మరింత థ్రిల్‌గా...!
1993లో ైడె నోసార్ విధ్వంసంతో మూసుకుపోయిన జురాసిక్ పార్క్ గే ట్లు మళ్లీ 2015 జూన్ 11న తెరుచుకుంటున్నాయి. అదేంటి అనుకుంటున్నారా? 1993లో స్టీవెన్ స్పీల్బర్గ్ తెరకెక్కించిన ‘జురాసిక్ పార్క్’ ఒక ప్రభంజనం. 22 ఏళ్ల తర్వాత దానికి కొనసాగింపుగా రానున్న చిత్రం ‘జురాసిక్ వరల్డ్’ ఈ నెల 11న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఇండియాలో విడుదల చేసే హక్కులను ముఖేశ్ మెహతా సొంతం చేసుకున్నారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ‘‘భారతదేశంలో మొత్తం 2500 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం. క చ్చితంగా 100 కోట్ల మార్కుని సాధిస్తుంది. ‘జురాసిక్ పార్క్’ అప్పట్లో ఓ సంచలనం. ఈ సీక్వెల్ కూడా మరింత థ్రిల్‌కి గురి చేసే విధంగా ఉంటుంది’’ అని చెప్పారు.