నయన్ మాయ వర్కౌట్ అవుతుందా?
ప్రస్తుతం హారర్ చిత్రాల ట్రెండ్ నడుస్తోందన్నది పరిశ్రమ వర్గాల మాట. అనుష్క నటించిన అరుంధతి నుంచే ఈ బాణిపై మోజు పెరిగిందని చెప్పవచ్చు. ఆ మధ్య వచ్చిన పిజ్జా, విల్లా, యామిరుక్కభయమే, ఆ, పిశాచు లాంటి చిత్రాల నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టాయి. ఈమధ్య తెలుగులో రూపొందిన గీతాంజలి లాంటి చిత్రాలు కాసులు తెచ్చిపెట్టాయి. దీంతో ఈ తరహా హార్రర్ చిత్రాల నిర్మాణాల సంఖ్య పెరుగుతోందనే చెప్పాలి. తాజాగా నటినయనతార మాయ చిత్రంతో భయపెట్టడానికి రెడీ అవుతున్నారు.
చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్ర తమిళనాడు విడుదల హక్కులను తేనాండాళ్ ఫిలింస్ రామనారాయణన్ కొడుకు మురళి సొంతం చేసుకున్నారు. ఈయన చిత్రాన్ని ఐదు కోట్ల ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి పొందడం విశేషం. చిత్రంలో ప్రధాన ఆకర్షణ నయనతార మాత్రమే. హీరో, దర్శకుడు ఇతర తారాగణం కొత్తవారే. మరి ఈ చిత్రం అంత మొత్తంతో కొనుగోలు చేస్తే వర్కౌట్ అవుతుందా? అన్న ప్రశ్నకు ప్రస్తుతం ఈ తరహా హారర్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. అదే విధంగా నయనతార నటించిన ఈ మాయూ చిత్రం ఇతర చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందన్నారు. ఇంతకుముందు పిశాచు చిత్రాన్ని విడుదల చేసి లాభాలను ఆర్జించిన ఈయన నయనతార మాయ కూడా ఆ మ్యాజిక్ చేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.