marathi artist
-
నటి నగ్న ఫోటోలు.. ఫ్రెండ్ చేసిన పనికి తీవ్ర భావోద్వేగం!
సినిమా ఫీల్డ్ అంటేనే గ్లామర్‌తో నిండిన ప్రపంచం. అవకాశాలు రావాలంటే అంత ఈజీ కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీ కూడా అలానే ఉంటోంది. కాస్త గ్లామర్ ఒలకబోస్తేనే చూసేవారు కష్టమైపోయారు. అలాంటి ఈ ఫీల్డ్‌లో నగ్న ఫోటో షూట్లకు సైతం నటీమణులు వెనుకకాడడం లేదు. అలానే గతంలో ఓ సంఘటనను గుర్తు చేసుకున్న ఓ నటి తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఆమె ఫ్రెండ్ చేసిన పనికి ఎమోషనలైంది. అసలేం జరిగిందంటే.. బాలీవుడ్లో షాహిద్ కపూర్ నటించిన అర్జున్ రెడ్డి సినిమాలో పని మనిషిగా నటించిన మరాఠీ నటి వనితా ఖరత్. ఆమె చేసిన నగ్న ఫోటోషూట్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆమె చేసిన పనికి పలువురు విమర్శించారు కూడా. అయితే తనకు విమర్శల కంటే ప్రశంసలే ఎక్కువగా వచ్చాయని ఆమె వెల్లడించింది. ఇదే ఫోటోలను చూసిన ఆమె ఫ్రెండ్ చాలా అసభ్యంగా ప్రవర్తించాడట. ఆమె ఫోటోలను తన గదిలో గోడకు తగిలించుకుంటానని అడిగాడట. ఆ సమయంలో ఆమె చాలా ఎమోషనల్ అయినట్లు వెల్లడించింది. నగ్న ఫోటో షూట్ కోసం ఎలాంటి స్లీవ్ లెస్ డ్రెస్సులు వేసుకోలేదని తెలిపింది. ఈ విషయాన్ని ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. తనకు దర్శకుడు అనురాగ్ కశ్యప్ అంటే ఇష్టమని.. ఆయనతో కలిసి పని చేయాలని ఆసక్తిగా ఉన్నట్లు మనసులో మాట బయటపెట్టింది. View this post on Instagram A post shared by Vanita Kharat (@vanitakharat19) View this post on Instagram A post shared by Vanita Kharat (@vanitakharat19) -
డైలాగు చెబుతూ.. కుప్పకూలిన నటుడు
నాటకాన్నే శ్వాసిస్తూ.. నాటకం ఆడుతూనే ప్రాణాలు కోల్పోయాడో మరాఠీ కళాకారుడు. సాగర్ శాంతారామ్ చౌగ్లే (38) అనే ఈ కళాకారుడు.. పుణెలో స్టేజి మీద నాటకంలో డైలాగు చెబుతూ ఉండగానే కుప్పకూలిపోయాడు. అతడిని తోటి కళాకారులు, ప్రేక్షకులు కలిసి వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికపే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన సాగర్‌కు పెళ్లయ్యి, ఒక కుమార్తె కూడా ఉంది. అతడి మృతదేహాన్ని స్వస్థలమైన కొల్హాపూర్‌కు తరలిస్తున్నారు. పుణెలో నాటక కళాకారులు స్టేజిమీద ప్రదర్శన ఇస్తూ మరణించడం ఇది రెండోసారి. ప్రముఖ మరాఠీ నటి, నృత్య కళాకారిణి అశ్వినీ ఏక్బోతే కూడా గత సంవత్సరం అక్టోబర్‌లో పుణెలోని భారత నాట్యమందిర్ వేదిక మీద ప్రదర్శన ఇస్తూ మరణించారు. నాటకాల పోటీలో పాల్గొనేందుకు సాగర్, అతడి బృందం పుణెకు వచ్చారు. వాళ్లు 'అగ్నిదివ్య' అనే నాటకం ప్రదర్శిస్తున్నారు. ప్రముఖ సంఘసంస్కర్త సాహు మహరాజ్ జీవిత కథ ఆధారంగా ఈ నాటకాన్ని రూపొందించారు. అందులో సాగర్ సాహు మహరాజ్ పాత్రను పోషిస్తున్నాడు. సాగర్ తండ్రి కూడా గతంలో మరాఠీ నాటకాలు, సినిమాలలో నటించారు.