కొత్తగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఏర్పాటు
న్యూఢిల్లీ: కేంద్ర కమ్యూనికేషన్,టెక్నాలజీ(ఐటీ) శాఖ ను విభజించి కొత్తగా ఎలక్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖను ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వలు జారీ చేశారు. కొత్తగా ఏర్పడిన ఈ శాఖ ఆధార్, ఇంటర్నెట్ సర్వీసులను ప్రత్కేకంగా పర్యవేక్షిస్తుంది. దీంతో ఈ రంగానికి సంబంధించి రెండు మంత్రిత్వశాఖలు వేర్వేరుగా పని చేయనున్నాయి.
కమ్యూనికేషన్ల శాఖ కింద టెలీకమ్యూనికేషన్, పోస్టల్ డిపార్ట్ మెంటులు పనిచేయనున్నాయి. ఎలక్రానిక్స్, ఇన్ఫరేషన్, టెక్నాలజీ విభాగాలు కొత్త శాఖ కింద పని చేస్తాయి. కొత్తగా ఏర్పడిన ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతీ పౌరుని ఆధార్ నంబర్ అనుసంధానం చేయడంపై ప్రత్యేకంగా పని చేయనుంది.