రెస్టారెంట్లో కాల్పులు: మందుబాబులు మృతి
మెక్సికో: ఉత్తర మెక్సికోలోని అత్యంత సంపన్న నగరాలలో ఒకటైన మోంటరీలో దారుణం చోటు చేసుకుంది. రెస్టారెంట్లోని బీర్లో హాల్లో మందు తాగుతున్న వారిపై దుండగులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 10 మంది మరణించారని పోలీసులు ఉన్నతాధికారులు వెల్లడించారు. అనంతరం వారి వద్ద నగదు దొంగిలించిన ఆగంతకులు అక్కడి నుంచి పరారైయ్యారని తెలిపారు.
ఈ కాల్పుల్లో ఏడుగురు అక్కడికక్కడ మరణించగా మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారని చెప్పారు. శుక్రవారం సాయంత్రం రెస్టారెంట్ వద్దకు రెండు మోటర్ సైకిళ్లపై ఆయుధాలతో వచ్చిన ఆగంతకులు... రెస్టారెంట్లోకి ప్రవేశించి విచక్షణరహితంగా కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.