వీహెచ్ పై దాడిని ఖండించిన శైలజానాథ్
తిరమలలో దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న రాజ్యసభ సభ్యుడు వీ.హన్మంతరావు కారుపై సమైక్యవాదుల దాడిని రాష్ట్ర మంత్రి శైలజానాథ్ శనివారం హైదరాబాద్లో ఖండించారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి ప్రజలే నాయకులని ఆయన స్ఫష్టం చేశారు. సీమాంధ్రలో పార్టీలకతీతంగా ఉద్యమం జరుగుతుందన్నారు.
అయితే ఆ ఉద్యమాన్ని బలోపేతం చేస్తే చాలని ఆయన అభిప్రాయపడ్డారు. సీమాంధ్రలో నూతన పార్టీ ఏర్పాటు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు న్యూఢిల్లీల్లోని అధిష్టానానికి విధేయులుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా వారి ఇలా ఉంటారని శైలజానాథ్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.