mlc seats
-
ఆ రెండు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌కే!
సాక్షి, హైదరాబాద్: ఈనెల 29వ తేదీన ఎమ్మెల్యేల కోటాలో జరిగే రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీనే దక్కించుకునే అవకాశముంది. సంఖ్యాబలం పరంగా చూస్తే కాంగ్రెస్‌కు ఒకటి, బీఆర్ఎస్కు ఒకటి రావాల్సి ఉన్నా.. ఈ రెండు స్థానాలకు వేర్వేరుగా నోటిఫికేషన్లు, వేర్వేరుగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో.. అధికార కాంగ్రెస్ పార్టీకి రెండు ఎమ్మెల్సీ స్థానాలు దక్కనున్నాయి. ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు రాజీనామా చేసిన ఏ సభ్యుడి స్థానంలో ఎన్నిక కావడానికి నామినేషన్ వేస్తున్నారో స్పష్టంగా పేర్కొనాలని కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో వారిద్దరూ గతనెల 9వ తేదీన తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీలుగా వీరిద్దరికీ 30 నవంబర్ 2027 వరకు గడువు ఉన్నా.. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో వేర్వేరుగా జరిగే ఈ ఎన్నికలకు బ్యాలెట్ పేపర్లలో ఒకటి తెల్ల, రెండోది గులాబీ రంగులో ముద్రించాలని స్పష్టం చేశారు. మొత్తం సభ్యులు(119), ఎన్నికవ్వాల్సిన స్థానాల సంఖ్య +1తో భాగించడంతో వచ్చే భాగఫలం(ఒకరికి కావాల్సిన ఓట్ల సంఖ్య 59.5)ను నిర్ధారిస్తారు. ప్రస్తుతం వేర్వేరుగా ఎన్నిక నిర్వహిస్తుండటం వల్ల ఒక అభ్యర్థికి కనీసం 59.5 ఓట్లు లభిస్తే ఆ అభ్యర్థి ఎన్నిక కావడానికి వీలుంటుంది. అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 64 మంది సభ్యులున్నందున, రెండు స్థానాలకు వేర్వేరుగా 119 మంది సభ్యులు రెండుసార్లు ఓట్లు వేయాల్సి ఉండడంతో ఈ రెండు స్థానాలూ కాంగ్రెస్‌కే దక్కనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకే నోటిఫికేషన్, ఒకే పోలింగ్ స్టేషన్ ఉంటే.. రెండింటికీ ఒకే నోటిఫికేషన్, ఒకే పోలింగ్ స్టేషన్ ఉన్న పక్షంలో మొత్తం సభ్యుల సంఖ్య(119)ని ఎన్నిక కావాల్సిన స్థానాలు రెండింటికి +1 కలప డం వల్ల 39.6 ఓట్లు లభిస్తే ఒక ఎమ్మెల్సీ స్థానం రావడానికి అవకాశం ఉండేది. ఈ లెక్కన కాంగ్రెస్‌కు ఒకటి, బీఆర్ఎస్కు ఒకటి కచ్చితంగా వచ్చేవి. రెండోస్థానం కైవసం చేసుకోవడానికి ఏ పార్టీకి కూడా మెజారిటీ లేనందున దాదాపు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగే అవకాశం ఉండేది. అయితే ఎన్నికల సంఘం ఈ రెండింటికీ వేర్వేరుగా ఎన్నిక నిర్వహించాలని ఆదేశించింది. అసెంబ్లీలోని కమిటీ హాల్–1లో ఈ ఎన్నిక నిర్వహించనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే వారు ఎస్సీ, ఎస్టీలు రూ. 5 వేలు, మిగిలిన కులాల వారైతే రూ.10 వేలు డిపాజిట్ కట్టాలని పేర్కొన్నారు. -
ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్
-
బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.200 కోట్లు కేటాయించాలి
పాత గుంటూరు : బ్రాహ్మణ కార్పొరేషన్‌కు తక్షణమే చట్టబద్ధత కల్పించి రూ.200 కోట్ల బడ్జెట్‌ను అసెంబ్లీ సమావేశాల్లో కేటాయించాలని బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య జిల్లా అధ్యక్షులు ముత్తనపల్లి శివరామకృష్ణ ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పండరీపురంలోని ఆంధ్ర వల్క క్షేత్రంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ ప్రకారం జరిగిన ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రాధాన్యత ఇవ్వనందున, రాబోయే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని బ్రాహ్మణులకు కేటాయించాలని కోరారు. జిల్లాలో కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి బ్రాహ్మణ సమాఖ్య ద్వారా లబ్ధి చేకూర్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులు డాక్టర్ రమణయశస్వి, కార్యదర్శి తుళ్లూరు ప్రకాష్, కోశాధికారి సోమరాజు శ్రీనివాస్, పాండురంగారావు, కోనంకి మారుతి, పులిపాక ప్రసాద్, సుబ్రహ్మణ్యం, మద్దాలి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు...
శాసన మండలికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు అర్జునుడు ఎంపిక పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నాగుల్ మీరా సాక్షి, విజయవాడ : తెలుగుదేశంలో రెండు దశాబ్దాలకుపైగా పనిచేస్తున్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత నాగుల్‌మీరాలను పదవులు వరించాయి. బచ్చుల అర్జునుడును శాసనమండలి సభ్యుడు(ఎమ్మెల్సీ)గా ఎంపిక చేయగా, నాగుల్ మీరాను పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత నిర్ణయం తీసుకున్నారు. బచ్చులకు ఎమ్మెల్సీ..... టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు గతంలోనే ఎమ్మెల్సీ సీటు కోసం పోటీ పడ్డారు. అయితే ఆయనకు బదులు బీసీ కోటాలో బుద్దా వెంకన్నకు అవకాశం ఇచ్చారు. దాంతో అప్పట్లోనే ఆయన కినుక వహించినా ఆ తరువాత పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మంత్రి దేవినేని ఉమాకు అత్యంత సన్నిహితుని గా బచ్చులకు గుర్తింపు ఉంది. నాగుల్‌మీరా... ..పశ్చిమ నియోజకవర్గం నుంచి 1999 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న ప్రతిసారీ వారికి పశ్చిమ నియోజకవర్గం కేటాయించసాగింది. 2014లో చివరి నిమిషం వరకు నాగుల్మీరానే పశ్చిమ అభ్యర్థిగా ప్రచారం జరిగింది. పొత్తులో భాగంగా ఆ సీటును బీజేపీ దక్కించుకుంది. టికెట్ రాకపోయినా నాగుల్‌మీరా పార్టీ కోసం పనిచేస్తూ వచ్చారు. ఆయనకు ఈ సారి ఎమ్మెల్సీ సీటు ఇస్తారని అంతా భావించారు. అయితే సమీకరణల్లో భాగంగా పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి వరించింది. జిల్లా నుంచి పలువురు ప్రాతినిధ్యం కృష్ణాజిల్లా నుంచి పలువురు టీడీపీ నేతలు ఇప్పటికే వివిధ హోదాల్లో ఉన్నారు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా బాబూ రాజేంద్రప్రసాద్, బుద్దా వెంకన్నలు ఉండగా, టీచర్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా రామకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక జగ్గయ్యపేటకు చెందిన తొండెపు దశరధజనార్దన్ ఎమ్మెల్సీగా ఉన్నారు. మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధ మహిళా కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. పామర్రుకు చెందిన వర్ల రామయ్య హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా, కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా రామానుజయ ఉన్నారు. వీరు కాక, తాజాగా పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని నాగుల్‌మీరాకు ఇచ్చారు. జయ‘మంగళం’..... కైకలూరు నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే జయమంగళం వెంకటరమణ ఎమ్మెల్సీ సీటు ఆశించారు. అయితే ఆయనను పక్కన పెట్టారు. కనీసం కార్పొరేషన్ పదవి కూడా ఇవ్వకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. గతంలో వెంకటరమణకు ఎమ్మెల్సీ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి మాట తప్పారు. మచిలీపట్నం : ఎమ్మెల్సీ పదవికి బచ్చుల అర్జునుడు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. మచిలీపట్నం ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన అంబటి బ్రాహ్మణయ్యకు అనుంగశిషు్యడిగా ఆయన పేరొందారు. బందరుకోట పీఏసీఎస్ అధ్యక్షుడిగా, కేడీసీసీ బ్యాంక్ వైస్‌చైర్మన్‌గా పనిచేశారు. మచిలీపట్నం పురపాలక సంఘం చైర్మన్‌గా 2000 నుంచి 2005 వరకు పనిచేశారు. 2014 ఎన్నికల్లో నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ టికెట్ దాదాపు బచ్చులకు ఖరారైంది. అప్పటి రాజకీయ పరిస్థితుల నేప«థ్యంలో ఆ సీటును వదులుకోవాల్సి వచ్చింది. 2015లో స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా బచ్చుల ఎంపికవుతారనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే అప్పట్లో ఆయనకు పదవి రాలేదు. జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా మంత్రి దేవినేని ఉమాకు నమ్మకస్తుడిగా ఉన్న బచ్చులకు ఎట్టకేలకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. -
ఎమ్మెల్సీ అభ్యర్ధిపై హైడ్రామా
-
కులాల కుమ్ముడు
భీమవరం :తెలుగుదేశం పార్టీలో కులాల కుంపట్లు రాజుకున్నాయి. స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో ఆశావహులు ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు. తమకు ఆదినుంచీ అన్యాయమే జరుగుతోందని.. ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి తమ సేవలకు గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నారు. గ్రూపు రాజకీయాలకు తెరలేపడమే కాకుండా కులాల కోణాన్ని సైతం ప్రయోగిస్తున్నారు. భీమవరం నియోజకవర్గం నుంచి ముగ్గురు నాయకులు ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. వీరంతా సామాజిక వర్గాల వారీగా విడిపోయి రాజకీయాలను వేడెక్కించారు. గత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పార్టీ సీనియర్ నాయకులు మెంటే పార్థసారథి, గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు), వీరవల్లి చంద్రశేఖర్ అభ్యర్థిత్వాన్ని ఆశించారు. అప్పట్లో చంద్రశేఖర్ పేరును పార్టీ అధిష్టానం పరిశీలించినా చివరకు అదే సామాజిక వర్గానికి చెందిన అంగర రామ్మోహనరావుకు ఎమ్మెల్సీ పీఠం కట్టబెట్టింది. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో మెంటే పార్థసారథి, గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు), రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తనయుడు జగదీష్ భీమవరం అసెంబ్లీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పటికప్పుడు టీడీపీలో చేరిన పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) సీటు దక్కించుకోవడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా పనిచేశారు. వీరంతా మూడు గ్రూపులుగా విడిపోయారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గిరీ విషయంలోనూ వర్గాలవారీగా విడిపోయి ఆ పదవి దక్కించుకునేందుకు యత్నిం చి విఫలమయ్యారు. ఎమ్మెల్సీ పదవిని సీనియర్ నాయకుడైన మెంటే పార్థసారథికి కట్టబెట్టేలా అంతా కలిసి ప్రయత్నిద్దామని ఎమ్మెల్యే పులపర్తి అంజి» êబు ఏఎంసీ పాలకవర్గ ప్రమాణ స్వీకార సభలో ప్రకటించడంతో కులం కోణం తెరపైకి వచ్చింది. నియోజకవర్గంలోని అన్ని పదవులూ ఒకే సామాజిక వర్గానికి కట్టబెడతారా అంటూ కొందరు నాయకులు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెంటే పార్థసారథితోపాటు గాదిరాజు బాబు, వీరవల్లి చంద్రశేఖర్ తమ వ్యూహాలకు పదును పెట్టారు. ఎమ్మెల్సీ పదవిని బీసీలకే ఇవ్వాలని ఒక వర్గం పట్టుబడుతోంది. మిగిలిన చోట్లా ఇదే పరిస్థితి ఇప్పటికే స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న అంగర రామ్మోహనరావు ఇదే పదవి కోసం తిరిగి ప్రయత్నిస్తుండగా.. ఏలూరు నగరానికి చెందిన మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ ఈ పదవిపై కన్నేశారు. గతంలో చంద్రబాబు హామీ ఇచ్చినందున ఈ పదవి తనకే దక్కుతుందన్న ధీమాతో అంబికా ఉన్నారు. ఇక్కడా సామాజిక కోణమే నడుస్తోంది. ఇటీవల రాజ్యసభ సభ్యత్వాన్ని ఆయన సామాజిక వర్గానికి చెందిన టీజీ వెంకటేష్‌కు ఇచ్చినందున ఎమ్మెల్సీ పదవి ఈయనకు ఇవ్వకపోవచ్చని టీడీపీలో చర్చ సాగుతోంది. మరోవైపు బీసీ కోటాలో ఏలూరు నుంచి సైదు సత్యనారాయణ, తణుకు నుంచి డాక్టర్ దొమ్మేటి సుధాకర్, వావిరాల సరళాదేవి, తాడేపల్లిగూడెం నుంచి కిల్లాడి ప్రసాద్ ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నాని ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నడుమ సామాజిక చిచ్చు రగులుస్తున్న పదవుల వ్యవహారం ఎటు తిరిగి ఎటు వస్తుందో తెలియక తెలుగు తమ్ముళ్లు తికమక పడుతున్నారు. -
స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీల కసరత్తు
-
తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలు పెంపు
హైదరాబాద్ : తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల సంఖ్యను సర్ధుబాటు చేస్తూ కేంద్ర హోం శాఖ మంగళవారం గెజిట్ విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రంగారెడ్డి,మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాలో ఒక్కో ఎమ్మెల్సీ స్ధానం పెరిగింది. విభజన చట్టంలో తెలంగాణకు 40 ఎమ్మెల్సీ సీట్లు కేటాయించారు. వాటిలో 14 స్థానిక సంస్ధల ఎమ్మెల్సీ కోటా ఉండాల్సి వుండగా ప్రస్తుతం కేవలం 11 ఎమ్మెల్సీ సీట్లు మాత్రమే వున్న నేపథ్యంలో 3 స్థానాలను పెంచారు. త్వరలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. -
మంత్రిని నమ్ముకుంటే అంతే..!
సాక్షి ప్రతినిధి, గుంటూరు : తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీ సీట్లు లభించని నేతలు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వైఖరిపై గుర్రుగా ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎలాంటి గుర్తింపు లభించకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో పనిచేసిన వారికి కాకుండా హైదరాబాద్‌లో లాబీయింగ్ నడిపిన వారికి సీట్లు లభించాయనే మాటలు పార్టీలో వినపడుతున్నాయి. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏంటమ్మా! ఎలా ఉన్నావ్! మనకు మంచి రోజులు వస్తాయ్! బాబు గారు ఉన్నారు! మన కష్టాన్ని గుర్తిస్తారు, నేనుంటాగా అంటూ మభ్యపెట్టి పనులు చేయించుకున్నారని, అనేక ధర్నాలు, రాస్తారోకోలు పుల్లారావు ఆధ్వర్యంలో విజయవంతం చేశామని నేతలు చెబుతున్నారు. జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో చిలకలూరిపేట నుంచి పుల్లారావు రాకపోయినా, వ్యాపార నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వెళ్లినా, గుంటూరు పార్టీ కార్యాలయంలో ఆయనే ఉండి బాధ్యతలు నిర్వహించినట్టుగా పనిచేసిన నేతలకు దిక్కుతోచడం లేదు. పార్టీ అధికారంలోకి వస్తే ‘మన పుల్లారావు’ కు మంత్రి పదవి వస్తుంది, ఆయనకొస్తే మనకు ఏదో ప్రయోజనం చేకూరుతుందని ఆశపడి రెక్కలు ముక్కలు చేసుకున్న నేతలకు ఇప్పుడు మైండ్ బ్లాక్ అయింది. అసలు పార్టీలో ఏమీ జరుగుతోంది, తాము పదవులకు అర్హులం కాదా? లేకపోతే మనీతో రాజకీయం చేయాలా? అనేది అర్థం కాక తికమకపడుతున్నారు. అసలు మంత్రిని నమ్ముకుంటే మంచిదా? లేక తమ ప్రయత్నాలు తాము చేసుకోవడం మంచిదా? మరో నేతను ఆశ్రయించడం మంచిదా అనే మీమాంసలో పడిపోతున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో గుంటూరులోని పలువురు నేతలు సీటు ఆశించారు. అభ్యర్థిని ఖరారు చేయడానికి అనేకసార్లు నేతలు సమావేశం అయ్యారు. దీనిపై జిల్లా నేతలు ఇంకా నిర్ణయం తీసుకోక ముందే అధినేత చంద్రబాబు టీడీపీతో సంబంధం లేని ఏఎస్ రామకృష్ణకు సీటు కేటాయించారు. ఈ విషయంలో కృష్ణాజిల్లాకు చెందిన మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ముఖ్య భూమిక వహించడంతో గుంటూరు నేతలు ఆ సీటు మిస్ అయ్యారు. ఆ తరువాత స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నేతలు ఎన్నో ఆశలు పెంచుకున్నారు. దాదాపు రెండు నెలలపాటు మంత్రి పుల్లారావు కాన్వాయ్‌ను ఆశావహులంతా అనుసరించారు. హైదరాబాద్ వెళ్లేప్పుడు గన్నవరం విమానాశ్రయం వరకు సాగనంపడం, అక్కడి నుంచి వచ్చేటప్పుడు విమానాశ్రయం చేరుకుని ఇంటి వరకు కాన్వాయ్‌ను ఫాలో కావడం వారికి నిత్య కృత్యమైంది. చివరకు పార్టీలో ఎవరూ ఊహించని విధంగా బాపట్ల నియోజకవర్గ ఇన్చార్జి అన్నం సతీష్ ప్రభాకర్ ఆ సీటును తన్నుకు పోయారు. దీనిలో పెద్ద లాబీయింగ్ జరిగిందని పార్టీలో వినపడుతోంది. మంత్రి పుల్లారావును నమ్ముకున్న వారిలో ఎవరికీ సీటు రాకుండా అన్నం సతీష్‌కు లభించింది. మంత్రి ఏ స్థాయిలోనూ తమ సేవలను అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లలేదని, సీటు ఖరారు చేసే రోజు కూడా ఆయనగుంటూరులో ఉండటాన్ని ఆశావహులు తప్పుపడుతున్నారు. ఇక పార్టీ పదవులు కూడా మంత్రి అనుచరుల కంటే ఎమ్మెల్యేలు, ఎంపీల అనుచరులకే లభించాయి. వాటితోపాటు ప్రభుత్వ కార్యాలయాల పనులపై మంత్రి వద్దకు వెళ్లిన వారికి ఎలాంటి ప్రయోజనం కలగడం లేదు. తిరిగి తిరిగి అలసి ఆయన వద్దకు వెళ్లడం మానుకుంటున్నారు.అందుకే మంత్రి కాన్వాయ్‌ను అనుసరించే వాహనాలు పూర్తిగా తగ్గిపోయాయి. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొత్తలో ఆయన కాన్వాయ్‌ను పదిహేను ఇరవై కార్లు అనుసరిస్తే, ఇప్పుడు పోలీస్ ఎస్కార్ట్ వెహికల్స్ మాత్రమే ఉంటున్నాయి. ఇంటి వద్ద, గుంటూరులోని ఐబీ వద్ద మంత్రి కోసం వచ్చే వారి సంఖ్య తగ్గిపోయింది. -
రెండేళ్ల పదవికి అనూరాధ నో
- నామినేషన్ వేసిన ప్రతిభా భారతి - సందిగ్ధంలో ఎమ్మెల్సీ సీటు - గవర్నర్ కోటా సీటుపై అనూరాధ ఆశ సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపు సమీకరణలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటాలో రెండేళ్ల ఎమ్మెల్సీ కోటాకు పంచుమర్తి అనూరాధ నో చెప్పడంతో కథ అడ్డం తిరిగింది. ఎమ్మెల్సీగా గెలుపొందిన పాలడుగు వెంకట్రావు చనిపోవడంతో ఆయన స్థానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత జూపూడి ప్రభాకర్‌కు కేటాయించారు. అయితే, జూపూడికి మన రాష్ట్రంలో ఓటు లేకపోవడంతో ఆయన పోటీచేసే అవకాశం లేకుండాపోయింది. నామినేషన్‌కు గురువారం ఆఖరు రోజు కావడంతో ఆ పదవికి నామినేషన్ వేయమంటూ మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధను చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం. రెండేళ్ల పదవికి వద్దు రెండేళ్ల గడువు మాత్రమే ఉన్న ఈ స్థానానికి తాను పోటీ చేయబోనని అనూరాధ స్పష్టం చేసినట్లు తెలిసింది. తనకు అవకాశం ఇవ్వాలంటే.. తొలుత నిర్ణయించినట్టుగా గవర్నర్ కోటాలోనే ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని, రెండేళ్లకు మాత్రమే పరిమితమయ్యే పదవి తనకు వద్దని అనూరాధ తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో మాజీ స్పీకర్ ప్రతిభా భారతితో హుటాహుటిన ఆ పదవికి నామినేషన్ వేశారు. దీంతో గవర్నర్ కోటాలో మరో మహిళకు అవకాశం కల్పించే కంటే మరొకరికి చాన్స్ ఇవ్వాలంటూ ఆశావహులు కోరుతున్నారు. అనూరాధను పక్కన పెడితే ఆ సీటు నెల్లూరు జిల్లాకు చెందిన బీదా రవీంద్రకు దక్కే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఉమా ఆశీస్సులతో బచ్చులకు.. పంచుమర్తి అనూరాధ నగర మేయర్‌గా పనిచేసే సమయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో చంద్రబాబు ఆమెకు అవకాశం కల్పించారు. అలాగే, తొండేపు దశరథ్ జనార్ధన్ హైదరాబాద్ టీడీపీ కార్యాలయంలో పదేళ్ల పాటు పార్టీ కోసం పనిచేయడంతో చంద్రబాబుతో పాటు పార్టీలోని అనేకమంది సీనియర్ నేతలకు దగ్గరయ్యారు. దీంతో ఆయనకూ సీటు దక్కింది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ సీటు పొందుతున్న బచ్చుల అర్జునుడు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు అత్యంత సన్నిహితుడు. గత ఎన్నికల్లో నూజివీడు, బందరు సీట్లు ఆశించి భంగపడ్డారు. ఉమా సూచన మేరకు బచ్చులకు సీటు దక్కేందుకు మార్గం సుగమమైంది. కాగా, ఇప్పటికే ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసిన వైవీబీ రాజేంద్రప్రసాద్ సర్పెంచిల సంఘానికి దీర్ఘకాలం అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. ఈయన గత ఎన్నికల్లో పెనమలూరు సీటు ఆశించారు. చంద్రబాబుతో నేరుగా పరిచయాలు ఉండటంతో ఆయనకు మరోసారి అవకాశం లభిస్తోంది. స్థానిక సంస్థల కోటాలో ఆరేళ్ల పదవిలో కొనసాగే అవకాశం ఉన్న సీటు బచ్చులకు దక్కుతుందా..? లేదా వైవీబీకి వరిస్తుందా..? అనేది తేలాల్సి ఉంది. గవర్నర్ కోటాలో సీటు వస్తుంది : పంచుమర్తి అనూరాధ తొలుత నిర్ణయించినట్టుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నరు కోటాలోనే తనకు ఎమ్మెల్సీ సీటు ఇస్తారని పంచుమర్తి అనూరాధ ’సాక్షి’కి చెప్పారు. తనకు సీటు తప్పనిసరిగా వస్తుందని, ఏవిధమైన ఇబ్బందులు ఉండబోవని ఆమె అభిప్రాయపడ్డారు. -
జిల్లాకు మరో ఎమ్మెల్సీ స్థానం?
- తెలంగాణకు పెరిగిన మూడు మండలి సీట్లు - స్థానాల పునర్విభజనకు ఈసీ కసరత్తు - స్థానిక సంస్థల కోటాలో మరో స్థానం లభించే ఛాన్స్ సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: జిల్లాకు మరో ఎమ్మెల్సీ స్థానం రానుంది. స్థానిక సంస్థల కోటాలో అదనపు సీటు లభించే అవకాశం ఉంది. రాష్ట్ర పునర్విభజన చట్టం మేరకు శాసన మండలి స్థానాల సంఖ్యను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రచురించడంతో త్వరలోనే ఈ సీటుపై స్పష్టత రానుంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 11 ఎమ్మెల్సీ స్థానాలను 14కు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ సంఖ్యకు అనుగుణంగా మండలి సీట్ల పునర్విభజన ప్రక్రియను చేపట్టాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా ఎమ్మెల్సీ స్థానాల పెంపుపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. స్థానిక సంస్థల ప్రతినిధుల సంఖ్యకు అనుగుణంగా నియోజకవర్గాన్ని డీలిమిటేషన్‌ను చేయనున్నారు. జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లోని కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు సహా దాదాపు వేయి మంది ప్రజాప్రతినిధులున్నారు. దీనికితోడు జీహెచ్ఎంసీలో ప్రస్తుతం 48 డివిజన్లు మన జిల్లా పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం వీటి కాలపరిమితి ముగిసింది. త్వరలోనే వీటికి అదనంగా మరో 50 డివిజన్లు శివార్లలోనే ఏర్పడుతున్నాయి. వీటన్నింటినీ గమనంలోకి తీసుకుంటే జిల్లాకు అదనంగా మరో ఎమ్మెల్సీ స్థానం రావడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పట్నం నరేందర్‌రెడ్డి పదవీకాలం వచ్చే నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో అతిత్వరలోనే దీనికి ఎన్నికల షెడ్యూల్ వెలువడే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో ఈ ఎన్నికను కూడా పునర్విభజన అనంతరం పెరిగే సీట్లతో చేస్తారా? గడువులోపు చేస్తారా? అనే అంశంపై ఎన్నికల కమిషన్ స్పష్టీకరించడంలేదు. కేంద్ర ప్రభుత్వం గురువారమే గెజిట్ ప్రకటించినందున.. కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు పరిశీలించిన తర్వాతే దీనిపై క్లారిటీ వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, లోకల్‌బాడీ కోటాలో రెండు సీట్లు వస్తాయని గత కొంతకాలంగా భావిస్తున్న ఆశావహులు.. సీట్ల సంఖ్యపై మల్లగుల్లాలు పడుతున్నారు. బల్దియా పాలకవర్గం పదవీకాలం ముగియడంతో 48 డివిజన్లు ఖాళీగా ఉన్నందున ఇప్పట్లో స్థానిక సంస్థల కోటా ఎన్నికలు జరిగే అవకాశంలేదని కొందరు అంటున్నారు. అయితే, మొత్తం సీట్లలో 50శాతం సీట్లు తక్కువగా ఉంటే మాత్రమే ఎన్నిక వాయిదా పడుతుందని, ఇక్కడ మాత్రం ఆ పరిస్థితిలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్సీ స్థానాల పెంపుపై సీఈసీ కసరత్తు ప్రారంభిస్తున్నందున సరికొత్త ప్రచారానికి తెరలేచింది. సీట్ల పునర్విభజన పూర్తయితే తప్ప ఎన్నికలుండవనే వాదన తెరపైకి వస్తోంది. -
చంద్రబాబు హ్యాండిచ్చారు
అంబికా కృష్ణ, పాందువ్వ శ్రీనుకు దక్కని ఎమ్మెల్సీ పదవులు ఏలూరు: జిల్లాలో అన్ని స్థానాలూ గెలిచిన టీడీపీ నాయకులకు ఎమ్మెల్సీ పదవుల కేటాయింపు విషయంలో సీఎం చంద్రబాబునాయుడు మొండిచెయ్యి చూపారు. ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాలని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సిఫార్సు చేశారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో అంబికా కృష్ణను పోటీ నుంచి తప్పించారు. ఆ సందర్భంలో ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆయనకు ముఖ్య నాయకులు హామీ ఇచ్చారు. చివరకు ఆయ నకు పదవి కట్టబెట్టే విషయంలో రిక్తహస్తం చూపించారు. టీడీపీ సర్కారులో ఆర్యవైశ్య వర్గానికి ఒక్క కీలక పదవి లేని తరుణంలో అంబికా కృష్ణకు ఎమ్మెల్సీ పదవి ఖాయమని అందరూ భావించారు. ఆయన సైతం ఆ పదవిపై ఆశ పెట్టుకున్నారు. సీఎం చంద్రబాబు అందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకోవడంపై ఆర్యవైశ్యులు ఒకింత ఆవేదనకు గురవుతున్నారు. వైఎస్సార్ సీపీ నుంచి వైశ్య వర్గానికి చెందిన కోలగట్ల వీరభద్రరావు పేరును ఎమ్మెల్సీ పదవికి ఖరారు చేయడంతో పోటాపోటీగా అంబికా పేరు ఉంటుందని వైశ్యులంతా ఆశగా ఎదురు చూశారు. తీరా పెద్దగా పేరులేని వారికి పదవులు కట్టబెట్టడంపై ఏలూరు నియోజకవర్గ నేతలు కొంత గుర్రుగా ఉన్నారు. ఇదిలా వుండగా, జిల్లాలో పలువురు ఎమ్మెల్యేలు టీడీపీ రాష్ట్ర నాయకుడు మంతెన సత్యనారాయణరాజు(పాందువ్వ శ్రీను)కు పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు గతంలోనే విన్నవించారు. అయినా చంద్రబాబు వారి విన్నపాన్ని మన్నించలేదు. పాందువ్వ శ్రీనుకు పదవి వస్తుందనుకున్న క్షత్రియ వర్గం ఆశలు అడియాసలయ్యాయి. -
టీడీపీలో ఎమ్మెల్సీ పోరు
సాక్షి ప్రతినిధి, విజయనగరం : టీడీపీలో ఎమ్మెల్సీ టిక్కెట్ పోరు పతాక స్థాయికి చేరింది. ఆశావహులంతా హైదరాబాద్‌లో మకాం వేశారు. అధినేత చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. ఎవరికి వారు లాబీయింగ్‌లో నిమగ్నమయ్యారు. ఏదో ఒక విధంగా దక్కించుకునేందుకు పైరవీలు చేస్తున్నారు. కొందరైతే ఎంతడిగితే అంత ముట్టజెప్పేందుకు సిద్ధ పడుతున్నారు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడిస్తే ఓకే....లేదంటే స్థానిక సంస్థల కోటాలో...కాదంటే గవర్నర్ కోటాలో ఇవ్వాలంటూ పట్టుబడుతున్నా రు. ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో తెలి యదు గాని ఆశావహులు మాత్రం టెన్షన్లో ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారితో పాటు మాజీ ఎమ్మెల్యేలు, అధిష్టానం హామీతో మొన్నటి ఎన్నికల పొటీ నుంచి తప్పుకున్నవాళ్లు పదవిని ఆశిస్తున్నారు. ఇప్పటికే వారంతా హైదరాబాద్‌లో మకాం వేశారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ చుట్టూ తిరుగుతున్నారు. అధినేత చంద్రబాబు నాయుడు దృష్టిలో పడేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. రాష్ట్ర మహిళా పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి ప్రయత్నిస్తుండగా, అరకు ఎంపీగా పోటీ చేసి నష్టపోయానన్న వాదనతో, ఎస్టీ కేటగిరీలో ప్రాధాన్యం కల్పించాలని గుమ్మడి సంధ్యారాణి కోరుతున్నారు. పార్వతీపురం డివిజన్ రాజకీయాలను ప్రభావితం చేయాలంటే తనకు అవకాశమివ్వాలని మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్ముంనాయుడు అడుగుతున్నారు. ఇక, జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన తనను ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని ద్వారపురెడ్డి జగదీష్, సీనియర్ నేతలగా తమను పరిగణలోకి తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్, గద్దే బాబూరావు ప్రయత్నిస్తున్నారు. ఇక, మొన్నటి ఎన్నికల్లో తనకు రావల్సిన టిక్కెట్‌ను చివరి నిమిషంలో మృణాళినికి ఇచ్చారని, అధికారంలోకి వస్తే తగిన అవకాశాల్ని కల్పిస్తామని హా మీ ఇచ్చారన్న డిమాండ్‌తో చీపురుపల్లికి చెందిన త్రిమూర్తులరాజు పోటీ పడుతున్నారు. వీరంతా ప్రస్తుతం హైదరాబాద్ లో తమ ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. ఇక, ఏ పార్టీ వైపు చూడకుండా, మొదటి నుంచి పార్టీని నమ్ముకుని, ఎటువంటి పదవి పొందని తనకు అవకాశమివ్వాలని జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు కోరుతున్నారు. విజయనగరంలోనే ఉండి తనకున్న లాబీయింగ్ ద్వారా ప్రయత్నాలు సాగిస్తున్నారు. సామాజిక వర్గ కోటాలో, డివిజన్ కోటాలో, స్థానిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలంటూ ఒక్కొక్కరూ ఒక్కో నినాదంతో అడుగుతున్నా రు. ఎవరికి వారు పైరవీలు చేసుకుంటున్నారు. రాష్ట్ర పార్టీలో పట్టు ఉన్న నేతలతో ప్రయత్నాలు సాగిస్తున్నారు. కొందరైతే ఎంతైనా ముట్టజెప్పేందుకు సిద్ధమవుతున్నారు. తీవ్ర పోటీ నెలకొనడంతో బయటికి కలిసిమెలిసి ఉన్నట్టు కన్పిస్తున్నా లోలోపల ఎవరికి వారు చాడీలు చెప్పుకుని, దెబ్బకొట్టుకునే ప్రయత్నం చేసుకుంటున్నారు. నేతల ట్రాక్ రికార్డులను చూడాలని, మొన్నటి ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తామని, ఎంపీపీ పదవులిప్పిస్తామని, నామినేటేడ్ పోస్టులిప్పిస్తామని పెద్ద ఎ త్తున డబ్బులు నొక్కేసిన నేతల్ని, తరు చూ పార్టీలను మారి నేతలను, మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేసే నేతల్ని పక్కన పెట్టాల్సిన అవసరం ఉందని కూడా అధినేత దృష్టికి తీసుకెళ్తున్నారు. -
మండలికి టీఆర్ఎస్ ‘టార్గెట్’!
- ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లపై ఆ పార్టీ కన్ను - తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు గాలం - మండలిలో ఆ పార్టీకి స్థానం లేకుండా చేయాలనే యోచన! - మార్చి 29న ఖాళీ అవుతున్న ఏడు ఎమ్మెల్సీ స్థానాలు - ఈ నేపథ్యంలో దూకుడుగా వెళుతున్న అధికార పార్టీ సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో త్వరలో ఖాళీకానున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కన్నువేసింది. ఇందుకోసం ముందస్తు వ్యూహం పన్నింది. అందులో భాగంగా టీడీపీ నేతలకు గాలం వేస్తోంది. దాంతోపాటు టీడీపీకి మండలిలో స్థానం లేకుండా చేయాలనే ఆలోచనలో టీఆర్ఎస్ ఉన్నట్లు కనిపిస్తోంది. దాదాపు నెల రోజుల కింద తెలంగాణ భవన్లో జరిగిన మంత్రుల సమావేశంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. ‘టీడీపీ నుంచి మరో నలుగురు ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు. వారూ మన పార్టీలో చేరిపోతారు..’ అని చేసిన ప్రకటనే ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీకి ఉన్న పదిహేను మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ముగ్గురు టీఆర్ఎస్లో చేరారు. మిగతా పన్నెండు మందిలో ఒకరు వరంగల్ జిల్లాలో, ముగ్గురు మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్నారు. ఇంకో ఎనిమిది మంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నారు. ఈ ఎనిమిది మందిలో నలుగురు ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ నాయకులు గాలం వేసినట్లు సమాచారం. ఐదు స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలోకే.. మార్చి 29న ఎమ్మెల్యే కోటాలోని ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అయితే అదే తేదీన ఖాళీ అవుతున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. ఈ క్రమంలోనే ఈ ఏడు స్థానాలకూ ప్రకటన వెలువడాల్సి ఉంది. శాసనసభలో ఆయా పార్టీలకున్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి వారు గెలుచుకునే ఎమ్మెల్సీ స్థానాలు ఆధారపడి ఉంటాయి. అసెంబ్లీలోని మొత్తం స్థానాల సంఖ్యను ఖాళీ అయిన (ఎన్నిక జరగాల్సిన ) సీట్ల సంఖ్యతో భాగించి ఒక్కో ఎమ్మెల్సీకి ఎన్ని ఓట్లు అవసరమో లెక్క తేలుస్తారు. ఈ లెక్కన ప్రస్తుతం ఖాళీ అవుతున్న ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఒక్కో ఎమ్మెల్సీకి 16 మంది ఎమ్మెల్యేలు అవసరం. టీఆర్ఎస్ నుంచి గెలిచిన 63 మంది ఎమ్మెల్యేలకు తోడు కాంగ్రెస్ నుంచి నలుగురు, టీడీపీ నుంచి ఒకరు, వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బీఎస్పీ నుంచి ఇద్దరు... మొత్తంగా 9 మంది గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 72కు చేరింది. దీంతో నలుగురు ఎమ్మెల్సీలను సులువుగానే ఎన్నుకోవచ్చు. ఎమ్మెల్సీని గెలుచుకోవాలంటే మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అవసరం. టీఆర్ఎస్తో సన్నిహితంగా ఉంటున్న ఎంఐఎం పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలున్నారు. వారు మద్దతిస్తే మొత్తంగా ఐదు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకోవడం టీఆర్ఎస్కు పెద్ద కష్టం కాకపోవచ్చు. టీడీపీకి స్థానం లేకుండా వ్యూహం.. టీడీపీని శాసనమండలి బరిలో లేకుండా చేయడానికి ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యను తగ్గించే పనిలో గులాబీ నాయకత్వం ఉందని చెబుతున్నారు. టీడీపీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేల కోసం గాలం వేశారని... వారిలో నలుగురు టీఆర్ఎస్ నాయకత్వంతో టచ్‌లో ఉన్నారని అంటున్నారు. పార్టీ మారినా, మారకున్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు క్రాస్ చేస్తే చాలన్న మంతనాలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. రహస్య బ్యాలెట్ కావడం, విప్ వర్తించే అవకాశం లేకపోవడంతో సాధ్యమైనన్ని టీడీపీ ఓట్లను (ఎమ్మెల్యేలను) కొల్లగొట్టే వ్యూహంలో టీఆర్ఎస్ ఉన్నట్లు సమాచారం. మొత్తంగా టీడీపీ-బీజేపీ కూటమి కలిసి ఒక ఎమ్మెల్సీ సీటును గెలుచుకునే సంఖ్యా బలాన్ని కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీని అసలు బరిలోనే లేకుండా చేయడం కోసం ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యను తగ్గించే పనిలో టీఆర్ఎస్ నేతలు ఉన్నారని తెలిసింది. వాస్తవానికి ఇప్పటికే నగరానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవాల్సి ఉన్నా... వివిధ కారణాల వల్ల ఆలస్యమైందని, శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో ఇక ఆలస్యం జరగకపోచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీ సీటును గెలుచుకునే అవకాశం ఉంది. -
ఎమ్మెల్సీ స్థానాలకు కేసీఆర్ స్కెచ్!
పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలను ఎలాగైనా కైవసం చేసుకోవాలని అధికార టీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. అందుకోసం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జేఏసీ నాయకులను రంగంలోకి దింపాలని సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వానికి, టీ జేఏసీకి మధ్య దూరం చాలా పెరిగిందని వినిపించింది. ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించిన వాళ్లలో శ్రీనివాస గౌడ్ మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేగా, స్వామి గౌడ్ శాసన మండలి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. కానీ తెలంగాణ ఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్‌కి మాత్రం ఏ పదవీ దక్కలేదు. మెదక్ లోక్‌సభ టికెట్ ఆశించినా, ఆయనకు భంగపాటు తప్పలేదు. ఆ సమయంలో ఇచ్చిన హామీ మేరకే దేవీ ప్రసాద్‌కు ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరో స్థానానికి అడ్వకేట్ జేఏసీ నేత రాజేందర్ రెడ్డి, మరో జేఏసీ నేత మల్లేపల్లి లక్ష్మయ్య పేరును కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నారు. వీరిద్దరిలో ఎవరికి అదృష్టం వరిస్తుందో చూడాలి. 2009లో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా కె.నాగేశ్వర్ ఎన్నికయ్యారు. అలాగే వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున కపిలవాయి దిలీప్ కుమార్ ఎన్నికయ్యారు. వారిద్దరి పదవీ కాలం 2015 మార్చి 29తో ముగియనుంది. ఆయా స్థానాలకు ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆ రెండు స్థానాలను ఎలాగైనా కైవసం చేసుకోవాలని గులాబి బాస్ స్కెచ్ గీస్తున్నట్లు సమాచారం. -
ఏపీకి మరో 8 ఎమ్మెల్సీ సీట్లు
-
ఏపీకి మరో 8 ఎమ్మెల్సీ సీట్లు
* పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం * విభజన చట్టంలో ఏపీకి 50 స్థానాలే కేటాయించిన కేంద్ర సర్కారు * పెంపు అమలులోకి రావాలంటే విభజన చట్టానికి సవరణ చేయాలి * ఇప్పటికే మండలిలో 8 ఖాళీలు.. త్వరలో మరో 11 సీట్లు ఖాళీ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి స్థానాల సంఖ్యను 58కి పెంచుతూ ఏపీ పునర్విభజన చట్టాన్ని సవరించాలని కేంద్ర మంత్రిమండలి బుధవారం నిర్ణయం తీసుకుంది. దీంతో.. కౌన్సిల్‌లోని ఏయే స్థానాలు పెరుగుతాయనే అంశం చర్చనీయాంశమైంది. ఉమ్మడి రాష్ట్ర శాసనమండ లిలో 90 స్థానాలను విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంపిణీ సమయంలో ఏపీకి 50, తెలంగాణకు 40 ఇచ్చారు. ఈ పంపిణీలో లోపాలు చోటుచేసుకున్నాయన్న విమర్శలు అప్పట్లోనే వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. దాన్నే యథాతథంగా విభజనచట్టంలోనూ పెట్టారు. అసెంబ్లీ స్థానాల సంఖ్య ప్రకారం 175 మంది సభ్యులున్న ఏపీకి 58 ఎమ్మెల్సీ స్థానాలుండాలి. తెలంగాణకు 32 మాత్రమే కేటాయించాలి. 40 కన్నా తక్కువ సంఖ్యలో కౌన్సిల్ స్థానాలు ఉంటే ఆ మండలిని కొనసాగించడానికి వీల్లేదు. తెలంగాణ కౌన్సిల్‌ను యథాతథంగా కొనసాగించడం కోసం ఏపీకి దక్కాల్సిన 8 స్థానాలను తెలంగాణ కోటాలో వేసి 40 కి పెంచేయడంతో సమస్య ఏర్పడింది. ఇప్పుడు ఈ లోపాన్ని సవరించడానికి కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. విభజన చట్టానికి సవరణ చేయాలి... అయితే.. ఏపీలో శాసనమండలి స్థానాలను పెంచాలంటే పార్లమెంటులో రాష్ట్ర విభజన చట్ట సవరణ బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తరువాతే ఏపీ కౌన్సిల్లో స్థానాలు పెరుగుతాయి. గురువారంతోనే పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసిపోయాయి. సవరణ బిల్లును ప్రవేశపెట్టాలంటే మళ్లీ 2015 ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల వరకు ఆగకతప్పదు. ఈ లోగా సవరణ అమల్లోకి రావాలంటే కేంద్రం ఆర్డినెన్సును తేవలసి ఉంటుంది. కేంద్రం ఆర్డినెన్సునో, లేదా పార్లమెంటులో బిల్లునో ఆమోదించాక కౌన్సిల్లో సీట్ల సంఖ్య పెంపుపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపడుతుంది. స్థానిక సంస్థల కోటాలో మరో మూడు స్థానాలు! ప్రస్తుతం ఏపీ కౌన్సిల్లో 5 గ్రాడ్యుయేట్, 5 ఉపాధ్యాయ, 9 స్థానిక సంస్థల నియోజకవర్గాలు, 15 ఎమ్మెల్యే కోటా, 7 గవర్నర్ నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీలున్నారు. వీటికి అదనంగా 8 స్థానాలు చేరనున్నాయి. ఈ ఎనిమిదింటిని ఏయే కోటాలో ఎన్ని పెంచుతారనేది తేలాల్సి ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, శాసనమండలి అధికారులతో సంప్రదించి కోటాల వారీగా స్థానాలను పునర్విభజన చేయాలి. ఉమ్మడి రాష్ట్ర విభజనకు ముందు 13 జిల్లాల్లో స్థానిక సంస్థల మండలి స్థానాలు 20 ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో ఒకొక్కటి చొప్పున, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో రెండేసి చొప్పున మొత్తం 20 స్థానిక సంస్థల మండలి స్థానాలు ఉండేవి. విభజనలో స్థానిక సంస్థల కోటా స్థానాలు ఆంధ్రప్రదేశ్‌కు 17 మాత్రమే కేటాయించడంతో 3 స్థానాలు తగ్గిపోయాయి. దీంతో రెండేసి స్థానాలకు ప్రాతినిధ్యం ఉన్న విశాఖ, కృష్ణా, చిత్తూరు జిల్లాలకు ఒకొక్క స్థానాన్ని తగ్గించారు. తూర్పు, పశ్చిమగోదావరి, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో మాత్రమే రెండేసి స్థానిక సంస్థల మండలి స్థానాలు ఉన్నాయి. ఇపుడు అదనంగా వచ్చే ఎనిమిదింటిలో మూడింటిని స్థానిక సంస్థల కోటాలో వేసే అవకాశాలున్నాయంటున్నారు. ఇక టీచరు, గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో ఒకొక్కటి చొప్పున, ఎమ్మెల్యే కోటాలో రెండు పెరిగే అవకాశాలున్నాయని చెప్తున్నారు. అయితే ఇదంతా ఎన్నికల సంఘం చేపట్టే పునర్విభజన చర్యలను అనుసరించి ఉంటుందని మండలి వర్గాలు పేర్కొంటున్నాయి. 2019 నాటికి మండలి స్థానాలు 75 ఇదిలావుంటే.. ఇప్పుడున్న అసెంబ్లీ స్థానాల సంఖ్యను అనుసరించి కౌన్సిల్లో స్థానాల సంఖ్య 58కి పెరుగుతున్నా 2019 నాటికి ఆ సంఖ్య 75కి చేరుకోనుంది. 2019 ఎన్నికల నాటికి అసెంబ్లీ స్థానాల సంఖ్యను 225కి పెంచాలని ఏపీ విభజన చట్టంలోనే పేర్కొన్నందున ఆమేరకు శాసనమండలి స్థానాలూ పెరుగుతాయి. మరోవైపు.. 2015 మార్చి, ఏప్రిల్‌లలో శాసనమండలిలో ఖాళీల సంఖ్య భారీగా పెరగనుంది. ప్రస్తుతం కౌన్సిల్లో 50 స్థానాలకు గాను 41 మందే ఉన్నారు. 8 ఖాళీ ఉన్నాయి. ఇవి కాకుండా 2015లో ఎమ్మెల్యే కోటాలో 4, లోకల్ బాడీ కోటాలో 3, టీచర్ నియోజకవర్గాల్లో 2, గవర్నర్ కోటాలో 3 (ఇందులో షేక్ హుస్సేన్ ఇదివరకే రాజీనామా చేశారు) స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ ఖాళీలను భర్తీచేయాల్సి ఉంటుంది. ఆలోగానే అదనంగా పెరిగే 8 స్థానాల కేటాయింపు పైనా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటే కనుక వాటినీ కలిపితే మొత్తం 27 స్థానాలను భర్తీ చేయాల్సి ఉంటుందని అధికారవర్గాలు వివరించాయి. ఏపీ మండలి స్థానాలు 58కి పెంపు విభజన చట్టం సవరణకు కేబినెట్ ఆమోదం సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో సభ్యుల స్థానాల సంఖ్యను 58కి పెంచుతూ ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సీట్ల సంఖ్య 175 ఉంది. రాజ్యాంగపరంగా ఇందులో మూడో వంతు సంఖ్యకు మించకుండా ఎమ్మెల్సీ స్థానాలను ఖరారుచేస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 23(1), సెక్షన్23(2)(1)(ఎ) ప్రకారం 50 సీట్లకే పరిమితం చేశారు. ఇప్పుడు తాజాగా దీన్ని 58కి పెంచుతూ ఈ చట్టాన్ని సవరించాలని కేంద్రం నిర్ణయించింది.