Mannanur
-
గురుకుల విద్యార్థిని ఆత్మహత్య.. మన్ననూరులో ఉద్రిక్తత
సాక్షి, నాగర్ కర్నూలు జిల్లా: జిల్లాలోని మన్ననూరు గురుకులంలో దారుణం జరిగింది. విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. క్లాస్‌రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని నిఖిత అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మూడు రోజుల క్రితం తోటి విద్యార్థులతో నిఖిత ఘర్షణ పడినట్లు సమాచారం. ఈ క్రమంలో విద్యార్థిని మానసిక వేదనకు గురైనట్లు తెలుస్తోంది. మానసిక వేదనే నిఖిత సూసైడ్‌కు కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొట్టి చంపారని నిఖిత తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థిని తల్లిదండ్రులు నిరసనకు దిగడంతో మన్ననూరు గురుకుల పాఠశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రిన్సిపాల్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చదవండి: రంగారెడ్డి: ఉసురు తీసిన కంత్రీగాళ్లు -
విజిలెన్స్ కమిటీ తనిఖీలు
మన్ననూర్ : పేద విద్యార్థులందరికీ పూర్తిస్థాయిలో ప్రభుత్వ పథకాలు అందాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో విచారణ చేపడుతున్నామని సెల్ సైడ్ ఆఫ్ డిపార్టుమెంట్ (విజిలెన్స్) ఆఫీసర్ ఎంబీఎల్ శ్రీధర్ అన్నారు. శుక్రవారం మన్ననూర్లోని పీటీజీ పాఠశాలలో వివిధ రికార్డులను విజిలెన్స్ బందం సభ్యులు పరిశీలించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ కొంతకాలంగా కొందరు ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు తమ దష్టికి వచ్చిందన్నారు. తమ నివేదికను త్వరలో గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌కు అందజేస్తామన్నారు. ఇందులో విజిలెన్స్ ఏఎస్ సూర్యప్రకాష్‌రెడ్డి, సూపర్వైజర్ మహమూద్‌అలీ, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు భాస్కర్‌రావ్, ప్రిన్సిపాల్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.