Mesta
-
అన్నంలో ఆరోగ్యాన్ని కలుపుకున్నట్లే!
కాస్తంత ఎక్కువ పులుపు... కాస్త తక్కువ వగరు కలగలిసిన రుచితో గోంగూరను విడిగా వండుకోవచ్చు. అలాగే పప్పు, మాంసాహారాలు... దేనితో కలిపి వండినా రుచినిస్తుంది. అందుకే దీన్ని వంటల్లో విరివిగా వాడతారు. రుచిపరంగా తెలుగువారికి ఎంత ప్రియమో... ఆరోగ్యపరంగా అందరికీ అంత ప్రయోజనం. గోంగూరతో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని. ♦ గోంగూరులో విటమిన్–సి పాళ్లు చాలా ఎక్కువ. దాంతో ఇది మంచి రోగ నిరోధకశక్తిని సమకూర్చుతుంది. ఇందులో విటమిన్–ఏ కూడా ఎక్కువే. చాలా రకాల కంటి జబ్బులను నివారించడంతో పాటు చూపును దీర్ఘకాలం పదిలంగా కాపాడుతుంది. ♦ గోంగూరలో అన్నిటికంటే ఐరన్ పాళ్లు చాలా ఎక్కువ. అందుకే ఇది రక్తహీనతను సమర్థంగా నివారిస్తుంది. అనీమియా వ్యాధిగ్రస్తులకు ఇది మంచి స్వాభావికమైన ఔషధం అని చెప్పవచ్చు. ♦ ఇందులో పీచుపదార్థాలు అధికం. అందుకే ఇది జీర్ణకోశం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పేగుల కదలికలు సమర్థంగా జరిగేలా చూస్తుంది. ఈ పీచుపదార్థాల కారణంగానే స్థూలకాయులు బరువు తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ♦ గోంగూరలో పొటాషియమ్ కూడా ఎక్కువే. అందుకే రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి గోంగూర బాగా ఉపకరిస్తుంది. ♦ మెగ్నీషియమ్ వంటి ఖనిజలవణాల వల్ల మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే మేని నిగారింపునకు, జుట్టు నిగనిగలాడటానికి కూడా గోంగూర సహాయం చేస్తుంది. ♦ గోంగూరలో చెడుకొవ్వును అరికట్టే శక్తి ఉంది. ఈ లక్షణంతో పాటు పొటాషియమ్‌తో రక్తపోటును అదుపు చేసే శక్తి కలగలసి... ఇది గుండె ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుతుంది. -
ఉక్కు కూర
గోంగూరకు కాస్త పుల్లటి రుచి ఉండటంతో... దాన్ని కోడికూరకు చేర్చి చికెన్‌గోంగూర అన్నా, పప్పుకు చేర్చి గోంగూర పప్పు అన్నా... అసలు కూరకు కొత్తరుచి వస్తుంది. అలా కొత్తరుచి తేవడంలో దానికి ఎంత స్పెషాలిటీ ఉందో... కొత్త రక్తం పట్టేలా చేయడమూ సాధ్యమవుతుందని గోంగూరకు ఒక ప్రతీతి ఉంది. గోంగూరలో ఐరన్ పాళ్లు ఎక్కువగా ఉండటం వల్ల దాంతో మనకు కొత్తరక్తం పడుతుంటుంది. అదొక్కటే కాదు.... గోంగూరతో ఒనగూరే మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలివి... ►గోంగూర చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి, గుండెజబ్బులను నివారిస్తుంది. ►గోంగూరలో పొటాషియమ్ పాళ్లు చాలా ఎక్కువ. అందుకే అధిక రక్తపోటును నియంత్రించి, సాఫీగా రక్తప్రసరణ జరిగేలా చూస్తుంది. ►గోంగూరలోని పాలీఫీనాలిక్ కాంపౌండ్స్, యాంథోసయనిన్స్, ఫ్లేవనాయిడ్స్ లాంటి అనేక యాంటీఆక్సిడెంట్స్ వల్ల చాలా రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. క్యాన్సర్ సెల్ తనంతట తానే నశించేలా చేసే (అపాప్టోసిస్ను ప్రమోట్ చేసే) అద్భుతమైన గుణం గోంగూరకు ఉంది. ఫలితంగా క్యాన్సర్ ట్యూమర్లు నశించిపోయేలా చేస్తుంది. ►గోంగూరలో విటమిన్–సి పాళ్లు చాలా ఎక్కువ. అందుకే శరీరానికి రోగనిరోధక శక్తిని సమకూర్చి, ఎన్నో రకాల వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది. ►గోంగూరలో పీచు (ఫైబర్) చాలా ఎక్కువ. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి గోంగూర మంచిది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్నీ పదిలంగా కాపాడుతుంది. ►గోంగూరలోని విటమిన్–సి... ఏజింగ్‌కు కారణమయ్యే ఫ్రీరాడియల్స్ను హరించి, చాలాకాలం యౌవనంగా ఉండేలా చేయడంతో పాటు, చర్మాన్ని నిగనిగలాడేలా చేస్తుంది. -
గోంగూర పులిహోర
కుకింగ్ తయారి సమయం: 45 నిమిషాలు కావలసినవి: గోంగూర ఆకులు – రెండు కప్పులు బియ్యం – 2 కప్పులు (వండి చల్లార్చుకోవాలి) పసుపు – అర టీ స్పూన్ కరివేపాకు – రెండు రెబ్బలు ఉప్పు – రుచికి సరిపడినంత వేరుశెనగ గుళ్లు – 2 టేబుల్ స్పూన్లు ఆవాలు – టీ స్పూన్, మెంతులు – అర టీ స్పూన్ ఎండుమిర్చి – 3, నూనె – 3 టేబుల్ స్పూన్లు పోపు కోసం: శనగపప్పు – టేబుల్ స్పూన్, మినప్పప్పు – టేబుల్ స్పూన్, ఆవాలు, జీలకర్ర – టీ స్పూన్ చొప్పున, ఎండుమిర్చి – 2, పచ్చిమిర్చి – 4, ఇంగువ – పావు టీ స్పూన్, పల్లీలు – గుప్పెడు, తయారి: పాత్రలో టీ స్పూన్ నూనె వేడయ్యాక ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి వేసి కొద్దిగా వేయించి దింపి చల్లార్చాలి అర టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి గోంగూర వేసి పచ్చివాసన పోయేలా 8 నిమిషాల పాటు వేయించి దింపేసి చల్లార్చాలి ముందుగా వేయించిన దినుసులు గ్రైండ్ చేసిన తర్వాత గోంగూర వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. (నీరు కలపకూడదు) పాత్రలో మిగతా నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాక, పచ్చిమిర్చి, పసుపు, ఎండుమిర్చి వేసి అర నిమిషం పాటు వేయించాలి. శనగపప్పు, వేరుశెనగ గుళ్లు, మినప్పప్పు వేసి రెండు నిమిషాలు వేయించాక, ఇంగువ, కరివేపాకు వేసి నిమిషం వేయించి దింపేయాలి చల్లారిన అన్నంలో ముందుగా గోంగూర పేస్ట్ వేసి కలపాలి. తర్వాత చల్లార్చిన పోపు, ఉప్పు వేసి కలపాలి అప్పడం కాంబినేషన్‌తో అందిస్తే రుచిగా ఉంటుంది.