అటవీ ఉత్పత్తులపై ప్రచారం
ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్
గిరిజన సూపర్ బజార్‌కు భూమి పూజ
ఆసిఫాబాద్: అడవుల్లో గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులపై గ్రామాల్లో విస్తతంగా ప్రచారం చేపట్టాలని ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. రూ. 10 లక్షలతో పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ రహదారిపై గిరిజన సహకార సంస్థ ద్వారా నిర్మించే గిరిజన సూపర్‌బజార్ భవనానికి మంగళవారం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనుల కోరిక మేరకు సూపర్ బజార్ భవన నిర్మాణానికి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే సీడీపీ నిధులు రూ.10 లక్షలు మంజూరు చేశామన్నారు.
గిరిజన శాఖ ఆద్వర్యంలో నిర్వహించే డీఆర్ డీపోలు, సూపర్ బజార్లో నిత్యావసర వస్తువులతో పాటు గిరిజనులు ధరించే చీరెలు, ధోవతులు అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బదావత్ తారాబాయి, సర్పంచ్ మర్సోకోల సరస్వతి, ఏఎంసీ చైర్మన్ గంధం శ్రీనివాస్, సింగిల్‌విండో చైర్మన్ అలిబిన్ అహ్మద్, జీసీసీ మేనేజర్ తారాచంద్, అకౌంటెంట్ యాకయ్య,టీఆర్ఎస్ మండల పార్టీ అద్యక్షుడు గాదెవేని మల్లేశ్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ మహమూద్, ఎంపీటీసీ ఎకిరాల సుగుణాకర్, టీఆర్ఎస్ పట్టణ అద్యక్షుడు అహ్మద్, నాయకులు సాలం, ప్రవీణ్ గౌడ్, అన్సార్, నిసార్, సింగాడె అశోక్,