minister jagadesh reddy
-
కోమటిరెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారు..
సాక్షి, సూర్యాపేట : జిల్లాలో కాంగ్రెస్ నేతలు శవ రాజకీయాలు చేస్తున్నారంటూ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన సోమవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతు వచ్చే ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ నేతలకు డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. హత్యకు గురైన బొడ్డుపల్లి శ్రీనివాస్ సొంత తమ్ముడని చెప్పుకుంటున్న కోమటిరెడ్డి వచ్చే ఎన్నికల్లో అతడి భార్య లక్ష్మికి నల్లొండ అసెంబ్లీ టికెట్ ఇస్తానని చెప్పి మాట మార్చారని విమర్శించారు. పూటకో మాట మాట్లాడుతున్న కోమటిరెడ్డి ప్రజలందరినీ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే కోమటిరెడ్డికి బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. -
'కాంగ్రెస్‌ను ప్రజలే ఎన్కౌంటర్ చేస్తారు'
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేసినవారిపై చర్యలు తప్పవని మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయనిక్కడ సోమవారం మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గ్యాంగ్‌లు, గ్రూపులు ఎవరి వెంట ఉన్నాయో ప్రజలకు తెలుసునన్నారు. నల్లగొండ జిల్లాలో జరిగిన శ్రీనివాస్ హత్య గురించి.. ఎమ్మెల్యే వీరేశంపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారన్నారు. వెంట తిరిగిన వారే శ్రీనివాస్‌ను చంపినట్టు అతని భార్యే చెప్పిందని గుర్తు చేశారు. శ్రీనివాస్‌కు ప్రమాదం ఉందని ఒక్క పిటిషన్ అయినా ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రజలే ఎన్కౌంటర్ చేస్తారని తెలిపారు. -
‘రైతులకు నాణ్యతతో 9 గంటల విద్యుత్’
హైదరాబాద్: గృహ వినియోగదారులకు 24 గంటల పాటు విద్యుత్ ఇస్తున్నామని, రైతులకు 9 గంటల నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి చెప్పారు. శాసనసభలో విద్యుత్ అంశంపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నామని, మే నెల నాటికి 94 వేలకు పైగా వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరమ్మతులకు గురైన సబ్ స్టేషన్లను 24 గంటల్లోపే సరిచేస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలందరూ తెలంగాణ వైపు చూస్తున్నారన్నారు. విద్యుత్ శాఖలో 20 వేల మంది ఔట్సోర్సింగ్ సిబ్బందిని క్రమబద్ధీకరిస్తామంటూ.. ఇప్పటికే 1100 మందికి పైగా క్రమబద్ధీకరించామని గుర్తు చేశారు.