చెరువుల అభివృద్ధితో జలకళ
► మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
► టెంబుర్ని, అనంతపేట్లలో మిషన్ కాకతీయ పనులు ప్రారంభం
దిలావర్పూర్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయ పనులతో రానున్న రోజుల్లో వర్షపు నీటితో చెరువులన్నీ జలకళతో ఉట్టిపడతాయని గృహ నిర్మాణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. దిలావర్పూర్ మండలంలోని టెంబుర్ని గ్రామంలో రెండో విడత మిషన్ కాకతీయలో భాగంగా స్థానిక పెద్ద చెరువు పునరుద్ధరణ పనులను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ, చెరువులను పునరుద్ధరిస్తే తెలంగాణ జళకలతో ఉట్టిపడి సస్యశామలం అవుతుందనే సంకల్పంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని రూపొందించి నిధులు మంజూరు చేశారని తెలిపారు. తద్వారా చెరువుల్లో పూడికతీత జరిగి, ఆ మట్టి చేలల్లో ఎరువుగా పనిచేస్తోందని పేర్కొన్నారు. అంతేగాక చెరువుల్లో నీటి సామర్థ్యం పెరిగి భూగర్భజలాలు సైతం పెరుగుతాయని మంత్రివివరించారు.
నీటిపారుదల శాఖ ఈఈ రమణారెడ్డి, పీఆర్ డీఈ తుకారం, తహశీల్దార్ స్రవంతి, ఎంపీడీవో మోహన్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల ముఖ్యనేత కె.దేవేందర్‌రెడ్డి, ఎంపీపీ పాల్దె లక్ష్మి శ్రీనివాస్, సర్పంచ్ లక్ష్మీసాయారెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు ఎన్.జీవన్‌రావు, నాయకులు పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, నిర్మల్ పట్టణ కౌన్సిలర్ అయ్యన్నగారి రాజేందర్, నాయకులు పీవీ రమణారెడ్డి, ఇప్ప నర్సారెడ్డి, కోడె రాజేశ్వర్, కొండ్రు రమేశ్, ధనె రవి, విజయ్, ధని నర్సయ్య, ఆయిటి గంగారాం, సప్పల రవి, శ్రావణ్‌రెడ్డి, సాంగ్వి వినోద్, వెలుగు రాజేశ్వర్, ఒడ్నం కృష్ణ, భూమేశ్, నాగభూషణ్, భుజంగ్‌రావు, రవి, మహేశ్‌రెడ్డి, సర్పంచులు నంద అనిల్, వినోద్, పీరన్న పాల్గొన్నారు.
మాది రైతు పక్షపాత ప్రభుత్వం
నిర్మల్ టౌన్ : తమది రైతు పక్షపాత ప్రభుత్వమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ మండలంలోని అనంతపేట్ గ్రామంలో ఆదివారం మిషన్ కాకతీయలో భాగంగా చెరువు పూడికతీత పనులను ఆయన ప్రారంభించారు. రూ.70 లక్షలతో గ్రామంలోని చెరువు పూడికతీత పనులను నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. దీంతో గ్రామంలోని 100 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని తెలిపారు. నిర్మల్ నియోజకవర్గంలో మొత్తం 63 చెరువులను మిషన్ కాకతీయలో భాగంగా పూడికతీత పనులను చేపడుతున్నామన్నారు. అనంతపేట్ గ్రామానికి సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని వివరించారు. సీసీ రోడ్లు, డ్రెరుునేజీ నిర్మాణ పనుల కోసం ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపామని తెలిపారు.
గ్రామానికి 50 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. అలాగే లక్ష లీటర్ల సామర్థ్యం గల ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మిస్తామన్నారు. మిషన్ భగీరథలో భాగంగా దిలావర్పూర్ మండలం మాడేగాం వద్ద వాటర్ ట్యాంక్ నిర్మించి తాగునీటి సరఫరా చేపడుతామని పేర్కొన్నారు. జైపూర్‌లో నిర్మిస్తున్న 1800 మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్ విద్యుత్ కేంద్రం త్వరలోనే పూర్తిస్థాయిలో పంపిణీ చేస్తుందని తెలిపారు.
గ్రామస్తులు కోరిన విధంగా అనంతపేట్ నుంచి డ్యాంగాపూర్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపుతామని మంత్రి హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, ఎంపీపీ అల్లోల సుమతి, తహశీల్దార్ నారాయణ, ఎంపీడీవో గజ్జారాం, సర్పంచులు నర్సయ్య, గాండ్ల విలాస్, నరేశ్, ఎంపీటీసీ పంతులు, నాయకులు ముత్యంరెడ్డి, జీవన్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.