Maya movie
-
మా(య)విజయం వెనుక నయన
ఇటీవల విడుదలైన మాయ చిత్ర విజయం హార్రర్ చిత్రాల హవాను మరోసారి నిరూపించింది. తెలుగు మయూరి పేరుతో అనువాదమై అక్కడా విశేష ప్రజాదరణ పొందుతోంది.క్రేజీ నటి నయనతార టైటిల్ పాత్రలో నటించిన చిత్రం మాయ. ఆరి హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ప్రొటెన్షియల్ స్టూడియో పతాకంపై ఎస్ఆర్.ప్రభు నిర్మించారు. దర్శకుడు అశ్విన్శరవణన్ తొలి ప్రయత్నం మాయ.చిత్ర విజయాన్ని యూనిట్ శనివారం సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేసింది.ఈ సందర్భంగా నిర్మాత ఎస్ఆర్.ప్రభు మాట్లాడుతూ నిర్మాతగా మాయ తనకు తొలి చిత్రం అన్నారు.అందువల్ల ఈ చిత్ర విజయం తనకు చాలా ముఖ్యమైనదని అన్నారు.ఈ విజయం వెనుక యూనిట్ కృషి చాలా ఉందని పేర్కొన్నారు. ఎదురు చూసిన విజయం చిత్ర హీరో ఆరి మాట్లాడుతూ ఎంతకాలంగానో ఎదురు చూసిన విజయం మాయ చిత్రం ద్వారా లభించిందని అన్నారు.నెడుంశాలై తొలి విజయాన్ని అందిస్తే ఈ మాయ చిత్రం మంచి గుర్తింపునిచ్చిందన్నారు.మాయ చిత్రంలో నటిస్తున్నానని తెలియగానే చాలా మంది హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో ఎందుకు నటిస్తున్నావని ప్రశ్నించారని వారందరికీ ఈ చిత్ర విజయమే బదులిచ్చిందని అన్నారు.మాయ చిత్రం తెలుగులో మయూరి పేరుతో విడుదలై అక్కడా విజయం సాధించిందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో పాల్గొన్నప్పుడు చాలా మంది తనను గుర్తు పట్టి మయూరి చిత్ర హీరో కదూ అంటూ అభినందిస్తూ తనతో ఫొటోలు దిగడానికి ఉత్సాహం చూపించారని చెప్పారు.మగాడి విజయం వెనుక స్త్రీ ఉంటుందన్నట్లు మాయ చిత్రం విజయం వెనుక నటి నయనతార ఉన్నారని ఆరి అన్నారు.హాలీవుడ్ దర్శకుడు ఎరిన్ఇంగిలాత్ మాయ చిత్రం చూసి ప్రశంసించడం చాలా సంతోషాన్నిచ్చిందని అన్నారు. మాయకు సీక్వెల్ తీస్తా దర్శకుడు అశ్విన్శరవణన్ మాట్లాడుతూ మాయ చిత్ర విజయం తమకు చాలా ముఖ్యమైనదిగా పేర్కొన్నారు.మాయ చిత్రం చూసిన తరువాత చాలా మంది సీక్వల్ తీస్తే బాగుంటుందని పలు సూచనలు చేస్తున్నారనీ కథ బాగా అమరితే కచ్చితంగా మాయ-2 చేస్తాననిదర్శకుడు అన్నారు. ఈ చిత్రాన్ని మయూరి పేరుతో తెలుగులో విడుదల చేసిన సీ.కల్యాణ్ మాట్లాడుతూ తన బ్యానర్లో చేసిన 57వ చిత్రం మాయ అని తెలిపారు. -
నయన్ మాయ వర్కౌట్ అవుతుందా?
ప్రస్తుతం హారర్ చిత్రాల ట్రెండ్ నడుస్తోందన్నది పరిశ్రమ వర్గాల మాట. అనుష్క నటించిన అరుంధతి నుంచే ఈ బాణిపై మోజు పెరిగిందని చెప్పవచ్చు. ఆ మధ్య వచ్చిన పిజ్జా, విల్లా, యామిరుక్కభయమే, ఆ, పిశాచు లాంటి చిత్రాల నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టాయి. ఈమధ్య తెలుగులో రూపొందిన గీతాంజలి లాంటి చిత్రాలు కాసులు తెచ్చిపెట్టాయి. దీంతో ఈ తరహా హార్రర్ చిత్రాల నిర్మాణాల సంఖ్య పెరుగుతోందనే చెప్పాలి. తాజాగా నటినయనతార మాయ చిత్రంతో భయపెట్టడానికి రెడీ అవుతున్నారు. చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్ర తమిళనాడు విడుదల హక్కులను తేనాండాళ్ ఫిలింస్ రామనారాయణన్ కొడుకు మురళి సొంతం చేసుకున్నారు. ఈయన చిత్రాన్ని ఐదు కోట్ల ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి పొందడం విశేషం. చిత్రంలో ప్రధాన ఆకర్షణ నయనతార మాత్రమే. హీరో, దర్శకుడు ఇతర తారాగణం కొత్తవారే. మరి ఈ చిత్రం అంత మొత్తంతో కొనుగోలు చేస్తే వర్కౌట్ అవుతుందా? అన్న ప్రశ్నకు ప్రస్తుతం ఈ తరహా హారర్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. అదే విధంగా నయనతార నటించిన ఈ మాయూ చిత్రం ఇతర చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందన్నారు. ఇంతకుముందు పిశాచు చిత్రాన్ని విడుదల చేసి లాభాలను ఆర్జించిన ఈయన నయనతార మాయ కూడా ఆ మ్యాజిక్ చేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
ప్రతి క్షణం ఉత్కంఠ!
సస్పెన్స్, హారర్, కామెడీ నేపథ్యంలో వినయ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మాయ చిత్రం’. వినయ్‌రాజ్, రుక్షా జంటగా జి. వెంకటేశ్వర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లా డుతూ -‘‘ప్రతి సన్నివేశం ఉత్కంఠగా ఉంటుంది. 20 నిమిషాల పాటు సాగే గ్రాఫిక్స్ అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. మిస్ ఇండియా గుజరాతీ వైశాలి పటేల్ చేసిన ప్రత్యేక పాత్ర ఓ హైలైట్. ఈ చిత్రం పోస్టర్స్ చూసి, హిందీ అనువాద హక్కులను సూపర్ గుడ్ బాలాజీ, మంజునాథ్ తీసుకున్నారు. ఇంకా తమిళ, కన్నడ, మలయాళ భాషలవారు కూడా సంప్రదిస్త్తున్నారు. నవంబర్ 15న పాటలను, డిసెంబర్లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.