ – ‘ది శూద్రాస్– విజన్ ఫర్ ఎ న్యూ పాత్’ అనే పుస్తకం నుంచి. అయితే, ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లను కల్పించాలన్న మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేసేలా వీపీ సింగ్ ప్రభుత్వాన్ని ప్రేరేపించడంలో; వీధుల్లో మండల్ అనుకూల, వ్యతిరేక పోరాటాలను రగుల్కొల్పడంలో నాటి యువ శరద్ యాదవ్ తగిన పాత్ర పోషించకపోయి ఉంటే, భారతీయ శూద్ర/ఓబీసీలు ఈ రోజు దేశంలో ఈ స్థాయికి చేరుకుని ఉండేవారు కాదు. ఆర్ఎస్ఎస్/బీజేపీ శక్తులను నియంత్రిస్తున్న ద్విజులు మండల్ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నప్పటికీ, ఆనాడు శూద్ర/ఓబీసీలు భారీ స్థాయిలో మండల్ అనుకూల సామాజిక సమీకరణకు పూనుకోకపోయి ఉంటే, నేడు ఓబీసీలు తమకు నాయకత్వం వహించి, నరేంద్రమోడీ భారత ప్రధాని కావ డానికి ద్విజులు అమోదించి ఉండేవారు కాదు. చివరగా, ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ శూద్ర/ఓబీసీ నేతలు నేటి తమ రాజకీయ ప్రతిపత్తికి గాను శరద్ యాదవ్ అనే గొప్ప పోరాటకారుడికి ఎప్పటికీ రుణపడి ఉంటారు. - ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
BP Mandal: మండల్ దన్నుతో ఉద్యమించాలి!
ఇండియా జనాభాలో సగాని కన్నా ఎక్కువ ఉన్న వెనుక బడిన తరగతులవారు (బీసీలు)... తరతరాలుగా భారతీయ సమాజానికి సేవ చేస్తున్నారు. కానీ వారు మాత్రం అన్ని రంగాల్లో వెనక బడే ఉన్నారు. అందుకే బీసీల సామాజిక, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయడం కోసం 1953 జనవరిలో కాకా కలేల్కర్ కమిషన్‌ను అప్పటి ప్రభుత్వం నియమించింది. 1955 మార్చిలో కమిషన్ నివేదిక సమర్పించి బీసీల అభివృద్ధికి పలు సూచనలు చేసింది. ఆ నివేదికను ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. 1977లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక... కాక కలేల్కర్ కమిషన్ నివేదిక సమర్పించి చాలా ఏండ్లు అయిందని... కొత్త కమిషన్‌ను 1978 డిసెంబర్లో నియమించింది. దీనికి బిహార్ మాజీ ముఖ్య మంత్రి బీపీ మండల్ సారధ్యం వహించారు. మండల్ 1980 డిసెంబర్ 31న నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. కానీ దాని సూచనలు అమలుకు నోచుకోలేదు. దీంతో బీసీలంతా ఉద్యమించారు. బహుజన్ సమాజ్ పార్టీ ఉద్యమానికి అండగా నిలిచింది. చివరికి అప్పటి ప్రధాని వీపీ సింగ్ 1990 ఆగస్టు 7న మండల్ నివేదికను అమలు పరుస్తానని ప్రకటన చేశారు. ప్రధాని ప్రకటనతో దేశవ్యాప్తంగా ఆధిపత్య కులాలు ఆందోళనకు దిగాయి. అన్ని పార్టీలు మండల్ నివేదికకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేశాయి. బయట నుండి వీపీ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న బీజేపీ తన మద్దతును ఉపసంహరించి తానెవరి వైపో తేల్చి చెప్పింది. మండల్ కమిషన్‌ను అమలు చేయరాదని ఆధిపత్య కులాల వారు కోర్టును ఆశ్రయించారు. చివరకు 1993లో మండల్ నివేదిక అమలుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో బీసీలకు కేంద్ర విద్యాసంస్థల్లో, సర్వీసుల్లో 27 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. కేంద్ర రిజర్వేషన్ సౌకర్యం పొందే బీసీలను ‘అదర్ బ్యాక్వార్డ్ క్లాసెస్’ (ఓబీసీలు)గా వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద మండల్ కమిషన్ బీసీల అభివృద్ధికి 40 సూచనలు చేయగా అందులో ఒకటైన విద్యా, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని మాత్రమే అమలుచేసి అప్పటి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. బీసీల అభ్యున్నతికి విలువైన సూచనలు చేసిన బీపీ మండల్ బీసీల మదిలో ఎప్పటికీ నిలిచిపోతారు. ఆయన 1918 ఆగస్టు 25న బిహార్ మధేపూర్ జిల్లా మోరో గ్రామంలో... రాస్ బీహారీ లాల్ మండల్ జమీందారీ కుటుంబంలో జన్మించారు. 1952 మొదటి సారిగా శాసనసభకు ఎన్నికైన మండల్ ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. రామ్ మనోహర్ లోహియా నాయకత్వంలో పనిచేసిన మండల్ 1967 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 69 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. దీంతో 1968 ఫిబ్రవరిలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. (క్లిక్: వారి విడుదల దేనికి సంకేతం?) బయట నుండి మద్దతునిచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకుల అవినీతిపై విచారణ జరిగితే... ఆ విచారణ నివేదికను బుట్టదాఖలు చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల్‌పై ఒత్తిడి చేసింది. అయినా నిజాయితీగా కాంగ్రెస్ అవినీతి నాయకులపై చర్య తీసుకున్నారు. దాంతో కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం కూలిపోయింది. నీతి కోసం నిలబడిన గొప్ప నాయకుడు బీపీ మండల్. 1974లో ఎమ్మేల్యే పదవికి రాజీనామా చేసి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని 1977లో జనతా పార్టీ తరఫున లోకసభకు ఎన్నికయ్యారు. కులాలుగా చీలిపోయి ఉన్న బీసీలు ఏకమై... పార్టీలకు, సంఘాలకు అతీతంగా ఐక్యమై బీపీ మండల్ కమిషన్ ఇచ్చిన స్థైర్యంతో ముందుకు సాగి తమ హక్కులను సాధించుకోవాలి. (క్లిక్: 75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!) - సాయిని నరేందర్ బీసీ స్టడీ ఫోరం వ్యవస్థాపక చైర్మన్ (ఆగస్టు 25న బీపీ మండల్ జయంతి) -
రిటైర్డ్ ఐఏఎస్ పీఎస్ కృష్ణన్ కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అలుపెరగని కృషి చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీఎస్ కృష్ణన్ (86) కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం ఉదయం 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. కేరళకు చెందిన 1956 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి కృష్ణన్.. కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం విశేష కృషి చేసిన అఖిల భారత సర్వీసు అధికారిగా అందరి మన్ననలు పొందారు. మండల్ కమిషన్ సిఫార్సుల్లో ఆయన ముఖ్యభూమిక పోషించారు. వైఎస్సార్ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా ముస్లిం రిజర్వేషన్ల రూపకల్పనలో కృష్ణన్‌ది ప్రముఖపాత్ర. కేంద్ర సంక్షేమ శాఖ కార్యదర్శిగా, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడిగా, బీసీ కమిషన్ సభ్య కార్యదర్శిగా, ప్లానింగ్ కమిషన్‌లోని వివిధ విభాగాల్లో చైర్మన్, సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎస్సీ, ఎస్టీ చట్టం–1989, సవరణ చట్టం–2015, సవరణ చట్టం–2018 డ్రాఫ్ట్ రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. కేంద్ర ప్రభుత్వ గౌరవ సలహాదారుడిగా పనిచేశారు. ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించిన కృష్ణన్ మృతి పట్ల భవన్ ఉద్యోగులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పీఎస్ కృష్ణన్‌కు భార్య శాంతి, కుమార్తె శుభా, అల్లుడు చంద్రశేఖర్ ఉన్నారు. కృష్ణన్ అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీలో పూర్తయ్యాయి. అంత్యక్రియల్లో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, బృందా కారత్, ఎన్‌సీడీహెచ్చార్ ప్రధాన కార్యదర్శి పాల్ దివాకర్, ఏపీ భవన్ ఇన్చార్జ్ ఆర్సీ భావనా సక్సేనా, ఏఐడీఆర్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు కందుల ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్ సంతాపం పీఎస్ కృష్ణన్ మృతి పట్ల సీఎం వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కృష్ణన్ జీవితాన్ని అణగారిన వర్గాల అభివృద్ధి కోసం అంకితం చేశారని కీర్తించారు. అట్టడుగు వర్గాలకు అండగా నిలబడ్డ వ్యక్తిగా ఆయన గుర్తుండి పోతారని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. -
బీసీ రిజర్వేషన్ సునామి ‘మండల్’
భారత రాజ్యాంగ నిర్మాణం తర్వాత భారత సామాజిక రాజకీయాలను కదిలించివేసిన ఘనత బి.పి. మండల్‌కే దక్కుతుంది. రాజకీయాల్లో ఉద్యోగ, విద్య, తదితర రంగాల్లో ప్రాతినిధ్యం లేని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కోసం మండల్ సాగించిన కృషికి చారిత్రక ప్రాధాన్యం ఉంది. కాలం గడిచినకొద్దీ ఇది విస్తరిస్తూనే ఉంటుంది. మండల్ కమిషన్ నివేదిక లేకుండా జాతీయ బీసీ కమిషన్లు గానీ, రాష్ట్రాల్లో బీసీ కమిషన్లు గానీ లేవు. మండల్ కమిషన్ నివేదిక లేకుండా జాతీయ బీసీ కమిషన్లు గానీ, రాష్ట్రాల్లో బీసీ కమిషన్లు గానీ లేవు. భారత రాజకీయ, సామాజిక చరిత్ర నిర్మాణంలో మండల్ కమిషన్ నివేదిక నిర్వహించిన కీలకపాత్ర ఎవ్వరూ చెరిపివేయలేనిది. మండల్ కమిషన్ నివేదిక లేకుండా జాతీయ బీసీ కమిషన్లుగానీ, రాష్ట్రాల్లో బీసీ కమిషన్లు గానీ లేవు. ఇటీవల 123వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా ఎస్సీ, ఎస్టీ కమిషన్లలాగా బీసీ కమిషన్లకు కూడా రాజ్యాంగపరమైన విస్తృత అధికారాలు కల్పించారు. బీసీ కమిషన్లను నిర్మించడానికి, ఇప్పుడు 123వ రాజ్యాంగ సవరణ బిల్లుతో వాటిని పునర్నిర్మించడానికి మండల్ కమిషన్ నివేదికే ప్రాతిపదిక. ఇలా బిందే శ్వరి ప్రసాద్ మండల్ స్వాతంత్య్రానంతరం భారతీయ సామాజిక, రాజ కీయ పరిణామాల్లో ఒక ప్రత్యేక అధ్యాయం. దేశ రాజకీయాల్లో, ఉద్య మాల్లో, బీసీల జీవితాల్లో అనేక మలుపులకు, పరిణామాలకు మండల్ కమిషన్ ఒక రాజ్యాంగంలాగా స్ఫూర్తినిస్తూ వచ్చింది. బీసీలు ఉన్నంత కాలం ఈ దేశంలో మండల్ పేరు చిరస్థాయిగా నిలిచిపో తుంది. భారత దేశంలోని ప్రజలలో ఒక భాగాన్ని ‘అదర్ బేక్ వర్డ్ క్లాసెస్’(ఆఇట) (ఇతర వెనుకబడిన కులాలు)గా మండల్ కమిషన్ నివేదిక నిర్వచించింది. ఈ నివేదిక తర్వాతే, భారతీయ రాజకీయాల్లో బలహీన వర్గాల కోసం విధివిధానంపై తీవ్రమైన చర్చ ప్రారంభమైంది. అధికారపక్షంలోనూ ప్రతిపక్ష పాత్రే! బిందేశ్వరి ప్రసాద్ మండల్ 25 ఆగస్టు 1918లో బీహార్‌లో యాదవ సామాజిక వర్గంలో జన్మించారు. తన 23వ యేటా జిల్లా కౌన్సిల్‌కి ఎన్ని కయ్యారు. 1945–51 మధ్య కాలంలో మాధేపుర డివిజన్లో జీతం తీసుకోకుండా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌గా పనిచేసారు. బి.పి. మండల్ రాజకీయ జీవితం భారత జాతీయ కాంగ్రెస్‌తో మొదలైంది. 1952 లో మొదటిసారి బీహార్ అసెంబ్లీకి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. అధి కార పార్టీలో ఉంటూనే, బీహార్‌లోని బలహీనవర్గ కుర్మీలపై అగ్రవర్ణ రాజపుత్రులు దాడి చేయడాన్ని నిరసించారు. 1965లో తన నియోజక వర్గంలో భాగంగా ఉన్న గ్రామమైన పామాలో మైనారిటీలపై, దళితు లపై పోలీసులు చేస్తున్న అత్యాచారాలపై మాట్లాడాలని మండల్ భావిం చారు. కానీ అధికార పక్షంలో ఉండి ఈ అంశంపై మాట్లాడకూడదని ముఖ్యమంత్రి ఆదేశించినప్పుడు, తన మనస్సాక్షిని చంపుకోలేక ప్రతి పక్ష పాత్ర నిర్వహించడానికి సిద్ధమై సంయుక్త సోషలిస్ట్ పార్టీ (ఎస్.ఎస్.పి)లో చేరారు. తను నమ్మిన విలువల కోసం అధికార పార్టీని వదిలి ప్రతిపక్ష పాత్ర నిర్వహించడానికి సిద్ధమయ్యారు. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా, జయ ప్రకాష్ నారాయణ్‌ల స్ఫూర్తితో సంయుక్త సోషలిస్ట్ పార్టీ (ఎస్.ఎస్.పి)లో చేరారు. ఆ క్రమంలో ఆ పార్టీ రాష్ట్ర పార్ల మెంటరీ బోర్డు ఛైర్మన్‌గా నియమితులయ్యారు. 1967లో జరిగిన ఎన్నికలలో సంయుక్త సోషలిస్టు పార్టీ అభ్యర్ధుల ఎంపికపై ఆయన చేసిన కృషి, ఆయన ప్రచారం వల్ల, 1962లో కేవలం 7 సీట్లు మాత్రమే కలిగి ఉన్న ఆ పార్టీకి 1967లో 69 సీట్లు వచ్చాయి. ఆ విధంగా బీహార్‌లో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. మండల్ పార్లమెంటు సభ్యుడు అయినప్పటికీ రాష్ట్ర మంత్రివర్గంలో చేర్చుకున్నారు. బిహార్ ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసారు. పార్టీలో, ప్రభుత్వంలో విభేదాలు రావడం, కాంగ్రెస్ పార్టీ బయటి నుంచి మద్దతు ఇవ్వడంవల్ల 1968 ఫిబ్రవరి 1న మండల్, బీహార్ రాష్ట్ర రెండవ బీసీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకున్నప్పటికీ రాజీ పడకుండా రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల అవినీతిపై అయ్యర్ కమిషన్ వేశారు. ఆ కమిషన్ నివేదికను బహిరంగపర్చవద్దంటూ నాటి ప్రధాని ఇందిర స్వయంగా ఒత్తిడి తీసుకు వచ్చినా నిరాకరించారు. దాంతో మండల్ ప్రభుత్వంపై అవి శ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అలా 30 రోజులకే మండల్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ‘ఓట్లను సంపాదించడానికి కులపరమైన విజ్ఞప్తిని సహించవచ్చు కానీ ప్రభుత్వాల నిర్ణయాల్లో ఏ కుల తత్వాన్ని సహించవద్ద’ని తన మంత్రులకు బోధించిన మండల్ తన ప్రభుత్వంలో, పరిపాలనలో కులతత్వాన్ని ప్రదర్శించకుండా పాలిం చారు. ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగిన తర్వాత మండల్ 1967 మార్చి 5న సోషిత్ దళ్ (అణగారిన ప్రజల పార్టీ)ని స్థాపించారు. 1967 నుండి 1970 వరకు లోక్‌సభ సభ్యునిగా పని చేశారు. 1972లో శాసన సభకు తిరిగి ఎన్నికయ్యారు. 1972లో అప్పటి బీహార్ ముఖ్యమంత్రి పాండే, మిథిలా యూనివర్సిటీ పేరుతో అందులో కింది ఉద్యోగి నుంచి వైస్ ఛాన్సలర్ దాకా ఒకే కులం వారిని నింపాలని చేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించారు. మండల్ కమిషన్‌తో రాజకీయాల్లో మూలమలుపు బి.పి.మండల్ 1974లో శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జయప్రకాష్ నారాయణ నేతృత్వంలో నడుస్తున్న అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. 1977లో జనతా పార్టీ తరపున లోక్‌సభకి ఎన్నికై 1979 వరకు కొనసాగారు. మండల్ సోషలిస్ట్ రాజకీయ చింత నాపరుడిగా పని చేసారు. 1978 డిసెంబరులో ప్రధా నమంత్రి మొరార్జీ దేశాయ్ బి.పి. మండల్ ఛైర్మన్‌గా, బీసీలకు రిజర్వేషన్ల కోసం ఐదు గురు సభ్యులతో కమిషన్ వేశారు. మండల్ కమిషన్ నివేదికను 1980 డిసెంబర్ 31న రాష్ట్రపతికి సమర్పించారు. రెండు సంవత్సరాలు పనిచేసి తన నివేదికను సమర్పించినట్లు పైకి కనిపించినప్పటికీ... ఆ కాలంలో అనేక శాసనసభలకు, పార్లమెంటుకు ఎన్నికలు జరిగే ఒత్తిడి మధ్య ప్రజలు, ప్రభుత్వాలు, పార్టీలు తలమునకలై ఉన్న నేపథ్యంలో అనేక కష్టాల కోర్చి సమాచారం సేకరించి కేవలం 10 నెలల్లో ఈ నివేదికను తయారు చేయడం మాటలు కాదు. దేశంలోని 52 శాతం భారతీయుల గురించి, వారి ప్రాతినిధ్యం, అభివృద్ధి, విద్య, ఉద్యోగ అవకాశాల గురించి చట్టసభల్లో వారి ప్రాతి నిధ్యం గురించి స్పష్టంగా సూచించిన ‘మండల్ కమిషన్’ రిపోర్టు భారతదేశ రాజకీయాల్లోనే ఒక కొత్త మలుపు. భారత రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీలకు చట్టసభల్లో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యాసంస్థల్లో ఓబీ సీల అభ్యర్ధులకు 27 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని మండల్ తన నివేదికలో సిఫారసు చేశారు. మండల్ కమిషన్ సిఫారసుల అమలును, 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ కోర్టులలో కేసులు నడిచాయి. ఇంద్రసహాని కేసు పేరున ప్రసిద్ధమైన ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు అనేక కోణా లను పరిశీలించి తన తీర్పును వెలువరించింది. కేంద్ర ప్రభుత్వానికి అనేక సూచనలను, ఆదేశాలను జారీ చేసింది. వాటిని అనుసరించి 1993 నుంచి కేంద్రంలో, రాష్ట్రాల్లో శాశ్వత ప్రాతిపదికపై బీసీ కమిషన్లు ఏర్పడుతూ వస్తున్నాయి. చివరకు 27 శాతం బీసీ రిజర్వేషన్లను ప్రధాన మంత్రి పి.వి. నరసింహారావు అమలులోకి తీసుకువచ్చారు. భారత రాజకీయాల్లో అనేక సంచలనాత్మక మార్పులకు మండల్ కమిషన్ సిఫారసులు కేంద్ర మయ్యాయి. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి విద్యాసంస్థల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టడానికి నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నాయకత్వంలో మానవవనరుల శాఖ మంత్రి అర్జున్ సింగ్ ప్రయత్నించినప్పుడు పెద్ద ఎత్తున వ్యతిరేక, ఆందో ళనలు మొదలయ్యాయి. దాంతో 27 శాతం రిజర్వేషన్ల అమలు కోసం ఆయా విద్యాసంస్థల్లో 27 శాతం సీట్లను అదనంగా పెంచి సామర స్యంగా సమస్యను పరిష్కరించే కృషి చేశారు. అయితే రాజకీయంగా చట్టసభల్లో రిజర్వేషన్లు ఇంకా సాధ్యం కావడం లేదు. ఈ లక్ష్యసాధన కోసం ఓబీసీలు దశాబ్దాలుగా ఆందోళనలు, ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. చెక్కుచెదరని రాజ్యాంగ స్ఫూర్తి భారత రాజ్యాంగ నిర్మాణం తర్వాత భారత సామాజిక రాజకీయాలను కదిలించివేసిన బి.పి. మండల్ 1982 ఏప్రిల్ 13న మరణించారు. రాజకీయరంగం ద్వారా సంఘసంస్కరణలు తీసుకురావడానికి, సామా జిక ఉద్యమాల ద్వారా రాజకీయ సంస్కరణలను తీసుకురావడానికి, రాజకీయాల్లో ఉద్యోగ, విద్య, తదితర రంగాల్లో ప్రాతినిధ్యం లేని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కోసం మహాత్మా జ్యోతిబాఫూలే, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, పెరియార్ ఇ.వి. రామస్వామి నాయకర్, రాంమనోహర్ లోహియా, బిందేశ్వరి ప్రసాద్ మండల్ చేసిన కృషి చరిత్రాత్మకమైనది. భారత రాజ్యాంగంలో ఆయా సామాజిక వర్గాలకు రక్షణలు, ప్రత్యేక కృషి గురించిన ఆర్టికల్స్ చేర్చడం, ప్రణాళికలు, పథకాలు చేప ట్టడంలో వీరి కృషి మహోన్నతమైనది. ఆయన శత జయంతి సంద ర్భంగా మండల్ కమిషన్ నివేదిక తెలుగు అనువాదం పూర్తిచేయడం జరిగింది. మండల్ ప్రాధాన్యత, మండల్ కమిషన్ ప్రాధాన్యత.. కాలం గడిచినకొద్దీ విస్తరిస్తూనే ఉంటాయి. భారతీయ రాజకీయ, సామాజిక చరిత్ర నిర్మాణంలో మండల్ కమిషన్ నివేదిక నిర్వహించిన కీలకపాత్ర ఎవ్వరూ చెరిపివేయలేనిది. బీసీ కమిషన్లకు రాజ్యాంగ ప్రతిపత్తి ఇవ్వడం అందుకు ఒక ప్రతీక. (ఆగస్ట్ 25న బిందేశ్వరి ప్రసాద్ మండల్ శతజయంతి సందర్భంగా) బి.ఎస్.రాములు వ్యాసకర్త ఛైర్మన్, తెలంగాణ బి.సి. కమిషన్, సామాజిక తత్వవేత్త ‘ మొబైల్ : 83319 66987 -
బీసీల వెలుగురేఖ ‘బీపీ మండల్’
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హైదరాబాద్: బీసీలను పట్టి పీడిస్తున్న పేదరికం, వెనుకబాటుతనం నుంచి సమాజంలో వారిని భాగస్వాములను చేసే ప్రయత్నంలో బి.పి. మండల్ ( బిందేశ్వరిప్రసాద్ మండల్) చేసిన కృషి మరవలేనిదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కొనియాడారు. మండల్ కమిషన్‌లోని 40 సిఫారసులను పూర్తిగా అమలులోకి తెచ్చి బీసీల సమగ్రాభివృద్ధికి పాటు పడినప్పుడే ఆ మహనీయుడికి నిజమైన నివాళి అర్పించినట్లవుతుందన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీసీ భవన్లో బి.పి. మండల్ 97వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ మండల్ కమిషన్ రిపోర్టులోని కేవలం రెండు సిఫార్సులు మాత్రమే ప్రభుత్వం అమలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్లయినా మిగిలిన సిఫార్సులు అమల్లోకి రాకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం అన్నారు. బీసీలకు చట్ట సభలలో జనాభా ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల్ కమిషన్ తన సిఫార్సులలో వీటిని ప్రధానంగా సూచించినా.. అవి ఇప్పటికీ అమలు కాలేదన్నారు. కులాల వారీగా బీసీల లెక్కలను తీసి, శాస్త్రీయంగా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మండల్ కమిషన్ చేసిన సిఫార్సుల మేరకు ఇన్నాళ్లకు కేంద్రప్రభుత్వం ముందుకు వచ్చినప్పటికీ, కులాలవారీ లెక్కలను బహిర్గతం చేయకుండా గోప్యంగా ఉంచడం దురదృష్టకరమన్నారు. వెంటనే కులాల వారీగా లెక్కలను ప్రకటించి, బీసీల సమగ్ర అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కోరారు. సామాజిక తత్వవేత్త బి.ఎస్.రాములు మాట్లాడుతూ స్వాతంత్య్రానంతరం ఏర్పాటైన ప్రభుత్వాలన్నీ బీసీలకు రిజర్వేషన్లు నిరాకరిస్తూ వచ్చాయని, జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక బీసీ రిజర్వేషన్ల కోసం కృషి జరిగిందని గుర్తు చేశారు. ఆ క్రమంలోనే బి.పి. మండల్‌తో మండల్ కమిషన్ ఏర్పాటు చేశారన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ, సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బీసీ ఉద్యమ వేదిక ఆవిర్భావం బీసీల సమస్యలపై పోరాడేందుకు బీసీ ఉద్యమ వేదిక పేరు తో మరో సంస్థ ఆవిర్భవించింది. మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో బీపీ మండల్ జయంతి వేడుకల్లో వేదికను ప్రారంభించారు. బీసీ ఉద్యమ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు దేశగాని సాంబశివగౌడ్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు వీజీఆర్ నారగోని, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ప్రొ.పీఎల్ విశ్వేశ్వర్రావు, ఓబీసీ జాతీయ అధ్యక్షులు దునుకు వేలాద్రి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ నాయకులు డాక్టర్ వినయ్‌కుమార్, జైహింద్ గౌడ్, బీసీ సంక్షేమసంఘం మహిళా అధ్యక్షురాలు డా.శారదగౌడ్, ప్రొ.అఖిలేశ్వరి, మేకపోతుల నరేశ్ తదితరులు ప్రసంగించారు. బీసీల రాజ్యాధికారం కోసం మండల్ స్ఫూర్తితో పోరాడాలని వారు పిలుపునిచ్చారు. -
అతి సుస్థిరతకు ‘మండల్’ ముగింపు
జాతిహితం ‘‘మోహన్ కంటే లల్లూ తెలివిగలవాడైతే?’’ఈ ప్రశ్న నాది కాదు. నేనొక వ్యక్తి నుంచి అరువు తెచ్చుకున్నది. ఆయన ప్రశంసలకంటే ఎక్కువగా దూషణలకు గురైన వ్యక్తి. అంతేకాదు, చాలా వరకు మరపున పడిపోయిన మనిషి కూడా. ఆయన, ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) డిమాండ్లపై నియమించిన వివాదాస్పద కమిటీకి నేతృత్వం వహించిన బీపీ మండల్. ఆయన తన 426 పేజీల నివేదికను 1980లో, సరిగ్గా ఇందిరాగాంధీ తిరిగి అధికారంలోకి వచ్చిన ప్పుడు సమర్పించారు. దాన్నామె తక్షణమే పాతరేసేశారు. 1990 ఆగస్టు 7న నాటి ప్రధాని వీపీ సింగ్ దాన్ని అమలు చేస్తామని ప్రకటించేవరకు, ఒక దశాబ్ద కాలంపాటూ అది అలాగే పడి ఉంది. వీపీ సింగ్ మరోవారం తర్వాత, స్వాతంత్య్రదినోత్సవ ఉపన్యాసంలో అదే విషయంపై మాట్లాడటం మన రాజకీయా లను ఒక మలుపు తిప్పింది. దేశాన్ని, కనీసం చిన్న, పెద్ద పట్ట ణాల భారతాన్ని అది భగ్గున మండించేసింది. అగ్రకుల విద్యా ర్థుల్లో అవకాశాలు కోల్పోతామనే భయాన్ని రేకెత్తింపజేసింది. దురదృష్టకరంగా పలువురు ఆత్మాహుతులకు పాల్పడటానికి అది దారి తీసింది. సందర్భవశాత్తూ మన 68వ స్వాతంత్య్ర దినోత్సవం నాడే ఆ సందర్భపు 25వ వార్షికోత్సవం కూడా. ఆ సమస్యకు సంబం ధించిన సారాంశం దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లలో కొన్నిటి పరిష్కారం. సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతల పరిష్కారానికి మించి మరింత ముఖ్యమైన సమస్య మరొకటి నాడు లేదు, నేడూ ఉండదు. మండల్ తన నివేదికలో అద్భుత మేధో ప్రతిభతో, దూరదృష్టితో సంధించిన ‘లల్లూ, మోహన్ల మధ్య పోటీ’ ప్రశ్నతో వివరించినది అదే. ‘మండల్’ చెరగని ముద్ర లల్లూ అనే ఇంగ్లిషు మాధ్యమ విద్యను అందుకోలేని, ఇంట్లో టీవీ లేని పల్లె టూరి పిల్లాడికి నగర వాసియైన మోహన్ అనే పిల్లాడికి ఉండేంత అవగాహన లేదనుకుందాం. లల్లూకి ఇంగ్లిషులో భావవ్యక్తీకరణ శక్తీ, ఇతరులతో కలసి మెలసి పోవడంలో ఆత్మవిశ్వాసమూ తక్కువగా ఉండి, మోహన్ కంటే ఎక్కువ తెలివైనవాడైనా అతనితో పోటీ పడలేడు. లల్లూ మరింత యోగ్యుడే అయినా మోహనే ఎక్కువ ప్రతిభావంతుడని మీరు తీర్పు చేయాల్సి వస్తుంది. ఇంతకూ మండల్ తాను ఆశించినట్టు ప్రతిభకు సంబంధించిన పాత వాదనను తలకిందులు చేయడంలో కృతకృత్యులయ్యారా? ఒక్కసారి ఉన్న ఆధారాలను చూడండి. 1984 తర్వాత పూర్తి మెజారిటీ సాధించినది నేటి మన ప్రధానే. ఆయన ఆ పదవికి ఎన్నికైన మొట్టమొదటి ఓబీసీ అభ్యర్థి కూడా. దేవెగౌడ కూడా ఒకరని అనొచ్చు. అలా అన్నా, అది ఈ వాదనను మరింత బలోపేతం చేసేదే. దేశంలోని ఆరు పెద్ద రాష్ట్రాల్లో (ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర) ఐదింటి ముఖ్య మంత్రులు ఓబీసీలే. దేశ జనాభాలో సగానికి సమానమైన రాష్ట్రాల్లో అధికా రం కోసం పోటీ పడేవారిలో ముఖ్యులంతా ఓబీసీలు లేదా దళితులే. ఆ విష యంలో ఉత్తరప్రదేశ్, బిహార్‌లు విడమరచాల్సిన అవసరమే లేనంతగా సుపరిచితమైనవి. రాజస్థాన్‌లో సైతం ఇప్పుడు వసుంధర రాజేకు, గుజ్జర్ అయిన సచిన్ పైలట్‌కు మధ్యనే పోటీ. బీజేపీ గెలుపు మంత్రం బీజేపీ విశాల హృదయంతో సులువుగా ఈ మార్పును ఆహ్వానించింది. కొత్తగా మండలీకరణం చెందిన బడుగువర్గాలకు సాధికారతను కల్పించింది. అత్యంత విధేయంగా బ్రాహ్మణీయ కుల అంతస్తుల వ్యవస్థను అనుసరించే తన స్వంత డీఎన్ఏనే అది అందుకోసం ధిక్కరించాల్సి వచ్చింది (అందుకు విచారం వ్యక్తం చేస్తున్నాం!). ఈ కాలంలో బీజేపీ ఇంత అద్భుతంగా వృద్ధి చెందడానికి అది కూడా ఒక కారణం. సంఘ్ పరివార్ అనుబంధ సంస్థల్లో చాలా వరకు కూడా అదే బాట పట్టాయి. విశ్వ హిందూ పరిషత్‌లోని ప్రవీణ్ తొగాడియా, వినయ్ కతియార్లే కాదు సాధ్వీ ప్రాచీ సైతం వెనుకబడిన కులాలకు చెందినవారే. అలాగే ఎప్పుడూ పతాక శీర్షికల వేటలో ఉండే సాధ్వీ నిరంజన్ జ్యోతి, సాక్షి మహారాజ్ వంటి బీజేపీ, వీహెచ్‌పీ నేతలు కూడాను. ఆర్ఎస్ఎస్, ప్రత్యేకించి దాని నాగపూర్ పీఠాధిపతులు ఇంతవరకు ఈ మార్పును ప్రతిఘటిస్తూనే ఉన్నా, వారు సైతం అలాంటి పరివర్తన చెదడం ఖాయమేనని చెప్పగలను. మీరు అనుకుంటున్నంత కంటే ముందుగానే ఆ పరివర్తన మీకు కనిపిస్తుంది. ఇదేకాలంలో కాంగ్రెస్ కొందరు సీనియర్ నేతల పిల్లలు మినహా, చెప్పుకోదగిన ఓబీసీ నేతలను తయారు చేసుకోలేకపోయింది. ఈ కాలంలో అది క్షీణించిపోతూ ఉండటానికి అది కూడా ఒక కారణం. అయితే కొందరు ఓబీసీ నేతలను ఇక్కడి నుంచో, అక్కడి నుంచో అది అరువు తెచ్చుకోవడమో లేదా దొంగిలించడమో చేయకపోలేదు. ఉత్తరప్రదేశ్‌లో రామ్‌నరేష్ యాదవ్ (అవును, ఆయనే, మధ్యప్రదేశ్ ‘వ్యాపం’ గవర్నరే), గుజరాత్లో శంకర్ సింఘ్ వాఘేలా అది అలా సంపాదించుకున్నవారే. అయితే ఇలా వచ్చిన వారు నెరపిన ప్రభావం పరిమితం. ప్రస్తుతం ఆ పార్టీ నుంచి అధికారం చలా యిస్తున్న ఏకైక ఓబీసీ నేత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రమే. ఆయనను కూడా మరీ ఇటీవలే అది దేవెగౌడ పార్టీ నుంచి తస్కరించిందని గుర్తుకు తెచ్చుకోండి. ‘మందిర్’ను వెనక్కు నెట్టిన ‘మండల్’ మన రాజకీయాల్లో 1989-91 కాలం పూర్తి గందరగోళం. అందులోంచే ఒక కొత్త రాజకీయ క్రమమూ ఆవిర్భవించింది. ‘మందిర్’, ‘మండల్’ అనే రెండు కాంగ్రెస్ వ్యతిరేక ప్రజా ఉద్వేగపు వెల్లువలు దేశ ప్రధాన భూభాగాన్ని కుదిపే శాయి. అవి రెండూ పరస్పర విరుద్ధమైనవి. మొదటిది హిందూ అగ్రకు లాలను ఆకట్టుకోగా, రెండోదాని ఉద్దేశం కుల విభజనను పూడ్చడమే అయినా, అది కొత్త కుల విభజనను సృష్టించాలని యత్నించింది. అవి రెండూ ఉమ్మడి శత్రువైన రాజీవ్‌గాంధీకి వ్యతిరేకంగా ఐక్యమయ్యాయి. అయితే ఆచరణయోగ్యం కాని ఆ భాగస్వామ్యం ఏడాదికన్నా తక్కువ కాలమే మనగలిగింది. మందిర్ నేత ఎల్కే అద్వానీ అయోధ్య రథయాత్రను ప్రారం భించడంతో అది ముగిసిపోయింది. మండల్ స్టార్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆ మందిర్ రథయాత్రను భగ్నం చేశారు. ఆ తర్వాతి కాలంలో మందిర్‌పై మండల్ పైచేయి సాధించింది. బీజేపీ వెనుకబడిన కులాల్లోని కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకొని తానే స్వయంగా మండలీకరణం చెందాల్సి వచ్చింది. దీంతో అయోధ్య గత 23 ఏళ్లుగా సమస్యగానే లేకుండా పోయింది. అంతేకాదు, మండల్ బిడ్డలు ఉత్తరప్రదేశ్, బిహార్లలో బీజేపీని అధికారంలోకి రాకుండా చేశారు. ఏ భావన ఎక్కువ శక్తివంతమైనదో మీరే గమనించొచ్చు. కులం హిందూ సమాజంలో తెచ్చిన విభజనను మతం ద్వారా ఐక్యం చెయ్యాలనేది బీజేపీ ఆర్ఎస్ఎస్ల యోచన అని నా నమ్మకం. మండల్ ఆ భావనను తుత్తునియలు చేసేసింది. కూలిన కాంగ్రెస్ కోటలు మనం మాట్లాడుతున్న పరిష్కారం అది కాదు. 1989 వరకు దేశం ఎదు ర్కొన్న అతి పెద్ద సమస్య ‘టీనా’ (ప్రత్యామ్నాయం లేదు) అనే అంశం. అది, కాంగ్రెస్ తప్ప వేరే గత్యంతరం లేదనే పరిస్థితిని కల్పించింది. కొద్దిపాటి అంతరాయాలున్నా, కాంగ్రెస్ అటు కేంద్రంలోనూ, ఇటు చాలా రాష్ట్రాల్లోను పరిపాలన సాగించడం కొనసాగింది. ఒక విధంగా చెప్పాలంటే స్వాతం త్య్రానంతరం మనకు నాలుగు దశాబ్దాల అసాధారణ రాజకీయ స్థిరత్వం ఉండేది. ఇది మరీ అతి ఎక్కువ సుస్థిరత. ఏ ప్రజాస్వామిక దేశమూ అలా వృద్ధి చెందజాలదు. అది దేశాన్ని ప్రతిష్టంభనకు గురిచేసి, స్తబ్ధుగా మార్చే స్తుంది. దేశం పురోభివృద్ధి చెందాలంటే రాజకీయాల్లో పోటీతత్వం ఉండాలి. కాంగ్రెస్‌కు అసాధారణమైన ఓట్ల సమ్మేళనం ఉండేది. మిగతా కులాలను సైతం గణనీయంగా ఆకర్షించగల ముస్లిం-బ్రాహ్మణ సమ్మేళనంతో అది దేశ ప్రధాన భూభాగాన్ని శాసించింది. బీజేపీని ఓడించగలిగే అవకాశమున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే కావడంతో, ముస్లింలకు వేరే దాన్ని ఎంచుకునే అవకాశమే ఉండేది కాదు. మండల్ ఆ అడ్డుకట్టను బద్ధలు కొట్టింది. విశ్వసనీయతగలిగిన వెనుక బడిన కులాల పార్టీలతో వీపీ సింగ్ నిర్మించిన మొదటి కూటమి ఉత్తరప్రదేశ్, బిహార్‌లను తుడిచిపెట్టేసింది. ఈ నేతలలో అత్యధికులు లోహియా అనుచ రులు, సోషలిస్టులు. లౌకికవాదులుగా వారికి మంచి గుర్తింపు ఉంది. ముస్లిం లకు వారు ఎంచుకోడానికి ఒక అవకాశాన్ని ఇచ్చారు. ఫలితంగా రెండు పరిణామాలు సంభవించాయి. ఒకటి, కాంగ్రెస్ క్షీణించిపో యింది. ఆ తర్వాత మరెన్నడూ అది జాతీయ స్థాయి మెజారిటీని సాధించలేకపోయింది. రెండు, కాంగ్రెస్ గానీ, బీజేపీగానీ ఆ రెండు రాష్ట్రాలను మళ్లీ పరిపాలించ లేకపోయాయి. బీజేపీ, నితీష్‌కుమార్‌తో కలసి అధికారం చెలాయించినట్టు, ఇప్పుడు జీతన్ మాంఝితో కూటమిగట్టి తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నట్టు... ఏదో ఒక కుల పార్టీకి ఛోటా భాగస్వామిగా మాత్రమే ఆ పని చేయగలిగాయి. బీజేపీకి భిన్నంగా, కాంగ్రెస్ ఈ నూతన వాస్తవికతను అంగీకరించలేదు. ఆ పార్టీ నాయకత్వంలోని అన్నివర్గాలలోనూ ఉన్న వారసత్వ స్వభావం విధించిన పరిమితులు కూడా దానికి ఉన్నాయి. వీపీ సింగ్ ప్రభుత్వం ఓ ఏడాదికంటే తక్కువగానే నిలబడి ఉండొచ్చు. అయితే కాంగ్రెస్‌పై ఆయన పూర్తి ప్రతీకారం తీర్చుకున్నారు. రాజకీయాలే గనుక క్రికెట్ ఆట అయి ఉంటే, నేనా పరిణామాన్ని మండల్ బౌలింగ్‌లో కాంగ్రెస్‌ను వీపీ సింగ్ క్యాచ్ పట్టారని అనేవాడినే. మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేయడం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసేస్తుందని, సమా జాన్ని అస్థిరతకు గురిచేస్తుందని అప్పట్లో విస్తృతంగా భయ పడ్డారు. ఇరవై ఐదేళ్ల తర్వాత, ఈ వారంలో తిరిగిచూస్తే, అది మనల్ని సామాజికంగా మరింత ఐక్యం చేసింది. కరడుగట్టిన కాంగ్రెస్ ఓటు బ్యాంకులను ధ్వంసం చేసి నిజమైన పోటీతత్వం గల రాజకీయాలకు, ఆర్థిక విధానాలకు అవకాశా లను సృష్టించిం ది. అది ‘హిందూ (అల్ప) వృద్ధిరేటు’ను అధిగమించేట్టు చేసింది, పెచ్చరి ల్లుతున్న బీజేపీ హిందుత్వకు అడ్డుకట్ట వేసింది. కుల రాజకీయాల్లో తొలి పాఠాలు వాటిని బోధించినది వీపీ సింగ్‌గానీ లేదా సీతారాం కేసరిగానీ కారు. పాత కాలపువాడైన బాబూ జగజ్జీవన్ రాం. అంబేడ్కర్ తర్వాత దేశవ్యాప్తమైన గుర్తింపును కలిగిన అతి గొప్ప, ఆఖరు దళిత నేత ఆయనే. మొత్తంగా ప్రజాభి ప్రాయం ఆయనను ప్రధాన స్రవంతి నాయకునిగా గుర్తించడమే ఆయన సాధించినవాటిలోకెల్లా ముఖ్యమైనది. 1971 యుద్ధంలో చూపిన నాయకత్వ ప్రతిభతో ఆయన మన చరిత్రలోనే అత్యంత గౌరవనీయుడైన, ప్రేమాదరా లను చూరగొన్న రక్షణ మంత్రిగా నిలిచారు. పాతరేసి ఉంచిన మండల్ రిపోర్టు నుంచి ప్రేరణను పొంది గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు రాష్ట్ర స్థాయిలో తమ సొంత కమిషన్లను నియమిం చాయి. ఓబీసీ రిజర్వేషన్ల అమలును సూచించిన ఆ రెండు నివేదికలను అవి 1985లో అమలు చేశాయి. రెండు రాష్ట్రాల్లోనూ అల్లర్లు చెలరేగాయి. వీపీ సింగ్ ఢిల్లీ భగ్గుమనిపోయేట్టు చేయడానికి ఐదేళ్ల ముందే ఇది జరిగిందని గుర్తుంచుకోండి. గుజరాత్లో ఏ అల్లర్లు మొదలైనా అవి హిందూ-ముస్లిం అల్లర్లుగా మారిపోతుంటాయి. ఎప్పటిలానే ఓబీసీ రిజర్వేషన్ల వ్యతిరేక అల్లర్ల విషయంలోనూ అదే జరిగింది. ‘ఇండియా టుడే’ కోసం ఆ పరిణామాలను నివేదించడం కోసం రిపోర్టర్‌గా నన్ను పంపారు. నిజం చెప్పాలంటే, ఓబీసీ, మండల్ అంశాలను నేను అధ్యయనం చేయడం అదే మొదటిసారి. జగజ్జీవ న్ రాంను కలుసుకోడానికి వెళ్లడానికి ముందు వరకు నాకు రిజర్వేషన్ల వ్యతి రేకుల వాదనలు వాస్తవికమైనవిగానే అనిపించాయి. అప్పటికి రాజకీయాల్లో కనుమరుగై ఉన్న ఆయన ఒక రిపోర్టర్నైన నాకు ఎంతో ఓపికగా రిజర్వేషన్ల సమస్యను వివరించారు. రిజర్వేషన్లు ఆర్థిక విషయాలకు సంబంధించినవి కావు, సాధికారతకు సంబంధించినవని ఆయన అన్నారు. ఆగ్రాలో ఉండే తమ ‘చమార్’ కులానికే చెందిన ఒక మిత్రుని గురించి మాట్లాడారు. అతని ప్పుడు ‘కోటీశ్వరుడు.’ అయినా తన కొడుకు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కావా లని కోరుకుంటున్నాడు. ‘‘నేను వందల కోట్లు సంపాదించినా ఒక బ్రాహ్మ ణుడు మాత్రం నా కుమారుడికి నమస్కరించడు. అదే పోలీసు అధికారి అయితే, బ్రాహ్మణ కానిస్టేబుల్ కూడా సెల్యూట్ చేయాల్సి వస్తుంది’’ అని తన మిత్రుడు అన్నట్టు బాబూజీ తెలిపారు. అంతకన్నా ముఖ్యంగా, మండల్ నివేదికను చదవమని చెప్పారు. దానిలో ‘‘మోహన్‌తో లల్లూకు పోటీ’’ అనే ప్రశ్న ఉన్న భాగాన్ని ఆయన గుర్తు పెట్టి ఉంచుకున్నారు కూడా. ఆ తర్వాత ఆయన రాజీవ్‌గాంధీ వెర్రివాడు. అతనే గనుక గ్రామీణ భారత జీవిత వాస్తవాలను ఎరిగి ఉంటే మండల్ నివే దికను ఇప్పుడు అమలు చేయాల్సింది అన్నారు. ‘‘పట్టణంలో పుట్టి పెరిగినవాడు కాబట్టి రాజీవ్‌గాంధీ గ్రామీణ భార తాన్ని అర్థం చేసుకుని ఉండకపోవచ్చు’’ అన్నాను, నేనేదో మాట సాయం చేస్తున్నట్టుగా. కొంటెతనం తొంగిచూస్తున్న మొహంతో బాబూజీ అన్నారిలా ‘‘అరె, ఎవరన్నారలా అని? ఆసియా క్రీడల గ్రామానికి ఆయన ఎన్నోసార్లు వెళ్లాడే.’’ - శేఖర్ గుప్తా twitter@shekargupta