చేసిన వెధవ పని చాలక..
సిడ్నీ: చేసిన వెధవ పని చాలక దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన ఆస్ట్రేలియా పౌరుడొకడు కోర్టు మెట్లెక్కాడు. చెడ్డ పని చేసినందుకు సమాజ సేవ చేయాలని అతడిని న్యాయస్థానం ఆదేశించింది. 'మ్యాడ్ మాట్'గా గుర్తింపు తెచ్చుకున్న మాథ్యూ మాలొనే ఈ ఏడాది జనవరిలో బతికున్న ఎలుక తలను నోటితో కొరికేశాడు. తర్వాత వోడ్కాతో దాన్ని శుభ్రం చేశాడు. అనంతరం దాని ముఖంపై బాదుతూ 'దాన్ని కొట్టటండి' అంటూ అరిచాడు.
ఈ ఘనకార్యాన్ని వీడియో తీసి ఫేస్బుక్ లో పోస్టు చేశాడు. అతడిపై నెటిజన్లు విరుచుకుపడడంతో పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. 100 గంటల పాటు సామాజిక సేవ చేయాలని అతడిని బ్రిస్బేన్ మేజిస్ట్రేట్స్ కోర్టు ఆదేశించింది. 25 ఏళ్ల మాథ్యూ మాలొనే మూడేళ్ల పాటు జంతువులను పెంచుకోకుండా అతడిపై నిషేధం విధించింది. అయితే తాను చేసిన పని పట్ల అతడు విచారం వ్యక్తం చేశాడు.