మెల్డోనియంపై వాడా యూటర్న్
మాంట్రియల్: నిషిద్ధ ఉత్ప్రేరకాల జాబితాలో మెల్డోనియంను కొనసాగించడంపై అంతర్జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) పునరాలోచనలో పడింది. మానవ శరీరంలో మెల్డోనియం బయటపడటానికి ఎంత సమయం పడుతుందో చెప్పడానికి కచ్చితమైన సాంకేతిక సమాచారం లేదు. దీంతో అథ్లెట్లు ఉత్ప్రేరకాన్ని ఈ ఏడాది జనవరి 1కి ముందా లేక తర్వాత తీసుకున్నారా అనే విషయాన్ని చెప్పడం వాడాకు కష్టంగా మారింది.
ఈ ఏడాది జరిపిన డోప్ పరీక్షలో టెన్నిస్ స్టార్ మరియా షరపోవాతో పాటు 172 మంది అథ్లెట్లు ఈ మెల్డోనియంను వాడినట్లు తేలింది. అయితే ఇందులో ఎవరు జనవరి 1 తర్వాత తీసుకున్నారో స్పష్టంగా తేలడం లేదు. మరోవైపు మెల్డోనియంపై వాడా యూటర్న్ తీసుకున్నా... షరపోవా మాత్రం విచారణకు హాజరుకావాల్సిందేనని ఐటీఎఫ్ స్పష్టం చేసింది.