MiG-21 war plane
-
హిమాచల్లో కుప్పకూలిన యుద్ధవిమానం
సిమ్లా : భారత వాయుసేనకు చెందిన ఎంఐజీ-21 యుద్ధ విమానం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో బుధవారం మధ్యాహ్నం కూలిపోయింది. పంజాబ్లోని పటాన్కోట్ నుంచి బయలుదేరిన యుద్ధ విమానం కాంగ్రా జిల్లాలోని జవాలి సబ్ డివిజన్ పట్టా జతియన్ ప్రాంతంలో కుప్పకూలింది. ప్రమాదం నేపథ్యంలో పైలట్ గల్లంతయ్యారని ప్రాథమిక వివరాలు వెల్లడించాయి. సహాయ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. కాగా భారత వాయుసేన యుద్ధవిమానం కూలిన ఘటన ఇటీవల ఇది మూడవది కావడం గమనార్హం. గత నెలలో గుజరాత్, మహారాష్ట్రలో ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి. జూన్ 5న జామ్నగర్ ఎయిర్ బేస్లో బయలుదేరిన జాగ్వర్ యుద్ధ విమానం కచ్ జిల్లాలో కూలిపోవడంతో సీనియర్ అధికారి మరణించారు. ఇక జూన్ 27న మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని ఓ ద్రాక్ష తోటలో సుఖోయ్-30 యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ పైలెట్ సురక్షితంగా బయటపడ్డారు. -
కూలిన మిగ్-21.. పైలట్ మృతి
శ్రీనగర్: వాయుసేనకు చెందిన మిగ్-21 యుద్ధ విమానం కూలిపోవడంతో యువ పైలట్ మృతి చెందాడు. శిక్షణలో భాగంగా మంగళవారం ఉదయం శ్రీనగర్ నుంచి బయల్దేరిన విమానం... అనంతనాగ్ జిల్లా బిజ్బెహరా సమీపంలోని మిర్హామా వద్ద పొలాల్లో కూలిపోయినట్లు వాయుసేన వెల్లడించింది. ఈ ప్రమాదంలో పైలట్ స్క్వాడ్రన్ లీడర్ రఘువంశి ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. కాగా, పైలట్ మృతి పట్ల నూతన రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంతాపం ప్రకటించారు.