Met Gala 2017
-
ఆ హీరోతో బాత్రూంలో ప్రియాంక: నెటిజన్ల సెటైర్లు
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తొలిసారి 'మెట్ గాలా' ఈవెంట్‌కు హాజరైన ఫొటోలు ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి. అక్కడ రెడ్ కార్పెట్ హొయలు ఒలికించిన ఈ భామ 2017లో తన ప్రియుడు నిక్ జోనస్‌తో కలిసి ఈ కార్యక్రమానికి హాజరైంది. ఈ ఫ్యాషన్ ఈవెంట్‌కు సంబంధించిన పలు ఫొటోలను సింగర్ రీటా ఓరా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ప్రియాంక బ్లాక్ పాంథర్ నటుడు మైఖేల్‌తో మాట్లాడుతోంది. అయితే వీళ్లు కబుర్లు చెప్పుకుంటోంది బాత్రూమ్లో కావడం గమనార్హం. వీళ్లిద్దరితో పాటు మరికొంతమంది కూడా అక్కడే ఉన్నారు. ఈ ఫొటో చూసిన నెటిజన్లు బాత్రూమ్లో చర్చలు పెట్టుకోవడం ఏంటని విమర్శిస్తున్నారు. మీకు వేరే చోటే దొరకలేదా? అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా ప్రియాంక 2018లో రెండోసారి 'మెట్ గాలా'కు హాజరవగా, 2019లో భర్త నిక్‌తో మరోసారి ఈవెంట్లో తళుక్కున మెరిసింది. ఇదిలా వుంటే ఈ ఏడాది ప్రియాంక బోలెడు ప్రాజెక్టులకు సంతకం చేసింది. అందులో టెక్స్ట్ ఫర్ యూ చిత్రాన్ని ఇదివరకే కంప్లీట్ చేయగా మరికొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక ఈ మధ్యే న్యూయార్క్‌లో సోనా అనే రెస్టారెంట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. చదవండి: భారతదేశానికి హాలీవుడ్ సాయం -
ఓసారి మా వీధికి రారాదా!
‘మేడమ్ ఒక్కటంటే ఒక్కసారి మన స్ట్రీట్కొస్తే బాగుంటుంది. మొత్తం వీధి వీధంతా క్లీన్ అయిపోతుంది’. ప్రియాంకా చోప్రా వేసుకున్న పొడవాటి గౌను చూసి, చాలామంది వేసుకున్న జోక్ ఇది. ఫొటోలో కనిపిస్తోన్న గౌనుని చూశాక ఎవరైనా ఇలానే అంటారు. ఇంతకీ ఈ బ్యూటీ ఇంత లాంగ్ ఫ్రాక్ ఎందుకు వేసుకున్నారు? అనే విషయానికి వస్తే... న్యూయార్క్‌లో జరిగిన ‘కాస్ట్యూమ్ ఇన్స్టిట్యూట్ గాలా’గా చెప్పుకునే ‘మెట్‌గాలా–2017’ కోసమే. ఇక్కడికి వివిధ దేశాల స్టార్లు విభిన్న రకాల కాస్ట్యూమ్స్ ధరించి వస్తారు. అలాగే ప్రియాంక చోప్రా కూడా ఈ డిఫరెంట్ లుక్‌తో అందర్నీ ఆకర్షించారు. ఇక... ఈవిడగారి ఫ్రాక్ గురించి వచ్చిన మరికొన్ని జోకులేంటంటే... ‘‘ఐపీఎల్ మ్యాచ్‌లకు వర్షాల బెడద ఉందన్న భయం వద్దు. ప్రియాంక ఒక్కరే గ్రౌండ్ మొత్తాన్ని కవర్ చేయగలరు’’ అని ఒకరు సరదాగా అంటే ‘‘స్వచ్ఛభారత్ అభియాన్‌లో భాగంగా ప్రియాంకచోప్రా డ్రెస్‌ను డిజైన్ చేశారు. పీఎమ్ మోదీకి ఆమె మంచి ఐడియా ఇచ్చారు’’ అని ఇంకొకరు ట్వీట్ చేశారు. ఇలా బోల్డన్ని జోక్స్ మంగళవారం హల్చల్ చేశాయి. -
మెట్ గాలా.. అదరహో!