ఆ ఎనిమిది రోజులు మాంసం అమ్మకం బంద్
థానే: మాంసం అమ్మకాలను మహారాష్ట్రలోని మిరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంబీఎంసీ) ఓ ఎనిమిది రోజులపాటు నిషేధించనుంది. ఈ నెలలో జైనులు పవిత్రంగా భావించే ఆ ఎనిమిది రోజులు ఎవరూ మాంసం విక్రయించడానికి వీల్లేదంటూ నిషేధాజ్ఞలు జారీ చేయనుంది. జైనులు పవిత్రంగా ఉండే ఈ ఎనిమిది రోజుల కార్యక్రమాన్ని 'పర్యుషాన్' అని అంటారు.
దీనిని ఈ నెల 11 నుంచి 18వరకు పాటించనున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక భేటీ నిర్వహించిన ఎంబీఎంసీ పాలక మండలి ఈ ఎనిమది రోజులు పూర్తయ్యేవరకు ఎవరూ తమ కార్పొరేషన్లో మాంసం విక్రయించకుండా నిషేధాజ్ఞలు జారీ చేయాలని నిర్ణయించారు. దీనిపై సోమవారం అధికారికంగా నిర్ణయం తీసుకునేందుకు మరో సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి పోలీసులు కూడా హాజరుకానున్నారు.